హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్ [25 ఫొటోలు]

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్, రేపు (మార్చ్ 17, 2015) 'హ్యుందాయ్ ఐ20 యాక్టివ్' (Hyundai i20 Active) అనే క్రాసోవర్ మోడల్‌ను మార్కెట్లో విడుదల చేయనున్న సంగతి తెలిసినదే. హ్యుందాయ్ అందిస్తున్న ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను ఆధారంగా చేసుకొని ఈ ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌ను తయారు చేశారు.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ మోడల్‌ను జర్మనీలోని రస్సెల్స్‌హీమ్ వద్ద ఉన్న హ్యుందాయ్ డిజైన్ సెంటర్‌లో డిజైన్ చేశారు. ఈ క్రాసవర్ మోడల్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉన్నాయి. ఇటు సిటీ డ్రైవింగ్, అటు ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కి అనుగుణంగా ఉండేలా అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఈ కారును తీర్చిదిద్దారు.

మరి హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మోడల్‌లో ఉన్న ఆ విశిష్టతలు ఏంటో ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి..!

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ మోడల్‌లో అనేక కాస్మోటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. తర్వాతి స్లైడ్‌లలో మరిన్ని డిటేల్స్‌ను చూడండి.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ ఫ్రంట్ ప్రొఫైల్.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ రియర్ ప్రొఫైల్.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ సైడ్ ప్రొఫైల్.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌లో ఫ్రంట్ బంపర్‌లోనే అమరి ఉండే ఎయిర్‌డ్యామ్, దానికి అనుసంధానమై ఉండే సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్‌లో హారిజాంటల్, వెర్టికల్ లైన్స్ ఉంటాయి. ఎయిర్‌డ్యామ్‌లో హనీకోంబ్ గ్రిల్ ఉంటుంది.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ వెనుక బంపర్ ట్రైకలర్ (మూడు రంగుల)లో ఉంటుంది. గుండ్రటి రిఫ్లెక్టర్స్, రిఫ్లెక్టర్‌లోనే అమరి ఉండే రివర్సింగ్ ల్యాంప్‌ను ఇందులో చూడొచ్చు.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను పెంచేందుకు గాను కంపెనీ ఇందులో పెద్ద అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేయనుంది. ఈ అల్లాయ్ వీల్స్ డిజైన్ ఫొటోలో చూపించినట్లుగా ఉంటుంది.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌లో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఈ లైట్‌కి క్రింది భాగంలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్ ఉంటాయి.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌లో గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి. వీటిని బంపర్‌లో చక్కగా అమర్చారు.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ రియర్ బ్రేక్/టెయిల్ ల్యాంప్ డిజైన్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇవి ఎల్ఈడి స్టయిల్ లుక్‌నిస్తుంది.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

అన్ని రకాల రోడ్లపై బెటర్ రోడ్ గ్రిప్ కోసం హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌లో వెడల్పాటి టైర్లను ఆఫర్ చేయనున్నారు.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌లో టర్న్ ఇండికేటర్లతో కూడిన సైడ్ మిర్రర్స్ లభ్యం కానున్నాయి. ఇవి బాడీ కలర్ మరియు బ్లాక్ కలర్‌తో లభిస్తాయి.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌లో ఫ్యూయెల్ లిడ్ డిజైన్ విశిష్టంగా ఉంటుంది. ఇది సిల్వర్ కలర్‌లో ఉంటుంది.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

ఇక ఇంటీరియర్స్‌ను గమనిస్తే ఇందులో కూడా ఎలైట్ ఐ20 మాదిరిగా ప్రీమియం క్యాబిన్ ఉంటుంది. త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్‌ను ఇందులో చూడొచ్చు.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ ఆరెంజ్ అండ్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌తో లభిస్తుంది.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

అలాగే.. హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ బ్లూ అండ్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్‌తో కూడా లభ్యం కానుంది.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్‌లో ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ ఫ్రంట్ సీట్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ రియర్ సీట్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ రియర్ సీటింగ్ స్పేస్.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఐ20 యాక్టివ్‌లో 1197సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 82 హెచ్‌పిల శక్తిని, 115 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ ఐ20 యాక్టివ్‌లో 1396సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 89 హెచ్‌పిల శక్తిని, 220 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

పెట్రోల్ వెర్షన్ హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ సర్టిఫైడ్ మైలేజ్ 18.6 కెఎంపిఎల్.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

డీజిల్ వెర్షన్ హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ సర్టిఫైడ్ మైలేజ్ 22.54 కెఎంపిఎల్.

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ డిటేల్స్

హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ క్రాసోవర్ ధర, ఇతర వివరాలు మార్చ్ 17న వెలల్డి కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
South-Korean automobile manufacturer will be launching its i20 Active on 17th March, 2015. This vehicle has been spied several times on Indian roads and will be finally launched.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X