మ్యూజియంకే పరిమితం కానున్న 'లాంబోర్గినీ ఇగోయిస్టా'

By Ravi

ప్రముఖ ఇటాలియన్ సూపర్ కార్ కంపెనీ లాంబోర్గినీ, గడచిన సంవత్సరం మే నెలలో, తమ సంస్థను స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ అధునాతన సింగిల్ సీటర్ 'లాంబోర్గినీ ఇగోయిస్టా' (Lamborghini Egoista) కారును ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. అయితే, ఈ కారు ప్రొడక్షన్ దశకు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీనిని మ్యూజియంకే పరిమితం చేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం.

గడచిన సంవత్సరం ఈ కారును తొలిసారిగా ఇటలీలోని బొలాగ్నాలో ఆవిష్కరించిన తర్వాత దీనిని వరల్డ్ టూర్ కోసం అనేక ఆటో షోలలో ప్రదర్శనకు ఉంచారు. ఈ కారు ప్రపంచం మొత్తం తిరిగి ఇప్పుడు స్వంత గూటికే చేరుకుంది. ఇకపై దీనిని లాంబోర్గినీ హెడ్‌క్వార్టర్స్‌లో శాశ్వతంగా ప్రజల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ కారుకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకోండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

లాంబోర్గినీ ఇగోయిస్టా

తర్వాతి స్లైడ్‌లలో లాంబోర్గినీ ఇగోయిస్టా కారుకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోండి.

లాంబోర్గినీ ఇగోయిస్టా

లాంబోర్గినీ ఇగోయిస్టా సూపర్ కారును ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ డిజైన్ హెడ్ వాల్టర్ డి సిల్వా డిజైన్ చేశారు. అపాచే హెలికాఫ్టర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కారును డిజైన్ చేశామని ఆయన తెలిపారు.

లాంబోర్గినీ ఇగోయిస్టా

ఈ కారులోని ప్రవేశించాలంటే అద్దంలా ఉండే విండ్‌షీల్డ్‌ను పైకి లేపాల్సి ఉంటుంది. ఈ కారు బరువును తేలికగా ఉంచేందుకు గాను దీని నిర్మాణంలో అధిక మొత్తంలో కార్బన్ ఫైబర్ పదార్థాన్ని ఉపయోగించారు.

లాంబోర్గినీ ఇగోయిస్టా

లాంబోర్గినీ ఇగోయిస్టాలో శక్తివంతమైన 5.2 లీటర్ వి-10 ఇంజన్‌ను అమర్చారు.

లాంబోర్గినీ ఇగోయిస్టా

ఈ కారును ఒక వ్యక్తి (సింగిల్ పర్సన్) కోసం మాత్రమే తయారు చేశామని, ప్రపంచంలో కెల్లా అత్యంత అరుదైన, విశిష్టమైన కారును కోరుకునే వారి కోసం ఇగోయిస్టాను రూపొందగించామని, ఇగోయిస్టా అంటే 'స్వార్థం' (సెల్ఫిష్) అని అర్థమని, ఈ కారులో ఒక్కరికి మాత్రమే చోటు ఉంటుంది కాబట్టి ఈ కారుకు ఆ పేరును పెట్టామని వాల్టర్ డి సిల్వా వివరించారు.

లాంబోర్గినీ ఇగోయిస్టా

సిల్వర్ కరల్ ఎక్స్టీరియర్స్, ఆరెంజ్ కలర్ ఇంటీరియర్స్, 5-స్పోక్ ఆరెంజ్ కలర్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడి ల్యాంప్స్, విశిష్టమైన స్టీరింగ్ వీల్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ లాంబో కారు సొంతం.

Most Read Articles

English summary
Lamborghini Egoista came into being when the Sant'Agata Bolognese-based supercar maker decided it needed to celebrate its 50th anniversary in style. Now, this one-off future classic, has returned home to Bologna where it will first be displayed in Lamborghini's headquarters showroom and take its permanent place at the company's museum, along with the other icons for the public to see.
Story first published: Wednesday, May 21, 2014, 9:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X