ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పొందటం ఎలా?

By Ravi

డ్రైవింగ్ లైసెన్స్ కోసం చాలా మంది బ్రోకర్లపై ఆధారపడుతుంటారు. ఆర్టీవో కార్యాలం చుట్టూ తిరగటం ఇష్టం లేని వారు, సమయం దొరకని వాళ్లు, లైసెన్స్ ఎలా పొందాలో తెలియని వాళ్లు అనేక మంది మధ్యవర్తులను ఆశ్రయిస్తుంటారు. ఈ మీడియేటర్లు కూడా ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు వారి జేబులు కొల్లగొడుతుంటారు.

ఈ నేపథ్యంలో, డ్రైవింగ్ లైసెన్సను ఇతరుల సాయం అవసరం లేకుండా ఎలా పొందాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. అసలు డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ముందుగా మనం లెర్నర్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఒకప్పుడు లెర్నర్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయం వద్ద బారులు తీరాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ఆ అవసరం లేదు, ఆన్‌లైన్‌లోనే టైమ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం రండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాల కోసం ఈ ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవటం ఎలా?

ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసుకోదలచిన వారు, ముందుగా http://www.aptransport.org/ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి అందులో లైసెన్స్ (Licence) అనే మెనూలో లెర్నర్స్ లైసెన్స్ (Learner's Licence) అనే సబ్ మెనూని ఎంచుకోవాలి.

ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవటం ఎలా?

అప్పుడు లెర్నర్స్ లైసెన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లెర్నర్ లైసెన్స్ టైమ్ స్లాట్ బుక్ చేసుకోవటానికి, మరొకటి లెర్నర్ లైసెన్స్ కోసం డెమో టెస్ట్‌ని బుక్ చేసుకోవటానికి. మనం ముందుగా లెర్నర్ లైసెన్స్ కోసం టైమ్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి, CLICK HERE TO BOOK LEARNER LICENCE SLOT అనే లింక్‌పై క్లిక్ చేయాలి.

ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవటం ఎలా?

అప్పుడు ఓ సెపరేట్ పేజీ/విండో ఓపెన్ అవుతుంది. అందులో మళ్లీ లైసెన్స్ (Licence) అనే మెనూ క్రింద లెర్నర్ సెన్స్ టెస్ట్ (Learner Licence Test) అనే సబ్ మెనూని ఎంచుకోవాలి.

ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవటం ఎలా?

ఆ తర్వాత మీరు ఏ జిల్లాలో ఉంటున్నారో లేక ఏ జిల్లాలో డ్రైవింగ్ లైసెన్స్ ధరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ జిల్లాను ఎంచుకున్న తర్వాత మీకు సమీపంలో ఉండే లేదా మీరుకు టెస్ట్‌కు హాజరు కాబోయే సెంటరును ఎంచుకొని సబ్‌మిట్ బటన్ ప్రెస్ చేయాలి.

ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవటం ఎలా?

ఆ తర్వాత ఓ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. అందులో అకెంలు రెడ్ కలర్‌లో ఉంటే ఆయా తేదీల్లో ఆన్‌లైన్ స్లాట్‌లు అందుబాటులో లేవని, అంకెలు గ్రీన్ కలర్‌లో ఉంటే ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ అందుబాటులో ఉందని అర్థం.

ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవటం ఎలా?

క్యాలెండర్‌లో గ్రీన్ కలర్ అంకెలపై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న సమయాలు, స్లాట్‌లు కనిపిస్తాయి. మీకు అనువైన సమయం ఎంచుకున్న తర్వాత సబ్‌మిట్ (SUBMIT)పై క్లిక్ చేయాలి.

ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవటం ఎలా?

ఆ తర్వాత ఆన్‌లైన్ లెర్నర్స్ లైసెన్స్ అప్లికేషన్ ఫారమ్ (Online Learner's License Application Form) పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సుపై పేరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా నమోదు చేయాలి. దాంతో పాటుగా అక్కడ అన్ని తప్పనిసరి వివరాలను నమోదు చేసి తిరిగి (SUBMIT)పై క్లిక్ చేస్తే మీరు ఎంచుకున్న తేది, సమయానికి టైమ్ స్లాట్ బుక్ అవుతుంది.

ఆన్‌లైన్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేసుకోవటం ఎలా?

మీరు ఎంచుకున్న తేదీలో ఆ సమయానికి మీరు ఎంచుకున్న ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి టెస్టుకు హాజరయ్యినట్లయితే, మీకు లెర్నర్ లైసెన్స్ వస్తుంది. సాధారణంగా లెర్నర్ లైసెన్స్ చెల్లుబాటయ్యే కాలపరిమితి ఒక నెల వరకు ఉంటుంది. దాని గడువు ముగియక ముందే మీరు మరోసారి ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి ఒరిజినల్ లైసెన్స్‌ను పొందాల్సి ఉంటుంది.

Most Read Articles

English summary
Transport Department has introduced the concept of online slot booking for a driving test. Just log into the ap transport website and click on online services and further click on driving test.
Story first published: Wednesday, June 11, 2014, 12:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X