నెట్‌వర్క్ సంస్థలకు షాకిచ్చిన జియో - ఇకమీదట ఆటో మొబైల్స్‌లో కూడా

Written By:

ఇప్పటి వరకు టెలికాం రంగంలో ఇతర నెట్‌వర్క్ సంస్థలకు చుక్కలు చూపించిన జియో ఇప్పుడు ఆటోమొబైల్ రంగం మీద దృష్టి సాధించింది. ఇంటర్నెట్ వినియోగం ఉన్న అన్ని విభాగాల్లో తన పాదుకలు వేసేందుకు పావులు కదుపుతోంది. అందుకోసం అమెరికాకు చెందిన ఎయిర్‌వైర్ టెక్నాలజీస్ సంస్థతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ అధికారికంగా జట్టుకట్టింది. ఇప్పుడు జియో ఆటోమొబైల్ సంస్థలో ఏం చేయనుందో తెలుసుకుందామా...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కార్లలో ఇంటర్నెట్ కోసం జియో నుండి కొత్త డివైజ్

ఇరు సంస్థలు భాగస్వామ్యంతో ఎయిర్‌వైర్ సంస్థ కనెక్ట్ కార్ ఐఒటి పరికరాలను అభివృద్ది చేయనుంది. పేటెంట్ పొందిన యాంటెన్నా టెక్నాలజీని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది.

కార్లలో ఇంటర్నెట్ కోసం జియో నుండి కొత్త డివైజ్

ఎయిర్‌వైర్ సంస్థ కార్ల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న కనెక్టెడ్ కార్ డివైజ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అడ్వాన్స్‌డ్ 4జీ/ఎల్‌టిఇ నెట్వర్క్‌తో అనుసంధానం కావచ్చు. వివిధ రకాల అప్లికేషన్లు మరియు ఆటోమొబైల్ టెలీమ్యాటిక్స్, సెక్యురిటీ మరియు సెప్టీ వంటి సేవలను ఈ పరికరం ద్వారా పొందవచ్చు.

కార్లలో ఇంటర్నెట్ కోసం జియో నుండి కొత్త డివైజ్

భారత దేశపు దిగ్గజ టెలికాం దిగ్గజంతో కలిసి కనెక్టెడ్ కార్ డివైజ్ లను ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం, ఇండియాలో తయారీ ప్రారంభించడం పట్ల ఎయిర్‌వైర్ సంస్థ హర్షం వ్యక్తం చేసింది.

కార్లలో ఇంటర్నెట్ కోసం జియో నుండి కొత్త డివైజ్

ప్రతి వాహనంలో కూడా ఆన్ బోర్డ్ డయాగ్నస్టిక్(OBD) అనే పరికరం ఉంటుంది. ఇది వాహనం యొక్క పనితీరు పరిశీలిస్తూ, ఎప్పకప్పుడు స్వీయపరిశీలన చేసుకుంటూ, కావాల్సిన డేటాను నివేదికల రూపంలో మనకు పంపిస్తుంది. ఈ ఒబిడి లోని రెండవ పోర్ట్‌కు ఎయిర్‌వైర్ సంస్థ యొక్క కనెక్టెడ్ కార్ డివైజ్‌ను అనుసంధానం చేయవచ్చు.

కార్లలో ఇంటర్నెట్ కోసం జియో నుండి కొత్త డివైజ్

తద్వారా రిలయన్స్ జియో యొక్క 4జీ/ఎల్‌టిఇ నిరంతర సిగ్నల్స్ ద్వారా ఎల్లప్పుడు ఒబిడితో అనుసంధానమై ఉంటుంది. తద్వారా వాహనానికి సంభందించిన అతి ముక్యమైన సమాచారం ఎప్పుడూ రికార్డు అవుతూ, అనలైజ్ చేసుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా వివిధ అప్లికేషన్లను ఉపయోగిస్తూ స్మార్ట్ ఫోన్‌కు అనుసంధానం చేయవచ్చు.

కార్లలో ఇంటర్నెట్ కోసం జియో నుండి కొత్త డివైజ్

ఎయిర్‌వైర్ టెక్నాలజీస్ ప్రెసిడెంట్ మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారి దెబాషిస్ బాగ్చి మాట్లాడుతూ, జియో టెలికాం దిగ్గజ భాగస్వామ్యంతో ఇండియాలోనే కనెక్టెడ్ కార్ డివైజ్‌ల తయారీని ప్రారంభిస్తామని తెలిపాడు.

కార్లలో ఇంటర్నెట్ కోసం జియో నుండి కొత్త డివైజ్

కనెక్టెడ్ కార్ పరికరాల తయారీ మరియు పూర్తి స్థాయిలో అందివ్వడానకి కమిట్‌మెంటుతో, ధీర్ఘ దృష్టిని సారిస్తూ ప్రపంచ వ్యాప్కంగానే భారత దేశం మొదటి సారిగా ఈ పరిజ్ఞానాన్ని వినియోగించే విధంగా జియో పనిచేస్తోంది. భవిష్యత్తులో వీటి విలువను పెంచేందుకు బిగ్ డేటా అనలిటిక్స్ ద్వారా కస్టమర్ల అనుభవాలను తెలుసుకోనుంది.

కార్లలో ఇంటర్నెట్ కోసం జియో నుండి కొత్త డివైజ్

జియో సిగ్నల్స్ గల కనెక్టెడ్ కార్ డివైజ్‌ల ద్వారా కస్టమర్లు అత్యుత్తమ, విభిన్నమైన అనుభవాన్నిపొందడానికి ఎయిర్‌వైర్ సంస్థతో జియో మరింత క్లోజ్‌గాపనిచేయనుంది.

కార్లలో ఇంటర్నెట్ కోసం జియో నుండి కొత్త డివైజ్

వాహనాలను కలిగి ఉండటం, డ్రైవ్ చేయడం, నిర్వహణ మరియు సెక్యూర్ వంటి వాటిని మరింత సరళతరం చేయడానికి జియో, ఎయిర్‌వైర్ సంస్థ భాగస్వామ్యంతో జియో కార్ కనెక్ట్ టెక్నాలజీ తీసుకువస్తున్నామని రిలయన్స్ జియో అధికారికంగా ఓ ప్రకటనలో తెలిపింది.

కార్లలో ఇంటర్నెట్ కోసం జియో నుండి కొత్త డివైజ్

ఇండియన్ పోలీసులకు ముఖేష్ అంబానీ BMW ఎక్స్5

హోండా ఆక్టివా 4జీ విడుదల: ధర, ఇంజన్, ప్రత్యేకతల కోసం....

 
English summary
Reliance Jio Inks Deal With AirWire For Connected Car Device
Story first published: Thursday, March 2, 2017, 17:05 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark