YouTube

పెరిగిన హోండా కార్ల ధరలు; ఏ మోడల్‌పై ఎంత పెరిగింది?

By Ravi

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ భారత విపణిలోవి తమ కార్ల ధరలను జనవరి నుంచి పెంచనున్నట్లు మనం ఇదివరకటి కథనంలో చదువుకున్నాం. కాగా.. కంపెనీ ఇప్పుడు తమ ధరల పెంపు వివరాలను ప్రకటించింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.

మోడల్‌ని బట్టి హోండా కార్ల ధరలు రూ.60,000 వరకూ పెరిగాయి. పెరుగుతున్న ఉత్పాదక వ్యయం మరియు ఎక్సైజ్ రాయితీల తొలగింపు నేపథ్యంలో ధరల పెంపు అధికంగా ఉంది. హోండా అందిస్తున్న వివిధ కార్లపై ధరల పెంపు వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

బ్రయో

బ్రయో

హోండా అందిస్తున్న బ్రయో కారు ధరలు రూ.15,000 నుంచి రూ.18,000 వరకూ పెరిగాయి. తాజా పెంపు తర్వాత ఈ కారు ధరలు రూ.4.2 లక్షల నుంచి రూ.6.30 లక్షలకు పెరిగాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

అమేజ్

అమేజ్

హోండా అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ అమేజ్ కారు ధరలు రూ.19,000 నుంచి రూ.26,000 వరకూ పెరిగాయి. తాజా పెంపు తర్వాత ఈ కారు ధరలు రూ.5.18 లక్షల నుంచి రూ.7.78 లక్షలకు పెరిగాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

సిటీ

సిటీ

హోండా అందిస్తున్న సిటీ సెడాన్ ధరలు రూ.48,000 వరకూ పెరిగాయి. తాజా పెంపు తర్వాత ఈ కారు ధరలు రూ.7.53 లక్షల నుంచి రూ.11.53 లక్షలకు పెరిగాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

సిఆర్-వి

సిఆర్-వి

హోండా అందిస్తున్న సిఆర్-వి ఎస్‌యూవీ ధరలు రూ.60,000 వరకూ పెరిగాయి. తాజా పెంపు తర్వాత ఈ కారు ధరలు రూ.20.85 లక్షల నుంచి రూ.24.96 లక్షలకు పెరిగాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

మొబిలియో

మొబిలియో

హోండా మొబిలియో ఎమ్‍‌పివిపై ఎంత మేర ధర పెంచాలనే విషయాన్ని కంపెనీ ఇంకా నిర్ణయించలేదు.

Most Read Articles

English summary
Honda Cars India has increased prices of its vehicles by up to Rs. 60,000 following the expiry of reduced excise duty concessions and also to offset rising input costs. 
Story first published: Tuesday, January 6, 2015, 11:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X