హ్యుందాయ్ కార్ల ధరల పెంపు; ఏ మోడల్‌పై ఎంత పెరిగింది?

భారతదేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, ఈ ఏడాది జనవరి నుంచి తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు తమ ధరల పెంపు వివరాలను ప్రకటించింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

కంపెనీ అందిస్తున్న చిన్న కారు ఇయాన్ నుంచి ప్రీమియం ఎస్‌యూవీ శాంటాఫే వరకూ అన్ని రకాల మోడళ్లను ధరలను పెంచుతున్నట్లు హ్యుందాయ్ పేర్కొంది. మోడల్‌ని బట్టి ఈ పెంపు రూ.15,000 నుంచి రూ.1,27,000 వరకూ ఉంటుందని కంపెనీ వివరించింది.

పెరిగిన ఉత్పాదక వ్యయం మరియు ఎక్సైజ్ రాయితీల తొలగింపు నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైనదని హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రాకేష్ శ్రీవాత్సవ తెలిపారు. మరి హ్యుందాయ్ అందిస్తున్న వివిధ కార్లపై ధరల పెంపు వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

హ్యుందాయ్ కార్ల ధరల పెంపు

తర్వాతి స్లైడ్‌లలో హ్యుందాయ్ అందిస్తున్న వివిధ మోడళ్లపై పెరిగిన ధరల వివరాలను తెలుసుకోండి.

ఇయాన్

ఇయాన్

హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ కారు ఇయాన్ ధరలు రూ.15,417 వరకూ పెరిగాయి. తాజా పెంపు తర్వాత ఈ కారు ధరలు రూ.2.88 లక్షల నుంచి రూ.4.03 లక్షలకు పెరిగాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఐ10

ఐ10

హ్యుందాయ్ అందిస్తున్న ఐ10 హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.21,501 వరకూ పెరిగాయి. తాజా పెంపు తర్వాత ఈ కారు ధరలు రూ.3.99 లక్షల నుంచి రూ.4.77 లక్షలకు పెరిగాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

గ్రాండ్ ఐ10

గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ అందిస్తున్న గ్రాండ్ ఐ10 కారు ధరలు రూ.22,508 వరకూ పెరిగాయి. తాజా పెంపు తర్వాత ఈ కారు ధరలు రూ.4.41 లక్షల నుంచి రూ.6.43 లక్షలకు పెరిగాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఎక్సెంట్

ఎక్సెంట్

హ్యుందాయ్ అందిస్తున్న ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ ధరలు రూ.25,597 వరకూ పెరిగాయి. తాజా పెంపు తర్వాత ఈ కారు ధరలు రూ.4.73 లక్షల నుంచి రూ.7.47 లక్షలకు పెరిగాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఎలైట్ ఐ20

ఎలైట్ ఐ20

హ్యుందాయ్ అందిస్తున్న ఎలైట్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ధరలు రూ.29,814 వరకూ పెరిగాయి. తాజా పెంపు తర్వాత ఈ కారు ధరలు రూ.4.99 లక్షల నుంచి రూ.7.66 లక్షలకు పెరిగాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

వెర్నా

వెర్నా

హ్యుందాయ్ అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ వెర్నా ధరలు రూ.23,965 వరకూ పెరిగాయి. తాజా పెంపు తర్వాత ఈ కారు ధరలు రూ.7.93 లక్షల నుంచి రూ.11,72 లక్షలకు పెరిగాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ఎలాంట్రా

ఎలాంట్రా

హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ ఎలాంట్రా ధరలు రూ.36,912 వరకూ పెరిగాయి.

సొనాటా

సొనాటా

హ్యుందాయ్ అందిస్తున్న లగ్జరీ సెడాన్ సొనాటా ధరలు రూ.45,396 వరకూ పెరిగాయి.

శాంటాఫే

శాంటాఫే

హ్యుందాయ్ అందిస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ శాంటాఫే ధరలు రూ.1,27,000 వరకూ పెరిగాయి.

Most Read Articles

English summary
Hyundai India Senior Vice President, Sales and Marketing Rakesh Srivastava commented, "In these adverse market conditions, the price increase is necessitated on account of the higher excise duty and increased input cost. We have increased the prices across all models starting from Eon to Santa Fe in the range of Rs.15, 000 - 1, 27,000 effective from January 01, 2015."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X