mParivahan యాప్‌తో మీ వాహన పత్రాలు, లైసెన్స్ అన్నీ మీ ఫోన్‌లోనే.. చలాన్స్ నుండి తప్పించుకోవచ్చు!

స్వంత వాహనంలో ఇంటి నుండి బయటకు బయలుదేరేటప్పుడు సదరు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు మరియు డ్రైవర్ లైసెన్స్ ను వెంట తీసుకువెళ్లడం తప్పనిసరి. అయితే, చాలా సందర్భాల్లో మనం వీటిని ఇంటిలోనే మర్చిపోయి వెళ్తుంటాం. అటువంటి పరిస్థితుల్లో మార్గమధ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు ఆపి తనిఖీ చేసే, సరైన పత్రాలు లేని కారణంగా ట్రాఫిక్ చాలాన్ విధించే అవకాశం ఉంది. అయితే, ఇందుకు ఒక సులువైన డిజిటల్ పరిష్కారం ఉంది. అదేంటో ఈ కథనంలో తెలుసుకుందా రండి.

mParivahan యాప్‌తో మీ వాహన పత్రాలు, లైసెన్స్ అన్నీ మీ ఫోన్‌లోనే.. చలాన్స్ నుండి తప్పించుకోవచ్చు!

ప్రస్తుతం, ప్రపంచం మొత్తం స్మార్ట్‌ఫోన్ చుట్టూ తిరుగుతోంది. స్మార్ట్‌ఫోన్ సాయంతో మన అరచేతి నుండే అన్ని విషయాలను కంట్రోల్ చేయగలుగుతున్నాం. మన వాహనా పత్రాలు మరియు డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటిని డిజిటల్‌గా స్టోర్ చేసుకునేందుకు ఇప్పుడొక యాప్ అందుబాటులోకి వచ్చింది. దానిపేరే 'ఎమ్‌పరివాహన్' (mParivahan). ఈ స్మార్ట్ ఫోన్ యాప్ సాయంతో మీ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను క్యూఆర్ కోడ్ రూపంలో స్టోర్ చేసుకోవచ్చు. ఈ యాప్ ను భారత ప్రభుత్వం రూపొందించింది.

mParivahan యాప్‌తో మీ వాహన పత్రాలు, లైసెన్స్ అన్నీ మీ ఫోన్‌లోనే.. చలాన్స్ నుండి తప్పించుకోవచ్చు!

mParivahan యాప్ అంటే ఏమిటి

దేశంలో వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన పౌరులందరూ తమ వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC), డ్రైవింగ్ లైసెన్స్ (DL) భీమా (Insurance) మొదలైన అన్ని ముఖ్యమైన పత్రాలను డిజిటల్ మాధ్యమం ద్వారా వారి మొబైల్‌ ఫోన్‌లో ఆన్‌లైన్ డిజిటల్ ఫార్మాట్‌లో ఉంచడానికి భారత ప్రభుత్వం ద్వారా ప్రారంభించిన స్మార్ట్‌‌ఫోన్ అప్లికేషనే ఈ mParivahan యాప్. ఇది అండ్రాయిడ్ మరియు ఐఫోన్ యూజర్ల కోసం ఆయా ప్లే స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా డ్రైవర్లు తమ మొబైల్ ఫోన్‌లోనే వర్చువల్ ఆర్‌సి, లైసెన్స్ తదితర పత్రాలతో పాటు రోడ్డు రవాణా కార్యాలయాలు, ట్రాఫిక్ స్టేట్‌లు, ఆర్‌టీఓ కార్యాలయ లొకేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా పొందవచ్చు.

mParivahan యాప్‌తో మీ వాహన పత్రాలు, లైసెన్స్ అన్నీ మీ ఫోన్‌లోనే.. చలాన్స్ నుండి తప్పించుకోవచ్చు!

mParivahan యొక్క పత్రాలు పూర్తిగా చెల్లుబాటు అయ్యేవి

ఈ mParivahan యాప్‌లో డ్రైవర్లు భద్రపరచుకునే డిజిటల్ పత్రాలు రవాణా మంత్రిత్వ శాఖచే ఆమోదించబడ్డాయి మరియు అందువల్ల అవి అసలు పత్రాలుగా గుర్తించబడతాయి. ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆర్‌సి కోసం అడిగితే, మీరు ఎటువంటి సందేహం లేకుండా మీ ఫోన్‌లో ఉండే mParivahan యాప్‌లో స్టోర్ చేసిన డిజిటల్ పత్రాలను వారికి చూపించవచ్చు. కాగితపు పత్రాల మాదిరిగానే ఈ డిజిటల్ పత్రాలు కూడా పూర్తిగా చెల్లుబాటు అవుతాయి. పేపర్లు లేకుండా వాహనం నడపడం వలన మీరు చెల్లించాల్సిన భారీ చలాన్ల నుండి ఈ యాప్ మిమ్మల్ని కాపాడుతుంది.

mParivahan యాప్‌తో మీ వాహన పత్రాలు, లైసెన్స్ అన్నీ మీ ఫోన్‌లోనే.. చలాన్స్ నుండి తప్పించుకోవచ్చు!

mParivahan ప్రయోజనాలు ఏమిటి

ఈ mParivahan యాప్ ద్వారా, మీ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు (పొల్యూషన్ సర్టిఫికెట్ మినహా) డిజిటల్ ఫార్మాట్‌లో మీ అరచేతిలోనే ఉంటాయి. ఒకవేళ, ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు మీరు మీ కాగితపు పత్రాలను మరచిపోయినప్పటికీ, మీ జేబులో స్మార్ట్ ఫోన్ ఉండి అందులో ఎమ్‌పరివాహన్ యాప్ మరియు అందులో మీ డిజిటల్ సర్టిఫికెట్ కాపీలు ఉంటే సరిపోతుంది. ఈ డిజిటల్ ఫార్మాట్ లో ఉండే డాక్యుమెంట్లు అసలు పత్రాల వలె చెల్లుబాటు అవుతాయి.

వినియోగదారులు ఈ డిజిటల్ పత్రాలను దేశంలో ఎక్కడైనా ఉపయోగించవచ్చు. ఈ యాప్ ద్వారా మీరు మీ వాహన యజమాని పేరు, రిజిస్ట్రేషన్ తేదీ, రిజిస్ట్రేషన్ అధికారం, ఇంధన రకం, వాహనం వయస్సు, వాహనం తరగతి, బీమా చెల్లుబాటు, ఫిట్‌నెస్ చెల్లుబాటు వంటి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, ఈ యాప్ దొంగిలించబడిన లేదా ఏదైనా అనుమానాస్పదమైన వాహనానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.

mParivahan యాప్‌తో మీ వాహన పత్రాలు, లైసెన్స్ అన్నీ మీ ఫోన్‌లోనే.. చలాన్స్ నుండి తప్పించుకోవచ్చు!

ప్లేస్టోర్ నుండి mParivahan డౌన్‌లోడ్ చేసుకోండి

ఇదివరకు చెప్పుకున్నట్లుగా mParivahan అప్లికేషన్ Android ప్లేస్టోర్ మరియు Apple ఐస్టోర్ లలో రెండింటిలో అందుబాటులో ఉంటుంది. యాజర్లు ఈ యాప్ ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా ప్లేస్టోర్ నుండి ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, ధరఖాస్తుదారులు తమ వివరాలను నమోదు చేసి, అందులో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైన్-అప్ ప్రక్రియలో భాగంగా, రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబరుకు ఒక OTP వస్తుంది. ఆ ఓటిపిని నమోదు చేసిన తర్వాత సైన్-అప్ ప్రక్రియ పూర్తవుతుంది.

mParivahan యాప్‌తో మీ వాహన పత్రాలు, లైసెన్స్ అన్నీ మీ ఫోన్‌లోనే.. చలాన్స్ నుండి తప్పించుకోవచ్చు!

ఈ యాప్ లోకి సైన్ ఇన్ అయిన తర్వాత యూజర్లు ఈ యాప్ లో తాము నమోదు చేయాలనుకున్న వాహనాలు మరియు డ్రైవింగ్ లైసెన్సుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎన్నైనా డ్రైవింగ్ లైసెన్సులు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లను స్టోర్ చేసుకోవచ్చు. ఇలా విజయవంతంగా వీటిని స్టోర్ చేసుకున్న తర్వాత వీటిని డిజిటల్ డాక్యుమెంట్ల రూపంలో ఉపయోగించవ్చచు. ఒకవేళ మీ వాహనాన్ని ఎవరైనా ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ తీసుకువెళ్తున్నట్లయితే, వారికి కూడా ఈ డిజిటల్ సర్టిఫికెట్లను కొంత సమయం కోసం డిజిటల్‌గా షేర్ చేయవచ్చు.

Most Read Articles

English summary
Mparivahan can save you from challan know its benefits uses
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X