స్విఫ్ట్, ఎర్టిగా కార్లలో కూడా ఫ్యూయెల్ ఫిల్లర్ నెక్ సమస్య

By Ravi

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న స్విఫ్ట్ డిజైర్ కార్లలో ఫ్యూయెల్ ఫిల్లర్ నెక్ సమస్య కారణంగా వాటిని రీకాల్ చేయనున్నట్లు ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. కంపెనీ ఇప్పుడు ఇదే విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.

ఫ్యూయెల్ ఫిల్లర్ నెక్ సమస్య వలన మొత్తం 1,03,311 కార్లను రీకాల్ చేస్తున్న మారుతి సుజుకి ఇండియా ప్రకటించింది. అయితే, ఈ రీకాల్ చేసిన మోడళ్లలో కేవలం స్విఫ్ట్ డిజైర్ మోడళ్లే కాకుండా, స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మోడళ్లు మరియు ఎర్టిగా ఎమ్‌పివి మోడళ్లు కూడా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

రీకాల్ చేసిన మొత్తం వాహనాల్లో 42,481 యూనిట్ల స్విఫ్ట్ డిజైర్ సెడాన్లు, 42,237 యూనిట్ల స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్లు మరియు 13,593 యూనిట్ల ఎర్టిగా ఎమ్‌పివిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నవంబర్ 12, 2013 నుంచి ఫిబ్రవరి 4, 2014 మధ్య కాలంలో ఉత్పత్తి అయిన వాహనాలని మారుతి సుజుకి వివరించింది.

లోపపూరితమైన ఫ్యూయెల్ ఫిల్లర్ నెక్ ఉండటం వలన ఇంధనం లీక్ అవుతున్న వాసన రావటం, కొన్ని సందర్భాల్లో (ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు) ఈ ఫ్యూయెల్ ఫిల్లర్ నెక్ గుండా ఇంధనం లీక్ వ్వటం వంటి పలు సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. రీకాల్‌కు గురైన కార్లలో కంపెనీ ఈ విడిభాగాన్ని ఉచితంగా రీప్లేస్ చేయనుంది.


మారుతి సుజుకి డీలర్లు రీకాల్ చేసిన కార్ల యజమానులను గుర్తించి, వారికి ప్రత్యేకంగా ఈ సమస్య గురించి తెలియజేయనున్నారు. కస్టమర్లు కావాలనుకుంటే తమ వాహనం ఈ రీకాల్‌కు వర్తిస్తుందో లేదో అనే విషయాన్ని www.marutisuzuki.com వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చు.
Ertiga Recall

ఈ ఫ్యూయెల్ నెక్ ఫిల్లర్‌లను జెబిఎమ్ అనే విడిభాగాల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియాకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. జెబిఎమ్‌లో మారుతి సుజుకి ఇండియాకు 29.28 శాతం వాటా ఉన్నట్లు సమాచారం. ఈ మొత్తం 1.5 లక్షల స్విఫ్ట్ డిజైర్ కార్లలో ఇంకా కొన్ని డీలర్ల వద్దనే ఉన్నాయి. ఇలాంటి వాహనాల విషయంలో ఈ లోపపూరితమైన విడిభాగాన్ని కస్టమర్లకు విక్రయించడానికి ముందే డీలర్లు మార్చి ఇవ్వనున్నారు.
Most Read Articles

English summary
The faulty fuel cap problem found in the DZire compact sedan has also been discovered in the Swift hatchback and Ertiga MPV, and as such, the recall, earlier limited to the sedan, will extend to include the other two vehicles.
Story first published: Friday, April 11, 2014, 18:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X