కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

కొత్త కారు కొనడం అనేది చాలా మంది ఓ చిరకాల కోరికలా ఉంటుంది. నిజానికి, కస్టమర్లు కారు కొనేముందు దాని గురించి భారీగా మార్కెట్ రీసెర్చ్ కూడా చేస్తారు. అది ఏ బ్రాండ్ కారు, మైలేజ్ ఎంత ఇస్తుంది, సర్వీస్ కాస్ట్ ఎలా ఉంటుంది, స్పేర్ పార్ట్స్ త్వరగా దొరుకుతాయా, కారులో స్పేస్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఫీచర్లు ఏమేమి లభిస్తాయి.. ఇలా అనేక విషయాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటారు. అయితే, ఈ చెక్ లిస్ట్‌లో వీటిన్నింటికన్నా అత్యంత ముఖ్యమైనది ఆ కారులో లభించే సేఫ్టీ ఫీచర్ల లిస్ట్.

కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం భారతదేశంలో కార్లు చాలా సురక్షితంగా మారాయి. రోడ్డు ప్రమాదాలలో జరిగే నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం కూడా వాహనాలలో కొన్ని రకాల సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసింది. దీంతో కార్ మేకర్లు ప్రతి కారులో కొన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరిగా అందిస్తున్నాయి. కారులో సరైన సేఫ్టీ ఫీచర్లు లేకపోయినట్లయితే, అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సాధారణంగా ఎంట్రీ-లెవల్ కార్లు అతి తక్కువ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటాయి.

మరి కొత్త కారు కొనేముందు మనం ఆ కారులో చూడాల్సిన టాప్ 10 బేసిక్ సేఫ్టీ ఫీచర్లు ఏవో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..!

కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

1. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు

ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడే అన్ని కార్లలో ఇప్పుడు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేయబడ్డాయి. దీంతో కార్ కంపెనీలు ఎంట్రీ లెవల్ కార్లలో కూడా డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌తో పాటు ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ను కూడా తప్పనిసరిగా అందిస్తున్నాయి. ముందు వైపు నుండి ప్రమాదం జరిగినప్పుడు ఈ ఎయిర్‌బ్యాగ్‌లు, కారులోని డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్లకు తీవ్ర గాయాలు కాకుండా రక్షిస్తాయి. కాబట్టి, కారు కొనేముందు అందులో రెండు ఎయిర్‌బ్యాగ్స్ అందించబడుతున్నాయా లేదా చూసుకోండి. రెండు కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్స్ ఉంటే, మరీ మంచిది.

కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

2. సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్

సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్ ప్రమాద సమయంలో ప్రయాణీకుడిని సీటులో నుండి కదలకుండా ఉంచడానికి సహాయపడుతుంది. డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు లేదా కారు క్రాష్ అయినప్పుడు సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్ సీటులో ప్రయాణీకులను గట్టిగా పట్టి ఉంచుతుంది. కార్లలో ఇది కూడా ఓ స్టాండర్డ్ బేసిక్ సేఫ్టీ ఫీచర్ గా ఉంటుంది. ఈ ఫీచర్ ప్రమాద సయంలో ప్రయాణీకుడికి తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశాలను తగ్గిస్తుంది. ప్రమాదంలో కారు బోల్తా పడితే, అటువంటి పరిస్థితిలో కూడా సీటు బెల్ట్ ప్రయాణీకులను సీటు నుండి వేరు చేయకుండా ఉంచుతుంది. ఎయిర్‌బ్యాగ్‌లు విచ్చుకోవడంలో కూడా సీట్‌బెల్టులు కీలక పాత్ర పోషిస్తాయి.

కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

3. స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్

స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ అంటే కారును మనం స్టార్ట్ చేసి, కొంత వేగంతో నడిపిన తర్వాత అన్ని తలుపులు ఆటోమేటిక్ గా లాక్ చేయబడుతాయి. ప్రస్తుత కార్లలో ఇది చాలా ముఖ్యమైన ఫీచర్. మీరు కారును స్టార్ట్ చేసిన తర్వాత డోర్‌లను సరిగ్గా లాక్ చేయడం మర్చిపోతే, కారు నిర్ణీత వేగానికి చేరుకున్న వెంటనే ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా డోర్‌లను లాక్ చేస్తుంది. మీరు చిన్న పిల్లలతో కారులో ప్రయాణిస్తున్నట్లయితే ఈ ఫీచర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఒకవేళ ఏదైనా డోర్ కొద్దిగా ఓపెన్ చేసినట్లు ఉంటే, ఈ స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఫీచర్ పనిచేయదు.

కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

4. క్రాష్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్

స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ ఫీచర్ మాదిరిగానే క్రాష్ సెన్సింగ్ డోర్ అన్‌లాక్ కూడా చాలా ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్. ఇది ప్రమాదం జరింగిందని గుర్తించి, డోర్లను ఆటోమేటిక్‌గా అన్‌లాక్ చేస్తుంది. ఫలితంగా, కారు లోపల ఉన్న ప్రయాణికులు వీలైనంత త్వరగా కారు నుండి బయటకు రావడంలో ఇది సహాయపడుతుంది. బేసిక్ కార్లలో ఇలాంటి సేఫ్టీ ఫీచర్ ఉండకపోవచ్చు, కొన్ని మిడ్-రేంజ్ మరియు హై-ఎండ్ కార్లలో ఇది లభిస్తుంది.

కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

5. బిడిఎస్‌తో కూడిన ఏబిఎస్

ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) అనేది కూడా ప్రస్తుతం అన్ని కార్లలో లభిస్తున్న స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్. పేరు సూచించినట్లుగానే, డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు ఉత్పత్తయ్యే శక్తి నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడి, వాహనం ఆగే దూరాన్ని (స్టాపింగ్ డిస్టెన్స్) ను తగ్గించడంలో ఈ ఫీచర్ గొప్పగా ఉపయోగపడుతుంది. యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) లో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు కారు చక్రాలు లాక్ అవ్వకుండా నిరోధిస్తుంది, తద్వారా కారు అదుపు తప్పకుండా ఉండి, డ్రైవర్‌కు కారును తిప్పడానికి మరియు ప్రమాదాన్ని నివారించడానికి తగినంత సమయాన్ని ఇది అందిస్తుంది.

కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

6. రివర్స్ పార్కింగ్ సెన్సార్

రివర్స్ పార్కింగ్ సెన్సార్ కూడా చాలా ఉపయోగకరమైన సేఫ్టీ ఫీచర్. రద్దీగా ఉండే సిటీ రోడ్లు, అపార్ట్‌మెంట్‌లు మరియు ఇరుకైన ప్రదేశాలలో కారును రివర్స్ చేసేటప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కారును పార్క్ చేసేటప్పుడు కూడా ఈ ఫీచర్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కారు వెనుక అమర్చిన సెన్సార్లు వెనుక ఉన్న ట్రాఫిక్ లేదా వస్తువులను గుర్తించి అలారం ద్వారా డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తాయి.

కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

7. రివర్స్ పార్కింగ్ కెమెరా

రివర్స్ పార్కింగ్ సెన్సార్ ల మాదిరిగానే, రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా చాలా ఉపయోగకరమైన సేఫ్టీ ఫీచర్. సెన్సార్లు వెనుక ఉన్న ట్రాఫిక్, వస్తువుల గురించి శబ్ధం ద్వారా మాత్రమే అలెర్ట్ చేస్తాయి. కానీ, రివర్స్ పార్కింగ్ కెమెరా వెనుక ఉన్న వస్తువులు, ట్రాఫిక్‌ను ఫ్రంట్ స్క్రీన్ పై కనిపించేలా చేస్తుంది. రివర్స్ గేర్ ను ఆన్ చేసిన వెంటనే, ఈ కెమెరా కూడా ఆన్ అవుతుంది. కారును సురక్షితంగా పార్క్ చేయడానికి మరియు వెనుకకు డ్రైవ్ చేసేటప్పుడు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.

కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

8. కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్

కార్నింగ్ స్టెబిలిటీ కంట్రోల్ (CSC) ఇదొక అధునాతన సేఫ్టీ ఫీచర్. కారును వేగంగా నడపుతున్నప్పుడు అకస్మాత్తుగా ఏదైనా మలుపు వచ్చినట్లయితే, డ్రైవర్ కారును అధిక వేగంతో మలుపు తిప్పేటప్పుడు కారుపై కంట్రోల్ ను అందించడంలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. రోడ్డు మలుపుల వద్ద కారు బోల్తా పడకుండా మరియు స్కిడ్ అవ్వకుండా చేస్తుంది. కారు అకస్మాత్తుగా బ్రేక్ చేసినప్పుడు, ఈ వ్యవస్థ కారు చక్రాల వేగాన్ని అర్థం చేసుకుంటుంది మరియు దానికి అనుగుణంగా బ్రేక్ ఫోర్స్‌ను పంపిణీ చేస్తుంది.

కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

9. రీఇన్‌ఫోర్స్డ్ బి-పిల్లర్

వాహనాలను ఎదురెదురుదా ఢీకొనడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. ప్రస్తుతం, మార్కెట్లో ఉన్న అనేక ఆధునిక కార్లు రీఇన్‌ఫోర్స్డ్ స్టీల్ తో తయారు చేసిన A మరియు B పిల్లర్స్ ను కలిగి ఉంటాయి. ఇవి ముందు వైపు నుండి కారు నిర్మాణానికి మరింత బలాన్ని చేకూర్చడంలో సహకరిస్తాయి. కారులో రీఇన్‌ఫోర్స్డ్ స్టీల్‌ను ఉపయోగించడం వల్ల కారు క్రాష్ టాలరెన్స్ (ప్రమాద సమయంలో కారుపై పడే వత్తిడిని తట్టుకునే శక్తి) కూడా పెరుగుతుంది.

కొత్త కారు కొంటున్నారా..? అయితే అందులో ఈ టాప్ 10 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి..!

10. ఐసోఫిక్స్ చైల్డ్ యాంకర్స్

ఇక చివరిగా, కారులో చాలా మంది విస్మరించే బేసిక్ సేఫ్టీ ఫీచర్లలో ఐసోఫిక్స్ చైల్డ్ యాంకర్స్ కూడా ఒకటి. మనదేశంలో చాలా మంది శిశువులతో ప్రయాణించేటప్పు కార్ సీట్లను ఉపయోగించరు. ఇదొక నిర్లక్ష్య ధోరణి. కారులో పసికందులతో ప్రయాణించేటప్పుడు వారికోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్ సీట్లను ఉపయోగించాలి. ఈ కార్ సీట్లను హుక్ చేసేందుకు కారులో ఐసోఫిక్స్ చైల్డ్ యాంకర్స్ ఉంటాయి. వీటికి కారును సరిగ్గా అమర్చడం వలన ప్రమాదాల్లో చిన్నారులకు జరిగే నష్టాన్ని నివారించవచ్చు.

కాబట్టి, మీరు ఇప్పుడు కొత్త ఏదైనా కారును కొనాలని ప్లాన్ చేస్తున్నట్లుయితే, ఆ కారులో ఇలాంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయో లేదో ఒకటి రెండుసార్లు చెక్ చేసుకోండి, సురక్షితంగా ప్రయాణించండి. హ్యాపీ జర్నీ..!!

Most Read Articles

English summary
Planning to buy new car here are the top 10 safety features to look for before buying
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X