కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా? రియల్ స్టోరీ!

By Ravi

బండి కాదు మొండి ఇది సాయం పట్టండి.. ఈ పాత పాట గుర్తుందా..? మన వాహనం సాధారణంగా స్టార్ట్ కాకపోతే, ఉన్నట్టుండి రోడ్డుపై ఆగిపోతేనో ఇదే పాట గుర్తుకు వస్తుంది. కారులోని బ్యాటరీ పనితీరు సరిగ్గా లేనప్పుడు ఇంజన్ స్టార్ట్ కాదు. అలాంటప్పుడు చాలా మంది కారును పుష్ స్టార్ట్ చేసేందుకుప్రయత్నిస్తుంటారు.

చాలా మందికి పుష్ స్టార్ట్ ఎలా చేయాలో తెలిసే ఉంటుంది. కానీ, కొత్త వారి కోసం పుష్ స్టార్ట్ ఎలా చేయాలి, పుష్ స్టార్ట్ చేసేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఈ రియల్ స్టోరీ రూపంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

తర్వాతి స్లైడ్‌లలో కారును పుష్ స్టార్ట్ ఎలా చేయాలో తెలుసుకోండి.

కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

అరున్ ప్రతిరోజు ఉదయాన్నే తన పాత మారుతి ఎస్టీమ్ కారులో ఆఫీసుకి వెల్తుంటాడు. అయితే, ఓ రోజు తన కొడుకు పుట్టిన రోజు వేడుకకు వెళ్లాలని త్వరగా ఆఫీసు నుంచి బయలుదేరాడు. కారులోకి ఎక్కి కూర్చొని, కీతో ఇంజన్‌ను స్టార్ట్ చేశాడు. కానీ ఇంజన్ స్టార్ట్ కాలేదు. కీని ఎన్నిసార్లు తిప్పిన కిర్రుమనే శబ్ధం తప్ప ఇంజన్‌లో ఎలాంటి కదలిక లేదు. దీంతో అతను దిగాలుగా కారులోనే కూర్చుండిపోయాడు.

కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

అరున్‌కి ఆఫీసులో నవీన్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. నవీన్‌కి కార్ల గురించి బాగా తెలుసు, ప్రత్యేకించి పాత కార్ల విషయంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి. అరున్ వెంటనే నవీన్‌కి ఫోన్ చేసి, సాయం చేయమని కోరాడు. కారు వద్దకు నవీన్, అరున్ పరిస్థిని గమనించి, ఏం దిగాలు పడకు, నీ కారును నేను స్టార్ట్ చేసిస్తానని భరోసా ఇచ్చాడు. కారును పుష్ స్టార్ట్ చేయటం పాత ట్రిక్కే అయినప్పటికీ, అనేక సందర్భాల్లో ఇది పనిచేస్తుంది.

కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

నవీన్ ముందుగా కారు బానెట్ ఓపెన్ చేసి, బ్యాటరీ టెర్మినల్స్‌ని పరిశీలించాడు. బ్యాటరీ చడటానికి బాగానే కనిపిస్తోంది. టెర్మినల్స్‌పై ఎలాంటి దుమ్ము, ధూళి లేదు. అలాగే టెర్మినల్స్ కూడా వదులుగా లేవు. (టెర్మినల్స్ వదులుగా ఉన్నా, వాటిపై మురికి పేరుకున్న విద్యత్ సరిగ్గా సరఫరా కాదు).

కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

బ్యాటరీని పరిశీలించిన తర్వాత నవీక్ కారులో కూర్చొని కీని 'ఆన్' మోడ్‌లో ఉంచాడు.

కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

ఆ తర్వాత హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాడు. నవీన్ ఈ విషయాలన్నింటినీ అరున్‌కి వివరిస్తున్నాడు.

కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

ఇప్పుడు క్లచ్‌ను పూర్తిగా నొక్కి పట్టాలి, అలా చేసినట్లయితే కారు సులువుగా ముందుకు వెళ్లడం కుదురుతుందని నవీన్ చెప్పాడు.

కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

పుష్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు సెకండ్ గేర్‌ను మాత్రమే ఉపయోగించాలని, ఫస్ట్ గేర్‌లో స్టార్ట్ చేయటానికి ప్రయత్నిస్తే క్లచ్‌పై ఎక్కువ భారం పడుతుందని, సెకండ్ గేర్‌లో స్టార్ట్ చేయటం వలన పెద్ద జర్క్ వచ్చినప్పటికీ, స్టార్టింగ్ స్మూత్‌గా ఉంటుందని నవీన్ వివరించాడు.

కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

కారును పుష్ స్టార్ట్ చేసేందుకు కనీసం ముగ్గురు వ్యక్తులు కావల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు అదే సమయంలో అరున్ కోలీగ్స్ ప్రతాప్, సతీష్‌లు అదే రూట్‌లో వెళ్తున్నారు. వారు తమ బైక్‌ను పక్కన పార్క్ చేసి సాయం చేయటానికి వచ్చారు. కారుని వెనుక నుంచి నెట్టాల్సిందిగా నవీన్ కోరాడు.

కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

కారుని పుష్ స్టార్ట్ చేస్తున్నప్పుడు క్లచ్‌ని ఒక్కసారిగా వదలటం వలన భారీ జర్క్ వస్తుంది ఆ సమయంలో కారు నిలిచిపోయే ఆస్కారం ఉంటుంది. అలాంటప్పుడు వెనుక నుంచి కారును నెట్టే వ్యక్తులు కారుకు బలంగా గుద్దుకునే ప్రమాదం ఉంటుంది. ఇదే విషయాన్ని నవీన్ వారికి వివరించాడు.

కారును పుష్ స్టార్ట్ చేయటం ఎలా?

మొత్తానికి ప్రతాప్, సతీష్, నవీన్ సాయం వలన అరున్ కారు ఇంజన్ స్టార్ట్ అయ్యింది. ఇంకేముంది.. అతను సంతోషంతో చిందులు వేసుకుంటూ, కొడుకు బర్త్‌డే పార్టీకి వెళ్లిపోయాడు.

Most Read Articles

English summary
You crank the ignition but all is dead. Angry honking from behind begins and it's a situation none of us look forward to, that's for certain.
Story first published: Friday, December 12, 2014, 10:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X