ఫిబ్రవరి 2015లో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్లు

By Ravi

గడచిన ఫిబ్రవరిలో దేశీయ కార్ కంపెనీలు అమ్మకాల పరంగా మిశ్రమ స్పందన కనిపించాయి. అయితే, ఎప్పటి మాదిరిగానే మారుతి సుజుకి ఇండియా భారత్‌లో కెల్లా అత్యధికంగా అమ్మకాలను సాగించి, అగ్రస్థానంలో నిలిచింది. గడచిన ఫిబ్రవరి 2015లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లలో మొదటి నాలుగు మోడళ్లు మారుతివే కావటం విశేషం.

హ్యుందాయ్ ఇటీవలే ప్రవేశపెట్టిన ఎలైట్ ఐ20 అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. అలాగే, హ్యుందాయ్ అందిస్తున్న మరో బడ్జెట్ హ్యా్చ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 కూడా ఫిబ్రవరిలో మంచి అమ్మకాల వృద్ధిని కనబరిచింది. హోండా సిటీ కూడా జోరుగానే అమ్ముడుపోతోంది. ఈ కథనంలో ఫిబ్రవరి 2015లో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 కార్లేంటో చూద్దాం రండి.

10. హోండా సిటీ

10. హోండా సిటీ

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ దేశీయ విపణిలో అందిస్తున్న మిడ్-సైజ్ సెడాన్ సిటీ అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. గడచిన ఫిబ్రవరి 2015 నెలలో మొత్తం 6,506 సిటీ సెడాన్ కార్లు అమ్ముడుపోయాయి.

9. మారుతి సెలెరియో

9. మారుతి సెలెరియో

మారుతి సుజుకి ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏఎమ్‌టి వెర్షన్ సెలెరియో అమ్మకాలు మళ్లీ పుంజుకున్నాయి. గడచిన ఫిబ్రవరి 2015 నెలలో మొత్తం 6,772 సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడుపోయాయి.

8. హోండా అమేజ్

8. హోండా అమేజ్

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న కాంపాక్ట్ సెడాన్ అమేజ్ అమ్మకాలు స్థిరంగా సాగుతున్నాయి. గడచిన ఫిబ్రవరి 2015 నెలలో మొత్తం 7,163 అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కార్లు అమ్ముడుపోయాయి.

7. హ్యుందాయ్ ఇయాన్

7. హ్యుందాయ్ ఇయాన్

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ తమ శాంత్రో ఉత్పత్తిని నిలిపివేయటంతో, ఇయాన్ కార్లకు గిరాకీ పెరిగింది. గడచిన ఫిబ్రవరి 2015 నెలలో మొత్తం 7,200 హ్యుందాయ్ ఇయాన్ కార్లు అమ్ముడుపోయాయి.

6. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

6. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అందిస్తున్న గ్రాండ్ ఐ10 అమ్మకాలు స్థిరంగా సాగుతున్నాయి. గడచిన ఫిబ్రవరి 2015 నెలలో మొత్తం 8,687 హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కార్లు అమ్ముడుపోయాయి.

5. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

5. హ్యుందాయ్ ఎలైట్ ఐ20

దేశపు ద్వితీయ అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ అందిస్తున్న ఎలైట్ ఐ20 అమ్మకాలు హాట్ కేకుల్లా సాగుతున్నాయి. గడచిన ఫిబ్రవరి 2015 నెలలో మొత్తం 10,264 హ్యుందాయ్ ఎలైట్ ఐ20 కార్లు అమ్ముడుపోయాయి.

4. మారుతి వ్యాగన్ఆర్

4. మారుతి వ్యాగన్ఆర్

మారుతి సుజుకి ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న టాల్ బాయ్ కార్ వ్యాగన్ఆర్ అమ్మకాలు ఎప్పటి మాదిరిగానే జోరుగా సాగుతున్నాయి. గడచిన ఫిబ్రవరి 2015 నెలలో మొత్తం 14,315 వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడుపోయాయి.

3. మారుతి స్విఫ్ట్ డిజైర్

3. మారుతి స్విఫ్ట్ డిజైర్

మారుతి సుజుకి ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న మిడ్-సైజ్ కాంపాక్ట్ సెడాన్ స్విఫ్ట్ డిజైర్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గడచిన ఫిబ్రవరి 2015 నెలలో మొత్తం 17,085 స్విఫ్ట్ డిజైర్ కార్లు అమ్ముడుపోయాయి.

2. మారుతి స్విఫ్ట్

2. మారుతి స్విఫ్ట్

మారుతి సుజుకి ఇండియా భారత మార్కెట్లో విక్రయిస్తున్న బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ డిజైర్ అమ్మకాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. గడచిన ఫిబ్రవరి 2015 నెలలో మొత్తం 19,546 స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి.

1. మారుతి ఆల్టో

1. మారుతి ఆల్టో

ఇకపోతే ఈ జాబితాలో ఎప్పటి మాదిరిగానే మారుతి ఆల్టో అగ్రస్థానంలో ఉంది. గడచిన ఫిబ్రవరి 2015 నెలలో మొత్తం 25,673 ఆల్టో కార్లు అమ్ముడుపోయాయి.

Most Read Articles

English summary
Top 10 best selling cars in February 2015 in India. Many carmakers have taken a hit due to the slump in car sales whereas others feel like they have hardly been hit.
Story first published: Tuesday, March 10, 2015, 15:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X