గాలితో విచ్చుకునే వోల్వో ఇన్‌ఫ్లేటబల్ చైల్డ్ సేఫ్టీ సీట్

By Ravi

కారులో నాలుగేళ్లలో చిన్న పిల్లలతో ప్రయాణిస్తున్నప్పుడు తప్పనిసరిగా చైల్డ్ సేఫ్టీ సీట్లను ఉపయోగించాలి. రియర్ ఫేసింగ్ చైల్డ్ సేఫ్టీ సీట్లు అందులోని పిల్లలకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేలా డిజైన్ చేయబడి ఉంటాయి. కారు ముందు వైపు నుంచి ఢీకొట్టినప్పుడు పిల్లలకు మెడ వద్ద గాయాలకు కాకుండా ఉండేందుకు ఈ రియర్ ఫేసింగ్ చైల్డ్ సీట్లు ఉపయోగపడుతాయి.

అయితే, సాధారణంగా ఈ చైల్డ్ సేఫ్టీ సీట్లు బల్కీగా, హెవీగా ఉండటం వలన చాలా మంది తల్లిదండ్రులు వీటిని ఉపయోగించడానికి ఇష్టపడరు. ఈ సమస్యకు ఓ చక్కటి పరిష్కాన్ని తెలిపింది స్వీడన్ కార్ కంపెనీ వోల్వో. గాలితో తయారు చేసిన (ఇన్‌ఫ్లేటబల్) చైల్డ్ సేఫ్టీ సీట్‌ను వోల్వో పరిచయం చేసింది.

అంతేకాదు, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఇన్‌ఫ్లేటబల్ చైల్డ్ సేఫ్టీ సీట్ కావటం కూడా మరో విశేషం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

వోల్వో ఇన్‌ఫ్లేటబల్ చైల్డ్ సేఫ్టీ సీట్

గాలితో పనిచేసే ఈ వోల్వో ఇన్‌ఫ్లేటబల్ చైల్డ్ సేఫ్టీ సీట్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ మాత్రమే. ఇది నిజంగా అందుబాటులోకి వస్తే, చైల్డ్ సేఫ్టీ సీట్ల విషయంలో కొత్త విప్లవానికి తెర లేవటం ఖాయం.

వోల్వో ఇన్‌ఫ్లేటబల్ చైల్డ్ సేఫ్టీ సీట్

వోల్వో ఇన్‌ఫ్లేటబల్ చైల్డ్ సేఫ్టీ సీట్‌లోనే ఎయిర్ పంప్ నిక్షిప్తమై ఉంటుంది. ఈ పంప్ సాయంతో ఇది కేవలం 40 సెకండ్ల వ్యవధిలో పూర్తిగా విచ్చుకుని, సీటులా తయారవుతుంది.

వోల్వో ఇన్‌ఫ్లేటబల్ చైల్డ్ సేఫ్టీ సీట్

ఈ ఇన్‌ఫ్లేటబల్ చైల్డ్ సేఫ్టీ సీట్‌లోని గాలిని తీసేసి మడచిన తర్వాత ఇది 45 సెం.మీ. x 50 సెం.మీ. x 20 సెం.మీ. (పొడవు, వెడల్పు, ఎత్తు) పరిమాణాన్ని కలిగి ఉండి, 5 కేజీల కన్నా తక్కువ బరువును కలిగి ఉంటుంది.

వోల్వో ఇన్‌ఫ్లేటబల్ చైల్డ్ సేఫ్టీ సీట్

వోల్వో ఇన్‌ఫ్లేటబల్ చైల్డ్ సేఫ్టీ సీట్‌ను డ్రాప్-స్టిత్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేశారు. ఇది చాలా ధృడంగా ఉంటుంది. ఇన్‌ఫ్లేటబల్ బోట్లలో కూడా ఇదే మెటీరియల్‌ను ఉపయోగిస్తారు.

వీడియో

వోల్వో ఇన్‌ఫ్లేటబల్ చైల్డ్ సేఫ్టీ సీట్ డెమోను ఈ వీడియోలో వీక్షించండి.

Most Read Articles

English summary
Volvo, a pioneer when it comes to car safety, has now come out with, what is perhaps, the world's first inflatable child safety seat. Still a concept, these inflatable seats solve the chief concern by making them portable.
Story first published: Wednesday, April 16, 2014, 17:34 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X