సెప్టెంబర్ 2014 నుంచి ఫోర్స్ గుర్ఖా డెలివరీలు ప్రారంభం

Written By:

ఫోర్స్ మోటార్స్ గడచిన సంవత్సరం ఫిబ్రవరిలో ప్రకటించిన సరికొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ సెప్టెంబర్ 2014 నుంచి కస్టమర్ల చెంతకు రానుంది. వాస్తవానికి ఫోర్స్ మోటార్స్ 2013లోనే ఈ మోడల్ ధరలను ప్రకటించినప్పటికీ, దీనిని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురాలేదు. అప్పటి నుంచి ఫోర్స్ గుర్ఖా విషయంలో నిపుణలు, కస్టమర్లు ఇచ్చి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా కంపెనీ ఇందులో కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చేసినట్లు సమాచారం.

ఆఫ్-రోడ్ వాహన ప్రియులకు 'ఫోర్స్ గుర్ఖా' ఎస్‌యూవీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పురాతన ఫోర్స్ గుర్ఖాతో పోల్చుకుంటే పెర్ఫామెన్స్, డిజైన్‌ల పరంగా మరింత మెరుగ్గా ఉండేలా ఫోర్స్ మోటార్స్ తమ సరికొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీని అభివృద్ధి చేసింది. ఈ సరికొత్త గుర్ఖా ఎస్‌యూవీలో మెర్సిడెస్ బెంజ్ నుంచి గ్రహించిన పవర్‌ఫుల్ 2.6 లీటర్ ఓఎమ్616 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సెప్టెంబర్ 2014 నుంచి ఫోర్స్ గుర్ఖా డెలివరీలు

కొత్త ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీలో ఉపయోగించిన 2.6 లీటర్ ఓఎమ్616 డీజిల్ ఇంజన్ గరిష్టంగా 81 బిహెచ్‌పిల శక్తిని, 230 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

సెప్టెంబర్ 2014 నుంచి ఫోర్స్ గుర్ఖా డెలివరీలు

రీడిజైన్డ్ హెడ్‌లైట్స్, కొత్త గ్రిల్‌తో ఇది సరికొత్త ఫ్రంట్ లుక్‌‌ను కలిగి ఉంటుంది. ఫోర్స్ గుర్ఖా ప్రస్తుతానికి బిఎస్-3 మరియు బిఎస్-4 వెర్షన్‌‌లలో అందుబాటులోకి రానుంది.

సెప్టెంబర్ 2014 నుంచి ఫోర్స్ గుర్ఖా డెలివరీలు

గతంలో ఫోర్స్ మోటార్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం, ఫోర్స్ గుర్ఖా మొత్తం మూడు వేరియంట్లలో లభ్యం కానుంది.

సెప్టెంబర్ 2014 నుంచి ఫోర్స్ గుర్ఖా డెలివరీలు

ఈ మూడు వేరియంట్లలో ఒకటి ఫోర్-వీల్ డ్రైవ్, హార్డ్-టాప్‌తో కూడిన 5-సీటర్ వేరియంట్ కాగా రెండు సాఫ్ట్ టాప్‌తో కూడిన 6-సీటర్ వేరియంట్స్ (వీటిల్లో ఒకటి టూ-వీల్ డ్రైవ్ మరొకటి 4-వీల్ డ్రైవ్).

సెప్టెంబర్ 2014 నుంచి ఫోర్స్ గుర్ఖా డెలివరీలు

ఫోర్స్ గుర్ఖా ఈ సెగ్మెంట్లో మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న ఆఫ్-రోడర్ 'థార్' ఎస్‌యూవీతో తలపడనుంది.

సెప్టెంబర్ 2014 నుంచి ఫోర్స్ గుర్ఖా డెలివరీలు

గడచిన ఫిబ్రవరిలో ఫోర్స్ మోటార్స్ వెల్లడించిన దాని ప్రకారం, గుర్ఖా ధరలు ఇలా ఉన్నాయి (ధరలను తర్వాతి స్లైడ్‌లో పరిశీలించండి). అయితే, సెప్టెంబర్ 2014లో కంపెనీ విడుదల చేయనున్న గుర్ఖాకు ఇదే ధరలను వర్తింప జేస్తుందా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

సెప్టెంబర్ 2014 నుంచి ఫోర్స్ గుర్ఖా డెలివరీలు

* ఫోర్-వీల్ డ్రైవ్, హార్డ్-టాప్ - రూ.8.50 లక్షలు

* ఫోర్-వీల్ డ్రైవ్, సాఫ్ట్-టాప్ - రూ.8.35 లక్షలు

* టూ-వీల్ డ్రైవ్, సాఫ్ట్-టాప్ - రూ.6.25 లక్షలు

(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

English summary
Force Motors has confirmed that the Gurkha will be on sale from September 2014. The Force Gurkha will be available with a hard top roof version and two variants will be soft top versions.
Story first published: Thursday, June 5, 2014, 15:30 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark