త్వరలో రోడ్లపైకి రానున్న గాలితో నడిచే హైబ్రిడ్ కారు

By Ravi

గాలితో నడిచే కారు.. మనం ఇప్పటికే ఇలాంటి కార్ల గురించి తెలుసుకున్నాం. అయితే, ఇందులో కొన్ని అభివృద్ధి దశలో ఉంటే, మరికొన్ని కేవలం కాన్సెప్ట్ దశకు మాత్రమే పరిమితమైపోయాయి. టాటా మోటార్స్ వంటి దేశీయ కంపెనీలే కాకుండా, పలు అంతర్జాతీయ కంపెనీలు సైతం కంప్రెస్డ్ ఎయిర్‌తో పనిచేసే కార్లపై పరిశోధనలు చేస్తూనే ఉన్నాయి.

అయితే, తాజాగా.. ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ 'ప్యూజో' గాలితో నడిచే కార్లను నిజం చేసి చూపించింది. అంతేకాదు, త్వరలోనే వీటిని వాణిజ్య పరంగా అందుబాటులోకి తీసుకువస్తామని కూడా కంపెనీ ప్రకటించింది. ప్యూజో తయారు చేసిన ఈ హైబ్రిడ్ ఎయిర్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం రండి.

ప్యూజో హైబ్రిడ్ ఎయిర్ కారు

ప్యూజో తయారు చేసిన ఈ హైబ్రిడ్ ఎయిర్ కారు పూర్తిగా కంప్రెస్డ్ ఎయిర్‌తో నడవదు, ఇందుకు కొంత పెట్రోల్ కూడా అవసరమవుతుంది. అయితే, పెట్రోల్ వినియోగం మాత్రం చాలా తక్కువ మోతాదులో (నామమాత్రం) ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ప్యూజో హైబ్రిడ్ ఎయిర్ కారు

ఇందులో హైబ్రిడ్ ఎయిర్ ఇంజన్ సిస్టమ్‌ను ఉపయోగించారు. ఇది కొద్దిపాటి పెట్రోల్‌ను ఉపయోగించుకొని, అధిక కంప్రెస్డ్ ఎయిర్‌ను తయారు చేసుకొని ముందుకు నడుస్తుంది. దీని ఫలితంగా పెట్రోల్ బిల్లు 80 శాతం వరకు తగ్గుతుందని ప్యూజో తెలిపింది.

ప్యూజో హైబ్రిడ్ ఎయిర్ కారు

ప్రత్యేకించి ఈ కారు గంటకు 68 కి.మీ.లకన్నా తక్కువ వేగంతో నడుపుతున్నప్పుడు ఇది పూర్తిగా గాలితోనే నడుస్తుందని ప్యుజో తెలిపింది. అంటే, ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉండే నగరాలు, పట్టణాల ప్రజలకు ఇది చక్కగా సరిగ్గా సరిపోతుందన్నమాట.

ప్యూజో హైబ్రిడ్ ఎయిర్ కారు

గాలిని పీడనానికి గురి చేసి ఇంజిన్‌కు సరఫరా చేయటం కోసం ఈ కారులో ఒక ప్రత్యేకమైన పరికరాన్ని అమర్చారు. కాబట్టి, గాలి ఇంధనం ఖాలీ అయిపోతుందన్న భయం లేదు.

ప్యూజో హైబ్రిడ్ ఎయిర్ కారు

ప్రస్తుతం తాము ఈ కారును మరింత మెరుగుపరిచే ప్రయత్నాల్లో ఉన్నామని, 2020 నాటికి సగటున ఒక లీటరు పెట్రోల్‌తో 42 కి.మీ.లు నడిచేలా చేస్తామని ప్యుజో ప్రకటించింది.

ప్యూజో హైబ్రిడ్ ఎయిర్ కారు

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పెట్రోల్/డీజిల్ మరియు ఎలక్ట్రిక్ ఇంజన్లతో ఉండే రెగ్యులర్ హైబ్రిడ్ కార్ల కన్నా ఈ కంప్రెస్డ్ ఎయిర్ యూనిట్ కలిగి ఉండే హైబ్రిడ్ కార్లే అత్యంత చవకగా లభిస్తాయని కంపెనీ తెలిపింది.

ప్యూజో హైబ్రిడ్ ఎయిర్ కారు

వచ్చే ఏడాది నుంచే ఈ హైబ్రిడ్ ఎయిర్ కార్లను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్యూజో పేర్కొంది.

Most Read Articles

English summary
French car maker Peugeot is all set to sell the first air-powered hybrid car from next year. With new ‘Hybrid Air’ engine system, the first to combine petrol with compressed air the firm says the car could reduce petrol bills by 80 percent when driven in cities.
Story first published: Friday, February 28, 2014, 13:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X