ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి క్రాసోవర్ సెడాన్ వోల్వో ఎస్60

Posted By:

స్వీడన్‌కు చెందిన కార్ కంపెనీ వోల్వో, ఈ ఏడాది జరగనున్న 2015 డెట్రాయిట్ ఆటో షోలో తమ సరికొత్త క్రాసోవర్ సెడాన్ కాన్సెప్ట్ 'వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ' (Volvo S60 Cross Country) మోడల్‌ను ఆవిష్కరించనుంది. ఈ నేపథ్యంలో, వోల్వో తమ ఎస్60 క్రాస్ కంట్రీ మోడల్‌కి సంబంధించిన అఫీషియల్ ఫొటోలను కూడా విడుదల చేసింది.

వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ ప్రపంచంలో కెల్లా మొట్టమొదటి క్రావోసర్ సెడాన్ కావటం విశేషం. ఎస్‌యూవీ మరియు సెడాన్లను కలిపి ఈ మోడల్‌ను తయారు చేశారు. తమ క్రాస్ కంట్రీ బ్రాండ్‌ను మరింత విస్తరించే దిశలో భాగంగా ఈ మోడల్‌ను తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. వాస్తవానికి వోల్వో 1997లోనే ఈ సెగ్మెంట్‌కు శ్రీకారం చుట్టింది. వోల్వో వి70 క్రాస్ కంట్రీ ద్వారా ఈ కొత్త సెగ్మెంట్‌ను స్టార్ట్ చేసింది.

వోల్వో అందిస్తున్న వి60 క్రాస్ కంట్రీ మాదిరిగానే ఎస్60 క్రాస్ కంట్రీ కూడా ఎక్కువ రైడ్ హైట్ 65 మి.మీ. (2.5 ఇంచెస్)ను కలిగి ఉంటుంది. వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ మోడల్ ఆల్-వీల్ డ్రైవ్ మరియు ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లతో లభ్యం కానుంది. క్రాసోవర్ సెడాన్ సెగ్మెంట్లో వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ పోటీగా నిలువడానికి మరే ఇతర మోడల్ ఈ సెగ్మెంట్లో అందుబాటులో లేదు.

వోల్వో ఎస్60 క్రాస్ కంట్రీ మోడల్‌లో పవర్‌ఫుల్ డి4 డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, భవిష్యత్తులో ఇందులో 2.4 లీటర్, 5-సిలిండర్, డీజిల్ ఇంజన్‌ను కూడా ఆఫర్ చేయాలని కంపెనీ భావిస్తోంది. క్రాసోవర్‌లోని ప్రయోజనాలను మరియు సెడాన్‌లోని సౌకర్యాన్ని కోరుకునే వారికి ఇదొక చక్కటి ఆప్షన్ అని వోల్వో తెలిపింది.

కార్లను పోల్చు

వోల్వో వి40
వోల్వో వి40 వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --
English summary
Volvo will be unveiling its S60 Cross Country model to the general public at the 2015 Detroit Auto Show. The manufacturer has gone ahead and decided to tease us with a few images prior to its official unveil.
Please Wait while comments are loading...

Latest Photos