హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ల వల్ల కలిగే ప్రయోజనాలు

High Security Registration Plates
వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్‌(హెచ్ఎస్ఆర్‌పి)ను అమర్చుకోమని సుప్రీం కోర్టు నెత్తి నోరూ బాదుకుంటున్న, దీన్ని పాటించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నత్త నజకను పాటిస్తున్నాయి. అసలు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అంటే ఏమిటి, వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ కథనలో తెలుసుకుందాం.

* వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను అమర్చుకోవడం ద్వారా స్మగ్లింగ్, దొంగ రవాణా, వాహనాల చోరీ వంటి వాటికి చెక్ పెట్టవచ్చు.

* ఈ సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను వాహనానికి అమర్చుకోవడం వల్ల నెంబర్‌ ప్లేట్లపై పిచ్చిరాతలు, గీతలు, బొమ్మలు, పేర్లు, వంకర తిరిగిన నెంబర్లు రాయడానికి వీలుండదు.

* వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణ నెంబర్ ప్లేట్లను గుర్తించడం కష్టం అవుతుంది. అదే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అయితే, కారు యజమాని చిరుమాతో సహా గుర్తించవచ్చు.

* ప్రభుత్వమే వీటిని నెంబర్‌తో జారీ చేస్తుంది కాబట్టి నెంబర్ ప్లేట్ల విషయంలో ఎలాంటి అవతవకలు జరిగే అవకాశం లేదు.

* హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను ఒక్కసారి అమర్చితే, తిరిగి వాటిని తొలగించడం అంత సులువు కాదు.

* ఒకే వాహన రిజిస్ట్రేషన్ నెంబర్‌ను వివిధ వాహనాలకు ఉపయోగించడం వీలు కాదు.

హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లను ఎక్కడ పొందాలి? దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
వీటిని ప్రభుత్వం వేలం ద్వారా వచ్చిన కంపెనీలు కాంట్రాక్టు ప్రాతిపదికన ఇస్తుంది. మన రాష్ట్రంలో ఈ కాంట్రాక్టును ఆర్టీసీ నిర్వహిస్తోంది. ఈ నెంబర్ ప్లేట్లను అమర్చు కోవడానికి ద్విచక్ర, తిచక్ర, వాహనాలకు సుమారు రూ.100 నుండి రూ.200 వరకూ ఖర్చు అవుతుంది.

అలాగే నాలుగు చక్రాల వాహనాలు, కార్లకు రూ.300, ట్రక్కులు, ట్రాక్టర్లకు రూ 300 నుంచి 400, లారీలు, బస్సులకు సుమారు రూ.500 అంతకు మించి వసూలు చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వాహనాలకు ఉన్న ఉన్న పాత నెంబర్‌నే హై సెక్యూరిటీ నెంబర్‌గా మార్చి ఇస్తారు. కొత్త వాహనాలకు కొత్తగా ఇచ్చే నెంబర్‌ను కూడా హై సెక్యూరిటీ నెంబర్‌గా మార్చడం జరుగుతుంది.

కొత్త వాహనం రిజిస్టర్‌ అయిన వెంటనే వాహనానికి హై సెక్కూరిటీ నెంబర్‌ ప్లేట్‌ అమర్చుతారు. ఒక్కసారి అమర్చిన ఈ నెంబర్‌ ప్లేట్‌ ఎట్టి పరిస్థితిలో తొలగించే అవకాశం ఉండదు. నెంబర్‌ప్లేట్‌పై ఒక చిప్‌ ఏర్పాటు చేస్తారు. ఈ చిప్ ద్వారా దొంగిలించబడిన వాహనాలను గుర్తించడానికి వీలవుతుంది. అలాగే చక్రం గుర్తులో ఓ హాలోగ్రామ్‌ కూడా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ హైటెక్ హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను అమర్చుకోవడం వలన ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు హాయిగా గుండెలపై చేతులు వేసుకొని నిద్రపోవచ్చు. మీరేమంటారు..??

Most Read Articles

English summary
One of the significant safety feature of the High Security License Plates is reflectivity. High Security License Plates will have a high quality retro reflective sheeting which is laminated and embossed. This sheeting provides excellent conspicuity during day time and offer high reflectivity in the night. By virtue of reflective sheeting the vehicle is visible from a minimum difference of 200 meters in night irrespective of the working of its tail lamps etc.
Story first published: Wednesday, February 15, 2012, 19:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X