రోల్స్ రాయిస్ లగ్జరీ ఎస్‌యూవీ ఖరారు

Written By:

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ రోల్స్ రాయిస్ కూడా ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల) విభాగంలోకి ప్రవేశించనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. అయితే, ఇప్పటి వరకూ ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. కాగా.. తాజాగా.. రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ చైర్మన్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని ఖరారు చేశారు.

కొత్త మోడల్‌కు సంబంధించి రోల్స్ రాయిస్ కార్పోరేట్ ఆఫీస్ నుంచి ఓ బహిరంగ లేఖ (ఓపెన్ లెటర్) విడుదలైంది. ఆ లేఖ సారాంశం ఇది..

  • రోల్స్ రాయిస్ యొక్క లగ్జరీని ఆఫర్ చేస్తూ, ఎలాంటి టెర్రైన్‌ని అయినా అధిగమించగలిగే కారు.
  • నేటి ఆధునిక జీవనశైలి, మొబైల్ ఇంటిగ్రిటీని కోరుకునే కస్టమర్ల అవసరాలను అందుకునే కారు.
  • చార్లెస్ రోల్స్ పయోనీరింగ్, అడ్వెంచరస్ స్పిరిట్‌కు అలాగే సర్ హెన్రీ రాయిస్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్‌కు కట్టుబడి ఉండేలా తీర్చిదిద్దబడుతున్న కారు.
  • విలాసంలో రోల్స్ రాయిస్ బ్రాండ్ ప్రామిస్‌ను ప్రతిభింభింపజేసే కారు.
  • సరికొత్త అల్యూమినియం ఆర్కిటెక్చర్‌తో తయారు చేయబడిన హై-బాడీడ్ కారు.
  • స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీని భవిష్యత్తులోకి తీసుకువెళ్లగలిగిన విశిష్టమైన కొత్త మోటార్ కారు.

ఇవీ రోల్స్ రాయిస్ సంస్థ తమ సరికొత్త కారు గురించి తెలియజేసిన లక్షణాలు. పై లక్షణాలను బట్టి చూస్తుంటే, రోల్స్ రాయిస్ ఖచ్చితంగా ఓ రగ్గడ్ మోడల్‌ను తయారు చేస్తోందని తెలుస్తోంది. విలాసంలో ఎక్కడా రాజీపడకుండా, ఆఫ్-రోడింగ్ సామర్థ్యాలను కలిగి ఉండేలా ఈ కొత్త కారు రూపుదిద్దుకోనుంది. ఇప్పటి వరకూ లగ్జరీ సెడాన్లను మాత్రమే చూసిన విలాస ప్రియులు ఇకపై లగ్జరీ క్రాసోవర్/ఎస్‌యూవీ తరహా రోల్స్ రాయిస్‌ను కూడా చూడనున్నారన్నమాట.

కార్లను పోల్చు

రోల్స్ రాయిస్ ఘోస్ట్
రోల్స్ రాయిస్ ఘోస్ట్ వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --
English summary
Rolls-Royce Motor Cars has confirmed that, they are developing an all-new Rolls-Royce car with exceptional presence, elegance and purpose. The new Rolls-Royce will be Effortless Everywhere.
Story first published: Thursday, February 19, 2015, 10:14 [IST]
Please Wait while comments are loading...

Latest Photos