ఇకపై భారత్‌లోనే స్కానియా బస్సుల తయారీ

Written By:

గడచిన సంవత్సరం భారత మార్కెట్లోకి ప్రవేశించిన స్వీడన్‌కు చెందిన ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ కంపెనీ 'స్కానియా' ఇక తమ బస్సులను భారత్‌లోనే ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. స్కానియా భారత మార్కెట్లో తమ మెట్రోలింక్ రేంజ్ బస్సులను విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ బస్సులను మలేషియాలో తయారు చేసి, ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు.

ఇది కూడా చదవండి: వోల్వో బస్సుల్లో ప్రయాణిస్తున్నారా..? అయితే వీటి గురించి తెలుసుకోండి

కాగా.. వచ్చే ఆగస్ట్ నుంచి ఈ బస్సులను ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయాలని స్కానియా నిర్ణయించింది. ఈ మేరకు బెంగుళూరుకు సమీపంలో రూ.300 కోట్ల పెట్టుబడితో కంపెనీ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ ప్లాంట్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది. వచ్చే నెల నుంచే ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభిస్తామని స్కానియా పేర్కొంది. స్కానియా బస్సులను స్థానికంగా ఉత్పత్తి చేయటం వలన వాటి ధరలు కూడా దిగొచ్చే ఆస్కారం ఉంది.

చెన్నైకి చెందిన పర్వీన్ ట్రావెల్స్ మొట్టమొదటి స్కానియా మెట్రోలింక్ బస్సును కొనుగోలు చేసింది. స్కానియా మెట్రోలింక్ బస్సు ఫొటోలను మరియు ఆ బస్సుకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

భారత్‌లోనే స్కానియా బస్సుల తయారీ

తర్వాతి స్లైడ్‌లలో స్కానియా మెట్రోలింక్ బస్సులకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోండి.

భారత్‌లోనే స్కానియా బస్సుల తయారీ

స్కానియా మెట్రోలింక్ కోచ్‌ను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా, ప్రయాణికుల భద్రతే ప్రధాన లక్ష్యంగా చేసుకుని అల్ట్రా లగ్జరీ ఫీచర్స్, కంఫర్ట్, సేఫ్టీ సదుపాయాలతో వీటిని తయారు చేశారు.

భారత్‌లోనే స్కానియా బస్సుల తయారీ

ప్రయాణికులకు స్కానియా బస్సులో ప్రయాణం సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పిస్తుందని కంపెనీ పేర్కొంది.

భారత్‌లోనే స్కానియా బస్సుల తయారీ

మాడ్యూల్స్ అండ్ మాడ్యులర్ బాడీవర్క్ ఛాస్సిస్ సిస్టమ్ ఆధారంగా చేసుకొని తయారు చేసిన మెట్రోలింక్ బస్సులు టూ-యాక్సిల్, 3-యాక్సిల్ రూపంలో 45, 49, 53 ప్యాసింజర్ సీట్స్ కెపాసిటీతో మూడు మోడళ్లలో లభ్యమవుతున్నాయి.

భారత్‌లోనే స్కానియా బస్సుల తయారీ

స్కానియా మెట్రోలింక్ బస్సులలో ఆరు ఎమర్జెన్సీ డోర్‌లు, మోనిటర్ డ్రైవర్ మూవ్‌మెంట్స్, ప్రయాణికుల కోసం సేఫ్టీ వీడియోలు మొదలైన ఫీచర్లుంటాయి.

భారత్‌లోనే స్కానియా బస్సుల తయారీ

స్కానియా విడుదల చేసిన మెట్రోలింక్ హెచ్‌డి 45-సీటర్ బస్సు 12 మీటర్ల పొడవును కలిగి ఉండి 2+2 సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో 9-లీటర్, 314పిఎస్, యూరో3 ఇంజన్‌ను అమర్చారు. ఈ బస్సుకు తరచూ గేర్లు మార్చాల్సిన అవసరం లేదు. ఇందులో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌ను ఉపయోగించారు.

భారత్‌లోనే స్కానియా బస్సుల తయారీ

ఇకపోతే మెట్రోలింక్ హెచ్‌డి 49-సీటర్ బస్సు 13.7 మీటర్ల పొడవును కలిగి ఉండి 49 సెమీ-స్లీపర్ సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో పవర్‌ఫుల్ 13-లీటర్, 365 పిఎస్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్‌ను స్కానియా ఆప్టిక్రూయిజ్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‍‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లోనే స్కానియా బస్సుల తయారీ

మెట్రోలింక్ హెచ్‌డి 45-సీటర్ బస్సు 14.5 మీటర్ల పొడవును కలిగి ఉండి, 53 సెమీ-స్లీపర్ సీట్లను కలిగి ఉంటుంది. ఇందులో 8-లీటర్ 416 పిఎస్ ఇంజన్‌ను అమర్చారు. ఇది కూడా 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

భారత్‌లోనే స్కానియా బస్సుల తయారీ

వోల్వో, మెర్సిడెస్ బెంజ్, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్ వంటి సంస్థలకు స్కానియా గట్టి పోటీ ఇవ్వనుంది.

English summary
Sweden-based commercial vehicle and engine manufacturer Scania would begin production by next month at its Rs 300-crore manufacturing facility situated near Bangalore, a top official said. 
Story first published: Friday, July 18, 2014, 11:20 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark