కారులో మంటలు చెలరేగటానికి టాప్ 10 కారణాలు

Written By:

వేసవి వచ్చేసింది.. అప్పుడే ఎండలు భగభగా మండిపోతున్నాయి. ఈ వేసవిలో కార్లను ఉపయోగించే వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్నిసార్లు ఎండలో కారును ఎక్కువ దూరం నడపటం, లేదా ఎక్కువ సమయంలో ఎండలో పార్క్ చేసి ఉంచడం వలన కూడా కార్లు తగలబడిపోయే ప్రమాదం ఉంటుంది.

వేసవి కాలంలో కార్లలో హఠాత్తుగా మంటలు చెలరేగటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ నాటి మన కార్ టాక్ కథనంలో కార్లలో మంటలు చెలరేగటానికి గల టాప్ 10 కారణాలు ఏంటో పరిశీలిద్దాం రండి..!

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

To Follow DriveSpark On Facebook, Click The Like Button
10. డిజైన్ లోపం

10. డిజైన్ లోపం

కొన్ని సందర్భాల్లో కారు తయారీలో డిజైన్ లోపం కారణంగా కూడా కారులో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కార్ కంపెనీ వెంటనే రీకాల్ ప్రకటించి సదరు లోపాన్ని సరిచేస్తే భారీ నష్టం సంభవించకుండా అరికట్టవచ్చు.

9. సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం

9. సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం

కారును సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోయినా కూడా కొన్నిసార్లు కారులో మంటలు చెలరేగవచ్చు. కాబట్టి వాహనాలను ఎప్పటికప్పుడు షెడ్యూల్ ప్రకారం సర్వీస్ చేసుకుంటూ, చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి వాహనానికి కూడా నిర్దిష్ట సర్వీస్ ఇంటర్వెల్స్ ఉంటాయి.

8. యాక్సిడెంట్స్

8. యాక్సిడెంట్స్

సీరియస్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కారులోని ఇంధనం లీక్ అవ్వటం, రెండు వాహనాలకు మధ్య రాపిడి వలన అగ్ని పుట్టి మంటలు చెలరేగటం జరుగుతుంది. కాబట్టి, ఎల్లప్పుడూ అప్రమత్తంగా డ్రైవ్ చేసి, ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

7. ఆఫ్టర్‌మార్కెట్ యాక్ససరీస్

7. ఆఫ్టర్‌మార్కెట్ యాక్ససరీస్

చాలా మంది కస్టమర్లు తమ కార్లలో ఆఫ్టర్‌మార్కెట్ యాక్ససరీలను అమర్చుకుంటూ ఉంటారు. నైపుణ్యం లేని లేదా నాసిరకం ఎలక్ట్రిల్ యాక్ససరీలను అమర్చుకోవటం లేదా కారులోని ఎలక్ట్రికల వైరింగ్ సిస్టమ్‌ను ట్యాంపర్ చేయటం వలన కూడా కారులో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.

6. క్యాటలిక్ కన్వర్టర్స్ ఓవర్‌హీటింగ్

6. క్యాటలిక్ కన్వర్టర్స్ ఓవర్‌హీటింగ్

వాహన ఎగ్జాస్ట్ సిస్టమ్ (సైలెన్సర్ విభాగం) మరియు క్యాటలిక్ కన్వర్టర్స్ అధిక మొత్తంలో వేడిని పుట్టిస్తాయి. దీని వలన ఈ భాగాలకు సమీపంలో ఉండే ప్లాస్టిక్ మెటీరియర్స్ కరిగి పోవటం ఫలితంగా అగ్ని పుట్టడం వంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి, దూర ప్రయాణాలు చేసేటప్పుడు కారును అప్పుడప్పుడూ రోడ్డు పక్కగా నిలుపుతూ అవి కూల్ అయ్యే వరకూ వేచి ఉండాలి.

5. ఇంజన్ ఓవర్‌హీట్

5. ఇంజన్ ఓవర్‌హీట్

ఒక్కోసారి ఇంజన్ అధికంగా వేడెక్కడం (ఓవర్‌హీట్ అవటం) వలన కూడా కారులో మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. ఇంజన్ ఓవర్‌హీట్ అయితే వేడిగా మరుగుతూ ఉండే ద్రవాలు కారులోని ఇంజన్ భాగంలోని ఇతర భాగాలతో కలిసి అగ్ని పుట్టించవచ్చు. కారు ఇంజన్ హీట్ విషయంలో అప్రమత్తంగా లేకపోతే, భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి దూరప్రయాణాల్లో తరచూ బ్రేక్స్ తీసుకుంటూ, ఇంజన్ చల్లగా అయ్యే వరకూ వేచి ఉండాలి.

4. ఫ్లూయిడ్ లీక్స్

4. ఫ్లూయిడ్ లీక్స్

కారులోని పెట్రోల్/డీజిల్ వంటి ఇంధనంతో పాటుగా కొన్ని రకాల ఇంధనాలు కూడా మండే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, కారులో ఏవైనా ఇంధనాలు లీక్ అవుతున్నట్లు అనిపిస్తే, వెంటనే చెక్ చేసుకొని సదరు సమస్యను సరిచేసుకోవాలి.

3. ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్

3. ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్

కారులో మంటలు చెలరేగటానికి సహజమైన కారణాల్లో ఇది కూడా ఒకటి. కారులోని ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా లేదా సదరు వైరింగ్ సిస్టమ్‌ను ట్యాంపర్ చేసినా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కారులో ఎప్పుడైనా వైరు కాలుతున్న వాసన వస్తే వెంటనే ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్‌ను చెక్ చేసుకోవాలి.

2. ఇంధనం లీక్

2. ఇంధనం లీక్

కారులో ఉపయోగించే పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి వంటి ఇంధనాలు అతి త్వరగా మంటలను వ్యాపించగలవు. కాబట్టి, కారులో నుంచి ఈ ఇంధనాలు లీక్ అవుతున్నట్లు అనిపించినా లేదా వీటికి సంబంధించి ఎలాంటి వాసన వచ్చినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమస్యను పరిష్కరించుకోవాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

1. ధూమపానం చేయటం

1. ధూమపానం చేయటం

ధూమపాన ఆరోగ్యానికి హానికరం. అదే కారులో సేవిస్తే మీ ఆరోగ్యానికే కాకుండా మీ కారు ఆరోగ్యానికి కూడా ప్రమాదకరం. కారులో సిగరెట్ తాగుతూ ప్రమాదవశాత్తు అది క్రింద పడినట్లయితే, కారులో మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కారును నడుపుతున్నప్పుడు కానీ లేదా కారులో కూర్చున్నప్పుడు కానీ ధూమపానం చేయకండి.

కారులో మంటలు చెలరేగటానికి టాప్ 10 కారణాలు

కారులో మంటలు చెలరేగటానికి ఇవి కొన్ని కారణాలు మాత్రమే. ఇవి కాకుండా మీకు తెలిసిన కారణాలు ఏవైనా ఉంటే మా పాఠకులతో పంచుకోగలరు.

English summary
Fire is something that can cause serious damage. Be it a house or an automobile. Sometimes, vehicles can be lit up, but by the time one can realise it, it often is too late. In our Top 10 list today, we take a look at 10 reasons that can cause your beloved vehicle to go up in flames.
Story first published: Monday, March 16, 2015, 14:40 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark