లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

భారతదేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా రాష్ట్రాల్లో సంపూర్ణ మరియు పాక్షిక లాక్‌డౌన్‌లు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో వారు ఉపయోగించే వాహనాలు కూడా పార్కింగ్ ప్రదేశాల్లోనే ఉండిపోతున్నాయి.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

ఎక్కువ కాలం పాటు వాహనాలను ఉపయోగించకుండా అలానే ఉంచేయటం వలన కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి. మనం ఇదివరకటి కథనాల్లో ఇంటర్నల్ కంబస్టియన్ ఇంజన్ (పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్) వాహనాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం. అయితే, ఇటీవలి కాలంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. మరి ఈ లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

వాహనాన్ని శుభ్రంగా ఉంచుకోండి

పెట్రోల్, డీజిల్ కార్ల మాదిరిగానే, మీ ఎలక్ట్రిక్ కారును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. కారును ఎక్కువ కాలం పార్క్ చేసి ఉండటం వలన దానిపై, దుమ్ము ధూళి పేరుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, వారానికి ఒక్కసారైనా మీ కారుని శుభ్రం చేసుకోండి.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

ఒకవేళ మీకు ఇండోర్ లేదా అండర్‌గ్రౌండ్ పార్కింగ్ లేకపోయినట్లయితే, కారును ఎల్లప్పుడూ నీడగా ఉండే ప్రదేశంలో పార్క్ చేయటానికి ప్రయత్నించడం. అలా కుదరని పక్షంలో, కారుని కవర్‌తో కప్పి ఉంచండి. ఇలా చేయటం వలన కారు ఎక్స్టీరియర్ పెయింట్ దెబ్బతినదు మరియు ఇంటీరియర్ కూడా ఎక్కువ కాలం మన్నుతుంది.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

ఇలా ఎక్కువ కాలం పార్క్ చేసి ఉండే వాహనాల టైర్లలో ఎల్లప్పుడూ పూర్తిగా గాలి ఉండేలా చూసుకోవాలి. వాహనాలను ఎక్కువ సమయంలో ఎండలో లేదా అలానే పార్క్ చేసి ఉంచడం వలన, వాటి టైర్లలో గాలి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా లేకపోయినట్లయితే టైర్లలో గాలి పూర్తిగా తగ్గిపోయి టైర్లు పాడవటం జరగవచ్చు.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయండి

ధీర్ఘకాలం పాటు ఎలక్ట్రిక్ వాహనాలను అలానే పార్క్ చేసి ఉండటం వలన, వాటి బ్యాటరీల్లో ఉండే విద్యుత్‌శక్తి ఖాలీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, మీరు మీ ఎలక్ట్రిక్ కారును పార్కింగ్ చేయడానికి ముందు, దాని బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయాలని తయారీదారులు సిఫార్సు చేస్తున్నారు. ఇలా చేయటం వలన బ్యాటరీల జీవితకాలం పెరుగుతుంది.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కారుని ఉపయోగించినా లేదా ఉపయోగించకపోయినా దానిలోని బ్యాటరీలు సాధారణంగా డిశ్చార్జ్ అవుతూ ఉంటాయి. కాబట్టి, మీరు ఎక్కువ కాలం పాటు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించకుండా ఉండాల్సి వస్తే, క్రమం తప్పకుండా అప్పుడప్పుడూ వాటి బ్యాటరీలను చార్జ్ చేసుకుంటూ ఉండండి. ఇలాంటి వాహనాల్లో కనీసం 80 శాతం చార్జ్‌ని మెయింటైన్ చేస్తూ ఉండండి.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

అధునాతన ఎలక్ట్రిక్ కార్లను చార్జ్ చేయకుండా కొన్ని నెలల పాటు అలానే పార్క్ చేసి ఉంచేయవచ్చు. ఉదాహరణకు, ఇటీవల ప్రారంభించిన జాగ్వార్ ఐ-పేస్ విషయంలో వాహన తయారీదారు పేర్కొన్న సమాచారం ప్రకారం, జాగ్వార్ ఐ-పేస్ కారును ఆరు నెలల వరకు ఉపయోగించకుండా అలానే ఉంచుకోవచ్చు. అయితే, ఈ కారును నెలకు కనీసం ఒక్కసారైనా ఛార్జ్ చేసుకోవటం మంచిది.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

జాగ్వార్ ఐ-పేస్‌లో స్మార్ట్ ఆన్-బోర్డు బ్యాటరీ మెయింటినెన్స్ సిస్టమ్ ఉంటుంది. ఇది కారులోని అధిక వోల్టేజ్ బ్యాటరీని నియంత్రిస్తుంది మరియు చాలా తక్కువ శక్తిని వినియోగించేలా చేస్తుంది. ఫలితంగా, కారులోని బ్యాటరీ ఎక్కువ కాలం పాటు చార్జ్‌ని కలిగి ఉంటుంది.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

12 వోల్ట్ బ్యాటరీ విషయంలో జాగ్రత్తలు

ఎలక్ట్రిక్ కారులోని ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిచ్చే ప్రధాన బ్యాటరీతో పాటుగా ఇందులో చిన్న 12 వోల్ట్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఈ చిన్న బ్యాటరీ కారులోని ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కంట్రోల్ చేయటానికి ఉపయోగపడుతుంది.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

ఈ చిన్న 12 వోల్ట్ బ్యాటరీ సాయంతో కారులోని హెడ్‌లైట్స్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టాండ్‌బై మోడ్, వైపర్ మరియు విండో మోటార్స్ మరియు ఇతర పవర్ అసిస్టెడ్ ఫీచర్లను యాక్సెస్ చేయవచ్చు. పెట్రోల్, డీజిల్ వాహనాల్లోని 12 వోల్ట్ బ్యాటరీ అందులోని ఆల్టర్నేటర్ సాయంతో చార్జ్ అవుతుంది. అంటే, ఆయా కార్లలోని ఇంజన్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఆల్టర్నేటర్ తిరిగడం ద్వారా 12 వోల్ట్ బ్యాటరీ తిరిగి చార్జ్ అవుతూ ఉంటుంది.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

కానీ, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అలా కాదు. ఎలక్ట్రిక్ వాహనాలలో ఆల్టర్నేటర్ ఉండదు, దానికి బదులుగా డిసి టూ డిసి కన్వర్టర్ ద్వారా ఇందులోని 12 వోల్ట్ బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఇది అధిక వోల్టేజ్‌తో కూడిన 400 వోల్ట్స్ విద్యుత్తును 12 వోల్ట్‌లుగా మార్చి, ఈ చిన్న బ్యాటరీని చార్జ్ చేస్తుంది. కాబట్టి, కారులోని ప్రధాన బ్యాటరీ వినియోగంలో లేనప్పుడు, అది చిన్న బ్యాటరీని ఛార్జ్ చేయదు.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

12 వోల్ట్ బ్యాటరీ నెగటివ్ టెర్మినల్ తొలగించండి

ఒకవేళ మీరు మీ ఎలక్ట్రిక్ కారుని ఎక్కువ కాలం పాటు పార్క్ చేయాల్సి వస్తే, అందుంలోని 12 వోల్ట్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ కావడాన్ని నివారించేందుకు, వాహనాన్ని పార్క్ చేసిన తర్వాత బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్‌ను తొలగించడం మంచిది.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

అయితే, మీరు అలా చేయడానికి ముందు, మీ కార్ కీ మరియు కార్ యొక్క ఓనర్స్ మ్యాన్యువల్ కారులో కాకుండా, మీ చేతిలో ఉండేటట్లు జాగ్రత్త వహించండి. బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ డిస్‌కనెక్ట్ చేసే సమయంలో ఒకవేళ పొరపాటు కారు లాక్ అయిపోయినా, మీ వద్ద ఉన్న కీ సాయంతో మ్యాన్యువల్‌గా కారుని ఓపెన్ చేయవచ్చు.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

12-వోల్ట్ బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలి

ఒకవేళ మీరు మీ ఎలక్ట్రిక్ కారులోని 12 వోల్ట్ బ్యాటరీని డిస్‌కనెక్ట్ చేయడం మరచిపోయి, దాని బ్యాటరీ మొత్తం ఖాలీ అయిపోయినట్లయితే, మీ ఈవీ ఓనర్స్ మాన్యువల్‌లో ఇచ్చిన సూచనలను ప్రకారం, కారుని జంప్ స్టార్ట్ చేయాలి. సాధారణ కార్ల మాదిరిగానే, ఈవీ 12 వోల్ట్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మీకు జంపర్ కేబుల్స్ అవసరం. ఒకవేళ మీ కారులోని 12 వోల్ట్ బ్యాటరీ పదే పదే ట్రబుల్ ఇస్తుంటే, మీరు బ్యాటరీ ఆధారిత జంప్ స్టార్ట్ కిట్‌ను కొనుగోలు చేయటం మంచిది.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

లాక్‌డౌన్ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించేటప్పుడు

ఎలక్ట్రిక్ వాహనాలను మొదటి సారిగా ఉపయోగించేటప్పుడు లేదా కొన్ని రోజుల విరామం తర్వాత నడిపాల్సి వచ్చినప్పుడు, అందులోని బ్యాటరీలను స్టాండర్డ్ చార్జర్ సాయంతో పూర్తిగా 100 శాతం ఎస్ఓసి (స్టేట్ ఆఫ్ చార్జ్) చేసుకున్న తర్వాత మాత్రమే వాటిని వినియోగించాలని ఈవీ తయారీదారులు సిఫారసు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కారు బ్యాటరీలను చార్జ్ చేసేందుకు ఫాస్ట్ చార్జర్లను ఉపయోగించకూడదు.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

భద్రతా ప్రోటోకాల్‌లు

చివరగా, సాధారణ కార్లకు వర్తించే అన్ని భద్రతా ప్రోటోకాల్‌లు మీ ఎలక్ట్రిక్ వాహనానికి కూడా వర్తిస్తాయి. కాబట్టి, మీ కారుని పార్క్ చేసిన తర్వాత అది పూర్తిగా లాక్ చేయబడిందని నిర్ధారించుకోండి. అంతేకాకుండా, కారుని కార్ కవర్ ఉపయోగించి కప్పి ఉంచండి.

లాక్‌డౌన్‌లో ఎలక్ట్రిక్ కార్లను సరిగ్గా మెయింటైన్ చేయడం ఎలా? - చిట్కాలు

ఒకవేళ మీరు మీ కారులోని 12 వోల్ట్ బ్యాటరీ టెర్మినల్‌ను తొలగించాలని అనుకోకపోతే, కారుని కనీసం 15 రోజులకు ఒక్కసారైనా కొంత దూరం పాటు డ్రైవ్ చేయండి. కనీసం 20 నిమిషాల పాటు కారుని ఆన్‌లో ఉంచడం లేదా డ్రైవ్ చేయటం చేయండి. ఇలా చేయటం వలన 12 వోల్ట్ బ్యాటరీ ఆరోగ్యంగా ఉండి, కారులోని ఇతర వ్యవస్థలను సరిగ్గా పనిచేసేలా చేస్తుంది.

Most Read Articles

English summary
How To Maintain Electric Cars During The Lockdown: Tips And Tricks. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X