మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌‌లో డ్రైవ్ చేస్తున్నపుడు ఇవి చేయకండి

Written By:

కార్ల వినియోగం పెరిగినప్పటి నుండి మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ బాగుంటుందా లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ బాగుంటుందా అనే వాదనలు అక్కడక్కడ జరుగుతూనే ఉంటాయి. అయితే డ్రైవింగ్‌లో మంచి అనుభూతిని పొందడానికి ఎక్కువ మంది మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌నే ఎంచుకుంటారు.

అయితే మీరు కూడా మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ గల గేర్‌బాక్స్‌ను కోరుకుంటున్నారా ? మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో డ్రైవింగ్‌ చేస్తున్నపుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడని ఐదు అంశాలు నేడు మన ఈ కార్ టాక్ శీర్షిక ద్వారా తెలుసుకుందాం రండి.

1. మీ చేతులను ఎప్పుడూ స్టీరింగ్ వీల్ మీదే ఉంచాలి

చాలా మంది డ్రైవర్లు కుడి చేతిని స్టీరింగ్ వీల్ మీద మరియు ఎడమ చేతిని గేర్‌రాడ్ మీద ఉంచి డ్రైవ్ చేస్తుంటారు. గేర్‌ రాడ్ మీద అనుకోకుండా మనం వేసే చేతులు దాని మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. మనం చూపే ఎక్కువ ఒత్తిడి గేర్‌బాక్స్‌ను డ్యామేజ్ చేస్తుంది మరియు స్టీరింగ్‌ వీల్‌ మీద గడియారంలో 9 మరియు 3 గంటలు ఉన్న పొజిషన్లలో చేతులను ఉంచాలి.

2. తరచూ క్లచ్‌ను నొక్కి ఉంచకండి

చాలా మంది డ్రైవర్లు మ్యాన్యువల్ డ్రైవింగ్‌లో ఎడమ కాలును ఎల్లప్పుడూ క్లచ్ మీద ఉంచుతారు. అనవసరంగా క్లచ్‌ను తొక్కి ఉంచడం వలన క్లచ్‌ను తరచూ మార్చాల్సి వస్తుంది. అంతే కాకుండా ఎప్పుడు క్లచ్‌ను తొక్కి ఉంచే వారు బ్రేక్ పెడల్‌ను ప్రెస్ చేయాల్సిన సమయంలో క్లచ్ ప్రెస్ చేస్తుంటారు. ఇలాంటి సంఘనటలు ప్రమాదానికి కారణం అవుతుంటాయి.

3. హ్యాండ్‌బ్రేక్‌ను గుర్తు చేసుకోండి

వాలు తలం ఉన్నపుడు చాలా వాహనాల్లో హ్యాండ్ బ్రేక్ పైకి ఉంటుంది. ఇది చాలా మంచి అలవాటు, అయితే చాలా మంది హ్యాండ్‌ బ్రేక్‌కు బదులుగా వాహనాన్ని గేర్‌లో ఉంచుతుంటారు. ఇది చాలా తప్పు. పొరబాటున ఎవరైనా గేర్‌రాడ్‌ను కదిలిస్తే అంతే సంగతులు. కాబట్టి వాహనాన్ని ఆపినపుడు హ్యాండ్‌బ్రేక్‌ను తప్పకుండా వినియోగించండి.

4. మూవింగ్‌లో ఉన్నపుడు గేర్‌లోనే ఉంచండి

పల్లపు రహదారులు మరియు వాలు తలాలు వచ్చినపుడు చాలా మంది వాహనాన్ని న్యూట్రల్ చేస్తుంటారు. ఇది చాలా తప్పు ఎందుకంటే వానహాన్ని న్యూట్రల్ చేసినపుడు గరిష్ట వేగంలో ఉన్నపుడు అదుపు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు న్యూట్రల్ చేసిన ప్రతి సారీ బ్రేకులను ఎక్కువగా ఉపయోగిస్తారు తద్వారా బ్రేక్ లైనర్లు త్వరగా అరిగిపోయి బ్రేకులు ఫెయిల్ అయ్యే అకాశం ఉంటుంది. కాబట్టి పల్లుపు రహదారుల్లో వాహనాన్ని న్యూట్రల్‌ మోడ్‌లో నడపకండి.

5. ఆర్‌పిఎమ్‌ను గమనిస్తున్నారా ?

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల కారును డ్రైవ్‌ చేస్తున్నపుడు వాహనం ఉత్పత్తి చేసే పవర్ మీద పూర్తి కంట్రోల్‌ను డ్రైవర్ కలిగి ఉంటాడు. కాబట్టి రహదారి మరియు వేగాన్ని బట్టి ఇంజన్‌ యొక్క ఆర్‌పిఎమ్ మరియు వాహనం యొక్క వేగాన్ని బేరీజు వేసుకుని నడిపే అకాశం ఉంటుంది. ఇలా చేయడం వలన ఇంజన్ ఓవర్ హీట్ కాకుండా ఉంటుంది. కాబట్టి టాకో మీటర్ మరియు ఆర్‌పిఎమ్ మీటర్ మీద దృష్టి సారించి నడిపితే ఎంతో మంచిది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఈ అవకాశం ఉండదు.

మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో ఇలాంటి తప్పులు చేయకుండా డ్రైవింగ్ చేస్తే వాహనం మంచి కండీషన్‌లో ఉంటుంది మరియు వాహనం యొక్క జీవిత కాలం కూడా పెరుగుతుంది. మేము అందించి ఈ చిట్కాలు ఉపయోగపడతాయని భావిస్తున్నాము. వీటి మీద మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. అందుకోసం కథనం క్రింది భాగంలో గల కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయాన్ని వ్రాయండి.

 

English summary
Driving A Manual? Here Are Five Things You Should Never Do
Story first published: Friday, August 26, 2016, 8:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos