బ్రెజిల్‌లో ఫోర్డ్ కా (నెక్స్ట్ జనరేషన్ ఫిగో) ఆవిష్కరణ

By Ravi

అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్‌కు చెందిన బ్రెజిల్ విభాగం ఫోర్డ్ ఆస్ట్రేలియా గతంలో పలు ఆటో షోలలో ప్రదర్శించిన కా కాన్సెప్ట్ (నెక్ట్స్ జనరేషన్ ఫోర్డ్ ఫిగో)కి ప్రొడక్షన్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఫోర్డ్ కా హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే దక్షిణ అమెరికా దేశంలో విడుదల కానుంది.

కాన్సెప్ట్ వెర్షన్‌కి, ప్రొడక్షన్ వెర్షన్‌కి పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏమీ లేవు. ప్రొడక్షన్ వెర్షన్ కారులో స్మోక్డ్ హెడ్‌ల్యాంప్స్, క్రోమ్ హారింజాంటల్ స్లాట్స్, బ్లాక్ హనీకోంబ్ గ్రిల్ డిజైన్ వంటి మార్పులు తప్ప కాన్సెప్ట్‌కి, ప్రొడక్షన్ మోడల్‌కి పెద్దగా మార్పులు లేవు. బ్రెజిల్ వెర్షన్ ఫోర్డ్ కా (ఫిగో) హ్యాచ్‌బ్యాక్‌లో 1.0 లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు.


ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‌పిల శక్తిని, 105 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ పెట్రోల్ మరియు ఇథనాల్ ఇంధనాలతో నడుస్తుంది.

ఫోర్డ్ తమ కా హ్యాచ్‌బ్యాక్‌ను నెక్స్ట్ జనరేషన్ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌గా భారత మార్కెట్లో కూడా విడుదల చేయనుంది. అయితే, ఇది వచ్చే ఏడాదిలోనే ఇండియాకు వస్తుంది. ఇండియన్ వెర్షన్ నెక్స్ట్ జనరేషన్ ఫిగో కూడా దాదాపు ఇదే డిజైన్‌ను కలిగి ఉండనుంది. అయితే, ఇంజన్ విషయంలో ఫోర్డ్ ఇందులో డీజిల్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Next Gen Figo
Most Read Articles

English summary
Ford Brazil has revealed the production version of the Ka Concept hatchback that was first revealed in November last year. The Ka hatchback will be launched soon in the South American country.
Story first published: Wednesday, June 11, 2014, 9:01 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X