మండు వేసవిలో మీ CNG కారును జాగ్రత్తగా చూసుకోవడం ఎలా..?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో, కొనుగోలుదారులు ఇప్పుడు తక్కువ ధరకే లభించే సిఎన్‌జి వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు దేశంలో సిఎన్‌జి ఇంధన లభ్యత కూడా మెరుగుపడటంతో, ఈ వాహనాలకు డిమాండ్ అధికమైంది. అయితే, చాలా మందిలో సిఎన్‌జి కార్ల భద్రత గురించి కొన్ని అపోహలు ఉంటున్నాయి. ఇవి గ్యాస్ తో నడిచేవి కావడంతో ఈ అపోహలు ఉండటం సాధారణమే. అయితే, ప్రస్తుతం కార్ కంపెనీలు ఆధునిక టెక్నాలజీతో మరియు సేఫ్టీతో కూడిన ఫ్యాక్టరీ ఫిట్టెడ్ కిట్‌లను ఈ కార్ల కోసం అందిస్తున్నారు.

మండు వేసవిలో మీ CNG కారును జాగ్రత్తగా చూసుకోవడం ఎలా..?

ఏదేమైనప్పటికీ, సిఎన్‌జి కార్ల భద్రత విషయంలో మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యేకించి, ఈ వేసవిలో సిఎన్‌జి కార్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. భారతదేశంలో అనేక నగరాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీలను దాటుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, మీరు ఎండలో బయటకు వెళ్లేటప్పుడు మీ CNG కారును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. వేసవి కాలంలో మీ CNG కారును ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసుకుందాం రండి.

మండు వేసవిలో మీ CNG కారును జాగ్రత్తగా చూసుకోవడం ఎలా..?

1. సిఎన్‌జి ట్యాంక్‌ ని పూర్తిగా నింపకండి

సాధారణంగా, సిఎన్‌జి గ్యాస్ ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో మాత్రమే లభిస్తుంది కాబట్టి, ఇది తిరిగి దొరుకుతుందా లేదా అనే సందేహంతో చాలా మంది ఫుల్ ట్యాంక్ చేయిస్తుంటారు. కానీ, సమ్మర్‌లో ఇలా చేయడం శ్రేయస్కరం కాదు. వేసవిలో అధిక ఉష్ణోగ్రత కారణంగా CNG గ్యాస్ వ్యాకోచిస్తుంది. ఇది ట్యాంక్‌పై ఒత్తిడిని పెంచుతుంది, ద్వారా ట్యాంక్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

మండు వేసవిలో మీ CNG కారును జాగ్రత్తగా చూసుకోవడం ఎలా..?

కాబట్టి, వేసవిలో CNG ని ఫుల్ ట్యాంక్‌ చేయకుండా, ట్యాంక్ లో కాస్తంత గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఉదాహరణకు, మీ కారులో ఇన్‌స్టాల్ చేయబడిన CNG ట్యాంక్ 10 లీటర్ల కెపాసిటీని కలిగి ఉంటే, అందులో 8 లీటర్లు CNG మాత్రమే నింపండి. ఇది వేసవిలో CNG వ్యాకోచానికి పూర్తి స్థలాన్ని ఇస్తుంది. ఒకవేళ మీ కారులో CNG అయిపోతే చింతించకండి, మీరు CNG నుండి పెట్రోల్‌కి మారే అవకాశం ఉంటుంది కాబట్టి, పెట్రోల్ ఇంధనంతో ఎంచక్కా ముందుకు సాగిపోవచ్చు.

మండు వేసవిలో మీ CNG కారును జాగ్రత్తగా చూసుకోవడం ఎలా..?

2. సిలిండర్‌లో లీకేజీని తనిఖీ చేయండి

సిఎన్‌జి సిలిండర్‌లో లీకేజీ చాలా ప్రమాదకరం. కాబట్టి సిఎన్‌జి సిలిండర్‌కు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి హైడ్రో పరీక్ష చేయించాలి. ఈ పరీక్షలో సిలిండర్‌లో ఏదైనా లీకేజీ ఉందా లేదా అని తెలుస్తుంది. ఈ పరీక్ష CNG సిలిండర్ యొక్క ప్రెజర్ బేరింగ్ సామర్థ్యాన్ని కూడా చూపుతుంది. ఒకవేళ మీ కారు యొక్క సిఎన్‌జి సిలిండర్ పాతది మరియు తుప్పు పట్టినట్లయితే, ఆలస్యం చేయకుండా వెంటనే దానిని మార్చేయండి. కారులో ఏదైనా విచిత్రమైన గ్యాస్ వాసన వచ్చినా వెంటనే లీక్ కోసం తనిఖీ చేయండి.

మండు వేసవిలో మీ CNG కారును జాగ్రత్తగా చూసుకోవడం ఎలా..?

3. అధీకృత డీలర్ నుండి మాత్రమే CNG కిట్‌లను కొనుగోలు చేయండి

మీరు మీ కారులో CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు దానిని అధీకృత డీలర్ నుండి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీరు స్థానిక డీలర్ నుండి CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఖచ్చితంగా కిట్ యొక్క వారంటీని తనిఖీ చేయండి. ఈ రోజుల్లో చాలా కంపెనీలు తమ కార్లలో నాణ్యమైన ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ లను అందిస్తున్నాయి. కంపెనీ వీటికి వారంటీని కూడా అందిస్తుంది. అంతేకాకుండా, ఇవి కార్ కంపెనీల యొక్క ఫ్యాక్టరీలో నేరుగా అమర్చబడుతాయి మరియు అవసరమైన అన్ని భద్రతా సేఫ్టీ చర్యలు తీసుకోబడుతాయి.

మండు వేసవిలో మీ CNG కారును జాగ్రత్తగా చూసుకోవడం ఎలా..?

4. ఎండలో కారును పార్క్ చేయవద్దు

వేసవి కాలంలో, ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఓపెన్ ప్లేస్ లో కారును పార్క్ చేయడం సురక్షితం కాదు. ఎండలో సిఎన్‌జి కారును పార్క్ చేయడం వలన అది త్వరగా వేడెక్కి, సిఎన్‌జి ట్యాంక్ లోని ఇంధనం కూడా వేడెక్కుతుంది. ఒకవేళ మీరు ఎక్కువసేపు బయట కారును పార్క్ చేయవలసి వస్తే, దానిని ఎండలో కాకుండా, నీడగా ఉండే ప్రదేశంలో పార్క్ చేయడానికి ప్రయత్నించండి లేదా షేడ్ ఉండే పెయిడ్ పార్కింగ్ స్థలాన్ని అయినా ఉపయోగించవచ్చు.

మండు వేసవిలో మీ CNG కారును జాగ్రత్తగా చూసుకోవడం ఎలా..?

5. గడువు తేదీని (ఎక్స్‌పైరీ డేట్‌ ని) తనిఖీ చేయండి

ప్రతి వస్తువుని ఓ ఎక్స్‌పైరీ డేట్ (గడువు తేదీ) అనేది ఉంటుంది. ఇది సిఎన్‌జి సిలిండర్లకు కూడా వర్తిస్తుంది. కాబట్టి, మీ కారులోని సిఎన్‌జి కిట్ యొక్క గడువు తేదీని తప్పకుండా తనిఖీ చేయండి. సిఎన్‌జి కిట్ యొక్క గడువు తేదీ ముగియబోతున్నట్లయితే, ఆలస్యం చేయకుండా దానిని తొలగించి, దాని స్థానంలో కొత్త దానిని అమర్చుకోండి. సాధారణంగా, కారు యొక్క CNG కిట్ యొక్క గడువు 15 సంవత్సరాలు ఉంటుంది. కిట్‌లో లీకేజీ లేకపోతే, అది మరికొన్ని సంవత్సరాల వరకు పనిచేస్తుంది. అయితే, భద్రత కోసం మీరు గడువు తేదీకి ముందే కొత్త కిట్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.

Most Read Articles

English summary
Its time to take care of your cng car in hot summer tips
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X