అలర్ట్: బ్రేక్ ప్యాడ్స్ ఖచ్చితంగా మార్చాలని తెలిపే రీజన్స్

డిస్క్ బ్రేకులు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. ఇందుకు కారణం బ్రేక్ ప్యాడ్స్‌ను మార్చకపోవడం. అయితే, డిస్క్ ప్యాడ్స్ ఖచ్చితంగా మార్చాలి అని తెలిపే ఐదు లక్షణాల గురించి ఇవాళ్టి కథనంలో

By N Kumar

వెహికల్‌లో బ్రేక్ అతి ముఖ్యమైన అంశం, నిజమే, ప్రాణాలను కాపాడటంలో బ్రేకులు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వెహికల్‌ బ్రేకింగ్ సిస్టమ్‌లో ఒక చిన్న లోపం ఉన్నా నడపకపోవడం ఎంతో మంచిది.

బ్రేక్ ప్యాడ్స్

ఆటోమొబైల్స్ ప్రాణం పోసుకున్న తొలినాళ్లలో డ్రమ్ బ్రేకులు ఉండేవి. ఇప్పటికీ చాలా వరకు పోర్ వీలర్స్ మరియు టూ వీలర్లలో డ్రమ్ బ్రేకులు ఉన్నాయి. అయితే, కాలం మారే కొద్దీ బ్రేకింగ్ వ్యవస్థలో ఎన్నో మార్పులు జరిగాయి. అందులో ఒకటి డిస్క్ బ్రేకులు. అత్యుత్తమ బ్రేకింగ్ కార్యకలాపాల కోసం ఎంతో చక్కగా పనిచేస్తాయి.

బ్రేక్ ప్యాడ్స్

డిస్క్ బ్రేకుల్లో ఉన్న డిస్క్‌ చక్రానికి అటాచ్ చేయబడి ఉంటుంది. బ్రేకులు అప్లే చేస్తే డిస్క్ తిరగడాన్ని ఆపుతుంది, దీంతో వెహికల్ మొత్తం వేగం అదుపులోకి వస్తుంది. అయితే, డిస్క్‌ తిరగడాన్ని నియంత్రించేందుకు బ్రేక్ ప్యాడ్ డిస్క్ మీద ఘర్షణను సృష్టిస్తుంది. కాబట్టి డిస్క్ తిరగడాన్ని నియంత్రించవచ్చు.

బ్రేక్ ప్యాడ్స్

డిస్క్ బ్రేకులు కూడా కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంటాయి. ఇందుకు కారణం బ్రేక్ ప్యాడ్స్‌ను మార్చకపోవడం. అయితే, డిస్క్ ప్యాడ్స్ ఖచ్చితంగా మార్చాలి అని తెలిపే ఐదు లక్షణాల గురించి ఇవాళ్టి కథనంలో తెలుసుకుందాం రండి...

Recommended Video

Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
బ్రేక్ ప్యాడ్స్

5. బ్రేక్ ప్యాడ్స్‌ను గమనించడం:

బైకుల్లోని ఫ్రంట్ లేదా రియర్ వీల్‌కు ఉన్న డిస్క్ బ్రేకును గమనిస్తే, బ్రేక్ ప్యాడ్ మందం ఎంతుందో చూసి చెప్పేయవచ్చు. బ్రేక్ ప్యాడ్ మందం 2ఎమ్ఎమ్ ఉందంటే దాని లైఫ్ అయిపోయిందని భావించండి.

బ్రేక్ ప్యాడ్స్

4. బ్రేకుల నుండి శబ్దం రావడం:

బ్రేక్ ప్యాడ్స్ ఎక్కువగా అరిగిపోయి ఉంటే, బ్రేకులు అప్లే చేసిన ప్రతిసారి బ్రేకుల నుండి శబ్దం వస్తుంది. బ్రేక్ ప్యాడ్స్ మీద మెటల్ పార్ట్స్‌తో రాపిడి జరిగినపుడు అరిగిపోతాయి. ఇలా జరిగిందంటే ఖచ్చితంగా బ్రేక్ ప్యాడ్స్ మార్చుకోవాల్సిందే.

బ్రేక్ ప్యాడ్స్

3. బ్రేకింగ్ ఫోర్స్:

బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోవడంతో బ్రేక్ ఫోర్స్ నెమ్మదిగా తగ్గిపోతుంటుంది. ప్రతి రోజు డ్రైవింగ్ చేసే వారు దీన్ని సులభంగా గుర్తించవచ్చు. బ్రేక్ ప్యాడ్స్ బాగున్నప్పుడు బ్రేకులను కొద్దిగా అప్లే చేసినా చాలు వెహికల్ వేగం మీద దాని ప్రభావం కనబడుతుంది. అయితే, బ్రేకులు అరుగుదలతో బ్రేకింగ్ ఫోర్స్ చక్రాలను చేరడానికి గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

Trending On DriveSpark Telugu:

బస్సు లారీ మధ్య నలిగిపోయిన ఆ కారులో అందరూ సేఫ్: ఇంతకీ అది ఏ కారో తెలుసా...?

రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్ల భరతం పడుతున్న పోలీసులు: ఈ తప్పు చేస్తే మీ బైకుకూ ఇదే గతి...!!

బ్రేక్ ప్యాడ్స్

4. డ్యాష్ బోర్డ్ వార్నింగ్ లైట్లు:

ఈ మధ్య కాలంలో ఖరీదైన కార్లు మరియు బైకుల్లోని డ్యాష్ బోర్డులో బ్రేకింగ్ ప్యాడ్స్ గురించిన సమాచారం పొందవచ్చు. బ్రేక్ సిస్టమ్ వద్ద అమర్చిన ప్రత్యేక సెన్సార్లు బ్రేక్ ప్యాడ్స్ అరుగుదలను గుర్తించి డ్రైవర్‌కు డ్యాష్ బోర్డ్ ద్వారా సమాచారాన్ని అందిస్తుంది.

బ్రేక్ ప్యాడ్స్

5. బ్రేక్ పెడల్

బ్రేక్ పెడల్ ప్రెస్ చేసినపుడు పెడల్ వైబ్రేట్ అయ్యిందంటే బ్రేక్ ప్యాడ్స్ అరుగుదలకు గురయ్యాయని గుర్తించండి. బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోవడంతో బ్రేక్ పెడల్ నుండి వచ్చే ఫోర్స్ కారణంగా పెడల్స్‌ను వైబ్రేట్ చేస్తుంది. ఇలాంటప్పుడు బ్రేక్ ప్యాడ్స్ మార్చి తరువాత బ్రేకులు అప్లే చేసి చూడండి తేడా మీకే తెలుస్తుంది.

బ్రేక్ ప్యాడ్స్

మీరు వెహికల్ డ్రైవ్ చేస్తున్నపుడు ఈ ఐదు అంశాలలో దేనినైనా గమనించినట్లయితే, సంభందిత డీలర్ లేదా మీకు సమీపంలోని సర్వీసింగ్ సెంటర్లలో బ్రేక్ పెడల్స్ చెక్ చేయించి, అవసరమైతే వాటిని మార్పించండి.

Most Read Articles

English summary
Read In Telugu: Top 5 Reasons To Change Brake Pads On Time
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X