ప్రతి కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

ప్రయాణం సాఫీగా సాగేందుకు ప్రతి కారులో ఉండాల్సిన ఐదు అతి ముఖ్యమైన ఫీచర్లు మరియు వాటి ప్రాముఖ్యతను డ్రైవ్‌స్పార్క్ తెలుగు నేటి కథనంలో అందిస్తోంది...

By Anil

Recommended Video

Indian Army Soldiers Injured In Helicopter Fall - DriveSpark

లగ్జరీ మరియు హై ఎండ్ కార్లను మినహాయిస్తే, సాధారణ కార్లను ఎంచుకునే కస్టమర్లు అందులో వచ్చే సేఫ్టీ ఫీచర్లతో చాలా వరకు అసంతృప్తిగా ఉంటారు. కార్ల కంపెనీలు కొన్ని కార్లలో తప్పనిసరిగా ఇవ్వకపోయినా... కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. టాప్ ఎండ్ వేరియంట్లలో కంఫర్ట్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు ఉంటాయేమోగానీ, అతి ప్రధానమైన చిన్న చిన్న ఫీచర్లు ఉండవు.

కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

న్యుమాటిక్ ఎయిర్ పంప్

కారులో వెళుతున్నపుడు టైర్ పంక్ఛర్ కారణంగా రోడ్డు పక్కన ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఇందుకు టైర్ పంక్చర్, లీక్ పంక్చర్ వంటి ఇతరత్రా కారణాలు ఉండవచ్చు. ఇప్పట్లో కార్లు ట్యూబ్ లెస్ టైర్లతో వస్తున్నాయి. అంటే, ఈ టైర్లు పంక్చర్ అయినా కూడా రిపేరి షాపు వరకు వెళ్లవచ్చు.

కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

కానీ దానికంటే ముందు, టైర్లు పంక్చర్ అయినపుడు తగినంత గాలి టైరులో ఉండాలి. ఇందుకోసం చిన్న న్యుమాటిక్ ఎయిర్ పంప్(గాలి మిషన్)ను కారులో ఉంచుకోవాలి. 12వోల్ట్ సాకెట్ ద్వారా కూడా ఈ ఎయిర్ పంప్ పనిచేస్తుంది. కాబట్టి, ఈ పంప్ కారులో ఉండటం ద్వారా టైర్ పంక్చర్‌కు గురైనపుడు మీ ప్రయాణం అంతరాయం కలగకుండా ప్రయాణించవచ్చు. అయితే, పంక్చర్ రిపేరి చేయించడం మరిచిపోకండి.

కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

సెల్ ఫోన్ హోల్డర్

రోజు రోజుకీ ట్రాఫిక్ పెరగడం, తికమక పెట్టే రోడ్డు మార్గాలు అధికమవ్వడం మరియు రోడ్డు ట్రిప్స్ కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రూట్ల కోసం న్యావిగేషన్ మీద ఆధారపడుతున్నాము. డ్రైవింగ్‌లో ఉన్నపుడు అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే దాన్ని మించిన న్యావిగేషన్ మరొకటి ఉండదు.

కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

డ్రైవింగ్‌లో ఉన్నపుడు స్మార్ట్ ఫోన్ ద్వారా మ్యూజిక్ ప్లే చేయడం, హ్యాండ్స్ ఫ్రీ కాల్స్ మరియు ఇంకా ఎన్నో అవసరాలు తీరుతాయి. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఫోన్‌ను చేతిలో పట్టుకుని డ్రైవింగ్ చేయడం. ఇలా చేయడం వలన ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా వచ్చిన పరిష్కారం మొబైల్ హోల్డర్లు. కారు లోపల ఫ్రంట్ మిర్రర్ మీద ఫిక్స్ చేసుకుని దానికి మన ఫోన్ అంటించి వాడుకోవచ్చు.

కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

12వోల్ట్ మొబైల్ ఛార్జర్

అరచేతిలో ఇమిడిపోయే ఫోన్‌లోని అంతర్జాలంతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ప్రతి నిత్యం అత్యధికంగా ఉపయోగించే వస్తువుల్లో మొబైల్ ఫోన్ అగ్రస్థానంలో ఉంటుంది. ఖాళీ సమయం దొరికితే చాలా ఎక్కువ మంది ఫోన్‌తోనే గడుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఫోన్ లేకుంటే అస్సలు రోజే గడవదు.

కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

ఇంత వరకు అంతా బాగానే ఉంది. ఫోన్‌తో వచ్చిన అసలు సమస్య ఛార్జింగ్. నిజమే, అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోతే .. అది కూడా ప్రయాణంలో ఉన్నపుడు ఛార్జింగ్ అయిపోతే తీవ్ర ఇబ్బందిపడాల్సి వస్తుంది. కాబట్టి కారులో వెళుతున్నపుడు 12వోల్ట్ పవర్ సాకెట్లను తప్పనిసరిగా ఉంచుకోండి.

Trending On DriveSpark Telugu:

సెకండ్ హ్యాండ్ కారును అమ్మే చిట్కాలు

పాత కార్లలో మిస్ అయిన 10 అంశాలు

ఇండియాలో ఉన్న టాప్ 10 లో మెయింటెనెన్స్ కార్లు

ఏ/సి వాడకం కారు మైలేజ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?

కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

గేర్‌లాక్

ఇప్పట్లో చాలా కార్లు రిమోట్ ఎంట్రీ సిస్టమ్‌తో వస్తున్నాయి. రిమోట్ ఎంట్రీ సిస్టమ్ ఉన్నంత వరకు భద్రత పరంగా భయపడాల్సిన అవసరం ఉండదు. ఏదేమైనప్పటికీ, పెద్ద పెద్ద మెట్రో నగరాల్లో కార్ల దొంగతనానికి దొంగలు మంచి టెక్నాలజీనే ఉపయోగిస్తున్నారు.

Picture credit: Barriersdirect

కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

కాబటి, మనకు తెలియని కొత్త ప్రదేశాల్లో కార్ పార్కింగ్ చేయడం అంత సురక్షితం కాదు. అలాంటి సందర్భాల్లో దొంగల బారి నుండి మీ కారును రక్షించడంలో గేర్‌లాక్ అద్భుతంగా పనిచేస్తుంది. కీ సహాయంతో గేర్‌రాడ్ కదలికలను స్తంభింపచేయవచ్చు. గేర్ కదలకపోతే కారును నడపడం కష్టమే కదా. కాబట్టి ఓ మంచి గేర్‌లాక్ కొనుక్కోండి.

కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

డ్యాష్ క్యామ్

చాలా మందికి డ్యాష్ క్యామ్ గురించి తెలిసుండదు. దీని అర్థం పేరులోనే ఉంది డ్యాష్ అంటే ఫ్రంట్ మిర్రర్ మరియు క్యామ్ అంటే కెమెరా. కారు వెలుపల జరిగే మొత్తాన్ని డ్యాష్ క్యామ్ రికార్డ్ చేస్తుంటుంది.

కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

డ్యాష్ క్యామ్ అమర్చుకోవడం ద్వారా, ప్రమాదం జరిగినపుడు మీ ప్రమేయం లేకపోతే ఈ డ్యాష్ క్యామ్‌లో రికార్డయిన ఫుటేజ్ మిమ్మల్ని నిర్ధోషిగా తేల్చడానికి ఉపయోగపడుతుంది. చాలా దేశాల్లో కార్ల డ్రైవర్లు కారుకు ఫ్రంట్ మరియు రియర్ మిర్రర్ మీద లోపలి వైపున డ్యాష్ క్యామ్‌లను ఫిట్ చేసుకుంటున్నారు. ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశం ఉన్న ఇండియాలో వీటి అవసరం ఇంకా ఎక్కువగా ఉంది.

కారులో తప్పనిసరిగా ఉండాల్సిన యాక్ససరీలు!

ఈ కథనంలో తెలిపిన యాక్ససరీలు కార్ల కంపెనీలు అస్సలు ఇవ్వవు. కాబట్టి మన ప్రయాణంలో కనీసం భద్రతకు ఉపయోగపడే వీటిని తప్పకుండా కారులో ఉంచుకోండి.

ఈ కథనం మీద మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి...

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Most Read Articles

English summary
Read In Telugu: Must have accessories for car owners
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X