దొంగల బారి నుండి బైకులు ఎలా కాపాడుకోవాలి?

Written By:

పదహారు ప్రాయం నుండి పదుల సంవత్సరాల వయసున్న వారి వరకు బైకులంటే ఇష్టం లేని వారెవరూ ఉండరు. ఎంతో ఇష్టంగా కొనుకున్న బైకు దొంగలబారిన పడి రాత్రికి రాత్రే మాయమైతే ఎంతో బాధగా టుంది కదూ... మరి మీ బైకును సేఫ్‌గా, దొంగతనం కాకుండా ఉంచుకోవాలనుకుంటే మీ కోసం కొన్ని చిట్కాలు.

దొంగల బారి నుండి బైకులు ఎలా కాపాడుకోవాలి

కీస్‌తో బైకు లాక్ చేసి, హ్యాండిల్ లాక్ చేసిన బైకులను దొంగలించడం దొంగలకు వెన్నతో పెట్టిన విద్య. చాలా మంది బైకు దొంగలు కీ లేకుండా స్టార్ట్ చేసేందుకు కేబుల్స్‌ను డైరెక్ట్ చేస్తారు. మరియు హ్యాండిల్ లాక్‌ను బలంవతంగా బెండ్ చేసి అన్ లాక్ చేసేస్తారు.

Recommended Video - Watch Now!
[Telugu] Bajaj Platina Comfortec Launched In India - DriveSpark
దొంగల బారి నుండి బైకులు ఎలా కాపాడుకోవాలి

కీస్‌తో బైకును పూర్తిగా లాక్ చేసి, హ్యాండిల్ లాక్ చేశామనే ధీమాగా ఉంటే మీ బైక్ సేఫ్‌గా ఉంటుందని పొరబడినట్లే. అయితే, ఈ రెండింటితో బైక్ సేఫ్‌గా ఉంటుందని గ్యారంటీ లేదు. కాబట్టి బైకును సేఫ్‌గా, దొంగల నుండి కాపాడుకోవడానికి కొన్ని లాక్స్ ఉన్నాయి. వాటి గురించి మీ కోసం....

దొంగల బారి నుండి బైకులు ఎలా కాపాడుకోవాలి

డిస్క్ లాక్:

డిస్క్ లాక్ ఒక చిన్నపాటి మెకానిజం. దీనిని డిస్క్ బ్రేక్ మీద ఉన్న హోల్స్ ద్వారా లాక్ చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా చక్రం ముందు కదలడానికి వీలుపడదు. దీని ద్వంసం చేయాలన్నా సమయం పడుతుంది.

దొంగల బారి నుండి బైకులు ఎలా కాపాడుకోవాలి

టైర్ లాక్:

డిస్క్ బ్రేకులు లేని బైకులకు టైర్ లాక్ ప్రత్యామ్యాయంగా ఉపయోగపడుతుంది. ఇది కూడా తాళంలానే ఉంటుంది. ముందు చక్రాల వద్ద ఫ్రంట్ ఫోర్క్ మీద అటాచ్ చేస్తారు. బైక్ పార్క్ చేసినపుడు టైర్ లాక్ చేయవచ్చు.

దొంగల బారి నుండి బైకులు ఎలా కాపాడుకోవాలి

బ్రేక్ లాక్:

ఒక విధంగా చెప్పాలంటే కార్లలో హ్యాండ్ బ్రేక్ తరహా పనిచేస్తుంది. అంటే బైక్ పార్క్ చేసినపుడు బ్రేక్ లాక్ చేస్తే, బ్రేకులు చక్రాలన గట్టిగా పట్టి ఉంచుతాయి. కాబట్టి హ్యాండిల్ బార్ తొలగించినా... బైకు స్టార్ట్ చేసిన ఈ లాక్స్‌తో బైకును భద్రం చేసుకుంటే దొంగల ప్రయత్నాలను విఫలం కావడం గ్యారంటీ.

దొంగల బారి నుండి బైకులు ఎలా కాపాడుకోవాలి

జీపీఎస్ డివైజ్:

మీ బైకులో రహస్య ప్రదేశంలో జీపిఎస్ డివైజ్ అమర్చుకోవడం ద్వారా బైకు చోరీకి గురైనప్పటికీ, అది ఏ లోకేషన్‍‌లో ఉందో సులభంగా గుర్తించవచ్చు. అయితే, మార్కెట్లో నాణ్యతలేని జీపీఎస్ పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బైకు సరిగ్గా దొంగతనానికి గురైనపుడు అది పనిచేయడం మానేస్తే అంతే సంగతులు కాబట్టి మంచి బ్రాండెడ్ జీపీఎస్ డివైజ్ తీసుకుని బైకులో ఫిక్స్ చేయండి.

English summary
Read In Telugu: How to protect your bike from theft
Story first published: Friday, November 3, 2017, 13:18 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark