కొత్త వోల్వో ఎక్స్‌సి90 కారులో యాపిల్ కార్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్

స్మార్ట్ ఫోన్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపిన టెక్నాలజీ దిగ్గజం యాపిల్, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ఆటోమొబైల్ యాక్ససరీ విభాగంలోకి ప్రవేశించింది. 'యాపిల్ కార్ ప్లే' (Apple CarPlay) అనే పేరుతో ఓ సరికొత్త ఇన్-కార్ ఇంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను యాపిల్ ఐఎన్‌సి పరిచయం చేసింది.

స్వీడన్ కార్ కంపెనీ వోల్వో తొలిసారిగా తమ ఎక్స్‌సి90 ఎస్‌యూవీలో ఈ యాపిల్ కార్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించింది. ఐప్యాడ్, ఐఫోన్ లేదా ఐపాడ్ వంటి అన్ని రకాల యాపిల్ గ్యాడెట్స్‌లోని ఫీచర్లను ఈ యాపిల్ కార్ ప్లే ద్వారా పొందవచ్చని, ఈ సిస్టమ్‌తో ఇన్-కార్ ఎక్స్‌పీరియెన్స్ పూర్తిగా మారిపోతుందని వోల్వో పేర్కొంది.


వోల్వో కారులోని సాఫ్ట్‌వేర్‌‌ను యాపిల్ కార్ ప్లే సిస్టమ్‌తో అనుసంధానం చేయటం ద్వారా ఓవరాల్ కార్ డ్రైవింగ్ మరింత సేఫ్‌గా మారుతుందని, వాయిస్ అండ్ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ద్వారా యాపిల్ ఫీచర్లను మరియు సర్వీసులను యాక్సెస్ చేసుకునే ఈ సిస్టమ్‌ను ఉపయోగించడం కూడా సులువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

వోల్వో కారులో కొత్తగా డిజైన్ చేసిన ఇన్-కార్ సాఫ్ట్‌వేర్ మరియు యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు కారు ఇంటీరియర్‌కు ఓ సరికొత్త లుక్ అండ్ ఫీల్‌ను కలిగిస్తాయని వోల్వో తెలిపింది. యాపిల్ కార్ ప్లే సిస్టమ్ అమర్చబడిన తొలి వోల్వో ఎక్స్‌సి90 మోడల్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లో విడుదల కానుంది.

New Volvo XC90

అన్ని ఇతర యాపిల్ గ్యాడ్జెట్ల మాదిరిగానే ఈ యాపిల్ కార్ ప్లే సిస్టమ్‌లో కూడా ఫోన్, మెసేజెస్, మ్యూజిక్, వీడియోస్, నావిగేషన్ వంటి అనేక సేవలు అందుబాటులో ఉంటాయి. కేవలం వోల్వో కార్లలోనే కాకుండా ఫెరారీ, మెర్సిడెస్ బెంజ్ తదితర ఇతర కార్ కంపెనీలు తయారు చేసే విలాసవంతమైన కార్లలో కూడా తమ కార్ ప్లే సిస్టమ్‌ను ఉపయోగించనున్నట్లు గతంలో యాపిల్ వెల్లడించింది.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/kqgrGho4aYM?list=PL37AC7C8C4700B0FD" frameborder="0" allowfullscreen></iframe></center>
Most Read Articles

English summary
Volvo has shown how it will integrate Apple CarPlay into its future infotainment systems by releasing details of the upcoming XC90's Sensus touchscreen setup.&#13;
Story first published: Friday, June 27, 2014, 10:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X