ఏఎమ్‌టి కార్లలో ఎట్టిపరిస్థితుల్లో చేయకూడని పనులు

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‍‌లో కూడా రకరకాల గేర్‌బాక్సులు ఉన్నాయి. అందులో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఏఎమ్‌టి), డీఎస్‌జీ మరియు సీవీటీ గేర్‌బాక్స్ వీటన్నింటిలో కెల్లా ఏఎమ్‌టి కార్లను నడుపుతున్న ప

By N Kumar

ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఓఎమ్‌టి) గల కార్లకు ఇండియన్ మార్కెట్లో ప్రజాదరణ రోజురోజుకీ పెరుగుతోంది. కార్ల కంపెనీలు కూడా కస్టమర్ల అభిరుచికి తగ్గట్లుగానే ఎప్పటికప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉన్న కార్లను ప్రవేశపెడుతున్నాయి.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‍‌లో కూడా రకరకాల గేర్‌బాక్సులు ఉన్నాయి. అందులో ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్(ఏఎమ్‌టి), డీఎస్‌జీ మరియు సీవీటీ గేర్‌బాక్స్ వీటన్నింటిలో కెల్లా ఏఎమ్‌టి కార్లను నడుపుతున్నపుడు పలు జాగ్రత్తలు పాటించాలి.

ఏఎమ్‌టి గేర్‍‌బాక్స్ ఉన్న కార్లను డ్రైవ్ చేస్తున్నపుడు చేయకూడని పనుల గురించి ఇవాళ్టి స్టోరీలో వివరంగా...

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

5. ఏఎమ్‌టి అంటే ఏమిటో తెలుసుకోకుండా డ్రైవ్ చేయడం

చాలా మంది డ్రైవర్లు ఏఎమ్‌టి అంటే, గేర్లు మనం వేయకుండానే వాటంతట అవే పడతాయి. అదే మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లో అయితే, మనం స్వయంగా గేర్లను మార్చాల్సి ఉంటుంది అనుకుంటారు. అయితే, ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

నిజానికి మ్యాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్(AMT) రెండు ఒకేలా పనిచేస్తాయి. అయితే, ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌లో క్లచ్ సిస్టమ్ మరియు గేర్లను మార్చే సిస్టమ్ ఆటోమేటిక్ అయిపోయి ఉంటాయి.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

కాబట్టి, మ్యాన్యువల్ గేర్‌బాక్సులో గేరు మార్చేటపుడు యాక్సిలరేషన్ తీసేసి, క్లచ్ ప్రెస్ చేసి గేర్ మార్చిన తరువాత మళ్లీ యాక్సిలరేట్ చేస్తాం. కాబట్టి ఏఎమ్‌టి కార్లలో దానంతట అదే గేరు మారాలి అనుకున్నపుడు యాక్సిలరేషన్ మీద కాలును తీసి మళ్లీ పెడితే గేరు మారుతుంది. గేర్లను తగ్గించాలనుకున్నపుడు పూర్చిగా యాక్సిలరేషన్ తీసేస్తే గేర్లు తగ్గిపోతాయి.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

4. హ్యాండ్ బ్రేక్ ఉందని అస్సలు మరిచిపోవద్దు

సాధారణంగా లభించే ఆటోమేటెడ్ మ్యాన్యువల్ కార్లు బడ్జెట్ ధరలో ఉంటాయి కాబట్టి, హిల్ హోల్డ్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండవు. ఏఎమ్‌టి కార్లలో క్లచ్ ఉండదు కాబట్టి కారు కంట్రోల్ అవుతున్న ఫీల్ కలగకపోవచ్చు. కానీ మిమ్మల్ని రక్షించే హ్యాండ్ బ్రేక్ ఉందని మరిచిపోకండి.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

ఏటవాలు తలం మీద కారును పార్క్ చేసినపుడు మ్యాన్యువల్ కార్లలో హ్యాండ్ బ్రేక్ వేసినట్లు, ఆటోమేటిక్ కార్లలో హ్యాండ్ బ్రేక్ ఉపయోగించవచ్చు. ఇది కారును ముందుకు లేదా వెనక్కి దొర్లడాన్ని నివారిస్తుంది.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

3. ట్రాఫిక్‌లో యాక్సిలరేషన్ వాడకండి

విపరీతమైన ట్రాఫిక్‌లో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న కారులో ప్రయాణిస్తున్నపుడు, వాహనాలు ముందుకు కదిలిన ప్రతిసారీ, క్లచ్ వదులు చేసి, యాక్సిలరేషన్ చేయడం వాహనాలు ఆగితే మళ్లీ యాక్సిలరేషన్ వదిలేసి క్లచ్ మరియు బ్రేక్ ప్రెస్ చేస్తాం. అయితే, ఆటోమేటిక్ కార్లలో ఈ సమస్యను నివారించేందుకు క్రీప్ అనే టెక్నాలజీ తీసుకొచ్చారు.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

అత్యంత రద్దీతో కూడుకున్న ట్రాఫిక్‌లో వాహనాలు మెలమెల్లగా ముందుకు కదులుతున్నపుడు మీ కారును ముందుకు పోనిచ్చేందుకు బ్రేక్ పెడల్ వదులు చేస్తే కారు దానంతట అదే ముందుకు కదులుతుంది. ఇక్కడ అస్సలు యాక్సిలరేషన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి, ట్రాఫిక్‌‌లో ఆటోమేటిక్ కారును నడిపేటపుడు మ్యాన్యువల్ కార్ల మాదిరిగా యాక్సిలేట్ చేయకండి.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

2. అనుకోకుండా ఓవర్‌టేక్ చేయడం అత్యంత ప్రమాదకరం

ఆటోమొబైల్ సామ్రాజ్యంలో మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పోల్చితే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అత్యంత శక్తివంతమైనది కాదు. ఆటోమేటిక్ కార్లు వాటంతట అవి గేర్లను మార్చుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మీ కారు సరైన పవర్ ప్రొడ్యూస్ చేస్తునపుడు అవతలి మార్గంలో వాహనాలు లేవని నిర్ణయించుకున్నపుడే ఓవర్‌టేక్ చేయండి.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

మీరు నడుపుతున్న ఆటోమేటిక్ కారులో మ్యాన్యువల్ మోడ్ సెలక్షన్ ఆఫర్ ఉంటే, ఓవర్ టేక్ చేయాల్సిన సందర్భాల్లో మ్యాన్యువల్ సెలక్ట్ చేసుకోండి. ఏఎమ్‌టి కారును నడుపుతున్నపుడు ఇంజన్ మరియు గేర్‌బాక్స్‌తో చాలా వివేకంగా వ్యవహరించండి సురక్షితంగా ఓవర్‌టేక్ చేయండి.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

1. ఇంజన్ ఆఫ్ చేయడం పట్ల అవగాహన

మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఉన్న కార్లను ఎక్కువగా నడిపిన తరువాత, వాటి ఇంజన్ ఆఫ్ చేయడం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. కానీ, ఏఎమ్‌టి కార్ల విషయంలో క్లచ్ మరియు ఇంజన్ ఆఫ్ చేయడం పట్ల నియంత్రణ కోల్పోతారు. ఇది కారుకు చాలా ప్రమాదకరం. ఏఎమ్‌టి కార్ల ఇంజన్ ఆఫ్ చేస్తున్నపుడు ఎంతో వివేకంగా వ్యవహరించాలి.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

అన్నింటికీ మించి, ఆటోమేటిక్ కారును నడపడానికి ముందు దాని పనితీరు గురించి తెలుసుకోవడానికి కాస్త సమయాన్ని కేటాయించడం ఎంతో మంచిది. కొనుగోలు ధర, నిర్వహణ ఖర్చులను తగ్గించడంతో పాటు విపరీతమైన ట్రాఫిక్‌లో పదే పదే క్లచ్ ప్రెస్ చేయకుండా మీకు ఎంతగానో సహాయపడుతుంది.

ఆటోమేటిక్ కార్లలో చేసే పొరబాట్లు

1. ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ కార్లలో ఏది బెస్ట్ ?

2.మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో ఈ తప్పులు చేస్తున్నారా ?

3.ఏఎమ్‌టి కారును నడిపేటపుడు గుర్తుంచుకోవలసిన విషయాలు

Most Read Articles

English summary
Read In Telugu: Five things you must NEVER do while driving an AMT car
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X