ఆటో ఎక్స్‌పో 2014: మహీంద్రా వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్

By Ravi

దేశీయ యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ సెడాన్ మహీంద్రా వెరిటోలో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ఇటీవలే ముగిసిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా అండ్ మహీంద్రా తమ సరికొత్త ఫేస్‌‌లిఫ్ట్ వెరిటో సెడాన్ ప్లాట్‌ఫామ్‌పై తయారు చేసిన ఎలక్ట్రిక్ వెర్షన్ వెరిటో సెడాన్‌ను ప్రదర్శించింది.

వాస్తవానికి మహీంద్రా అండ్ మహీంద్రా గడచిన 2012 ఆటో ఎక్స్‌పోలో వెరిటో ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రదర్శించినప్పటికీ, అది ఉత్పత్తి దశకు చేరుకోలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న పన్నుల విధానమే. ఎలక్ట్రిక్ వాహనాలపై భారత సర్కారు సబ్సిడీని అందించినట్లయితే, ఇవి ఉత్పత్తి దశకు చేరుకుంటాయి.

Mahindra Verito Electric Showcased At 2014 Auto Expo

ఈ 12న ఎడిషన్ ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా ఆవిష్కరించిన ఎలక్ట్రిక్ వెర్షన్ వెరిటో సెడాన్ ప్రొడక్షన్ వెర్షన్‌కు చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, స్పెసిఫికేషన్స్ పరంగా 2012 మోడల్ వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్ సెడాన్‌కు ఈ కొత్త 2014 వెరిటో ఎలక్ట్రిక్ సెడాన్‌కు ఎలాంటి మార్పులు లేవు. ఇందులో 72 వోల్ట్ లిథియం ఐయాన్ బ్యాటరీని ఉపయోగించారు.

ఈ బ్యాటరీ కేవలం 7 గంటల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది. ఫాస్ట్ చార్జ్ సాయంతో ఈ సమయాన్ని ఒక గంటకు తగ్గించుకోవచ్చు. పూర్తి చార్జ్‌పై 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 85 కిలోమీటర్లు. ఇందులో 29 కి.వా ఏసి ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది సింగిల్ స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఈ2ఓ మాదిరిగా)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
The electric vehicle on display at the 2014 Auto Expo was based on the facelifted Verito sedan, which otherwise remains unchanged in terms of specifications from the 2012 model. The Verito electric comes with a 72V lithium ion battery that can be charged in seven hours. A time that can be cut short to just one hour using fast charge.
Story first published: Thursday, February 13, 2014, 17:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X