హైదరాబాద్‌లో అధునాతన 'ఈ-ఛలాన్' సిస్టమ్ ప్రారంభం

హైదరాబాద్ మోటారిస్టులకు గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్! ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు, జరిమానాలను చెల్లించేందుకు ఈసేవా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అసరం లేదు. మీ వద్ద డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఉంటే చాలు, జరిమానాను ఇలా కార్డ్ స్వైప్ చేసి అలా చెల్లించేయవచ్చు. రాష్ట్రంలోని మోటారిస్టుల సౌకర్యార్థం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు.

ఇందులో భాగంగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం 'పర్సనల్ డిజిటల్ అసిస్టెంట్' (పిడిఏ) మెషీన్లను ప్రారంభించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను జరిమానాలను ఈ మెషీన్ల సాయంతో డెబిట్/క్రెడిట్ కార్డులను స్వైప్ చేయటం ద్వారా చెల్లించవచ్చు. ఈ కొత్త వ్యవస్థలో భాగంగా, నగరంలోని అన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వద్ద జిపిఆర్ఎస్ కనెక్టివిటీతో కూడిన అధునాతన పిడిఏ మెషీన్లను అందుబాటులో ఉంచుతారు.

ఈ పిడిఏ మెషీన్లు వైర్‌లెస్‌గా ట్రాఫిక్ ఫోలీస్ సెంట్రల్ సర్వర్‌కు కనెక్ట్ అయ్యి ఉండి, స్పాట్‌లో నిబంధనను ఉల్లంఘించిన వారి పేరుపై ఛలాన్‌ను జనరేట్ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా, వీటి సాయంతో ఇదివరకటి నిబంధల ఉల్లంఘనను కూడా తెలుసుకునే సదుపాయం ఉంటుంది. ఇలా జనరేట్ చేసిన ఛలాన్‌పై నిబంధనలను ఉల్లంఘించిన వారు జరిమానా మొత్తాన్ని స్పాట్‌లోనే నగదు రూపంలో చెల్లించవచ్చు. ఒకవేళ నగదు అందుబాటులో లేనట్లయితే, తమ వద్ద ఉండే డెబిట్/క్రెడిట్ కార్డుల సాయంతో జరిమానాను చెల్లించవచ్చు.

హైదరాబాద్‌లో అధునాతన 'ఈ-ఛలాన్' సిస్టమ్‌ను ప్రారంభం

హైదరాబాద్‌లో అధునాతన 'ఈ-ఛలాన్' సిస్టమ్‌ను ప్రారంభం

పాత కాలపు ఛలాన్ పుస్తకాలకు చెల్లు చీటి, ఇకపై స్పాట్‌లోనే ఆన్‌లైన్ ఛలాన్ జారీ.

హైదరాబాద్‌లో అధునాతన 'ఈ-ఛలాన్' సిస్టమ్‌ను ప్రారంభం

హైదరాబాద్‌లో అధునాతన 'ఈ-ఛలాన్' సిస్టమ్‌ను ప్రారంభం

ప్రజలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోలను హెచ్‌టిపి (హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్) వెబ్‌సైట్‌లో చూడొచ్చు (భారతదేశంలోనే ఈ తరహా విధానం మొట్టమొదటి సారి కావటం విశేషం).

హైదరాబాద్‌లో అధునాతన 'ఈ-ఛలాన్' సిస్టమ్‌ను ప్రారంభం

హైదరాబాద్‌లో అధునాతన 'ఈ-ఛలాన్' సిస్టమ్‌ను ప్రారంభం

ఛలాన్‌లకు సంబంధించి ఆన్‌లైన్ పేమెంట్ల కోసం హెచ్‌టిపి, ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐసిఐసితో ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

హైదరాబాద్‌లో అధునాతన 'ఈ-ఛలాన్' సిస్టమ్‌ను ప్రారంభం

హైదరాబాద్‌లో అధునాతన 'ఈ-ఛలాన్' సిస్టమ్‌ను ప్రారంభం

ఈ-ఛలాన్‌లో ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘినకు సంబంధించిన ఫొటో ఉంటుంది (ఇది కూడా భారతదేశంలోనే మొట్టమొదటి సారి కావటం విశేషం).

హైదరాబాద్‌లో అధునాతన 'ఈ-ఛలాన్' సిస్టమ్‌ను ప్రారంభం

హైదరాబాద్‌లో అధునాతన 'ఈ-ఛలాన్' సిస్టమ్‌ను ప్రారంభం

అధునాతన పిడిఏ మెషీన్

అధునాతన పిడిఏ మెషీన్‌ సాయంతో డెబిట్/క్రెడిట్ కార్డు సాయంతో స్పాట్‌లో ఛలాన్ పేమెంట్‌ను చేయవచ్చు.

ట్రాఫిక్ ఛలాన్‌పై జరిమానా చెల్లించేందుకు గంటల తరబడి క్యూలో నిలుచునే వారికి ఇది గుడ్ న్యూస్. ఇకపోతే నిబంధనలు ఉల్లంఘించి జేబులో డబ్బులు లేవ్ అని తప్పించుకొనే వారికి ఇది బ్యాడ్ న్యూస్.

Source: HTP

Most Read Articles

English summary
Now, you can pay fine for traffic violations by just swiping a debit/credit card. Putting an end to woes of people, who have to wait in long queues at eSeva centers to pay fines, police have launched personal digital assistant (PDA) machines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X