మీ కారులో తప్పనిసరిగా ఉండాల్సి 20 ముఖ్యమైన వస్తువులు

By Ravi

ఇల్లు అలకగానే పండుగ కాదు.. అలాగే కారు కొనగానే సరిపోదు.. దానిని సమర్థవంతంగా నిర్వహించే విధానం కూడా తెలుసుండాలి. రోడ్డుపై మీరు సురక్షితంగా ప్రయాణించాలన్నా, మీతోటి వారిని సురక్షితంగా ఉంచాలన్నా, మీ కారును కండిషన్‌లో ఉంచుకోవాలాన్ని కొన్ని డ్రైవింగ్ చిట్కాలు, మెళకువలు తెలుసుకొని ఉండాలి.

కారులో చిన్న చిన్న సమస్యలను గుర్తించగలగాలి, కొంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉండాలి. ఇవేమీ లేకుండా కారును కొనుగోలు చేస్తే ఆ తర్వా ఎదురయ్యే సమస్యలకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది. టైరు పంక్చర్ అయినప్పుడు మెకానిక్ సాయం లేకుండానే టైరును మార్చుకునే సామర్థ్యం, స్పార్క్ ప్లగ్ క్లీన్ చేసుకోవటం వంటి చిన్న చిన్న విషయాలు తెలిసుండాలి.

ప్రత్యేకించి కారులో ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని అత్యవసరమైన, ముఖ్యమైన వస్తువులు ఎల్లప్పుడూ మీ కారులో ఉండాలి. సదరు వస్తువులు ఉంటే, మీ ప్రయాణం ఏ సమయంలో అయినా సరే సాఫీగా సాగిపోతుంది. మరి ఆ వస్తువులేంటే, వాటి వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

డ్రైవింగ్ డాక్యుమెంట్స్ (Drving Documents)

డ్రైవింగ్ డాక్యుమెంట్స్ (Drving Documents)

కారు డ్రైవింగ్ ప్రారంభించడానికి ముందుగా, అందుకు కావల్సిన అన్ని డాక్యుమెంట్లు కారులో ఉన్నయో లేదోనని చెక్ చేసుకోవాలి. లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ మొదలైన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదోనని చూసుకోవాలి. ఏవైనా రెన్యువల్ చేయించాల్సి ఉంటే, వాటిని ఎప్పటికప్పుడు తనిఖీచేసుకొని గడువు తేదీ లోపుగా రెన్యువల్ చేసుకోవాలి.

డక్ట్ టేప్ (Duct Tape)

డక్ట్ టేప్ (Duct Tape)

ఈ డక్ట్ టేప్ ప్రయాణంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఈ డక్ట్ టేప్‌తో విరిగిపోయిన వస్తువులను తాత్కాలింగా అతికించుకోవచ్చు. ఉదాహరణకు మీ సైడ్ మిర్రర్ విరిగిపోయినట్లయితే, దానిని రిపేర్ చేయించే వరకు తాత్కాలింగా ఈ డక్ట్ టేపుతో అంటించవచ్చు. అలాగే సీట్ కవర్లు చిరిగిపోయినా ఈ టేపుతో కవర్ చేయవచ్చు.

అగ్నిమాపక పరికరం (Fire Extinguisher)

అగ్నిమాపక పరికరం (Fire Extinguisher)

కారులో అగ్నిమాకప పరికరం ఉంచుకోవటం తప్పనిసరి. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం కాబట్టి, ఈ పరికరాన్ని ఎల్లప్పుడు కారులో ఉంచుకోవాలి. అంతేకాకుండా, దీని గడువును తేదీని రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ, అవసరమైనప్పుడల్లా రీప్లేస్/రీఫిల్ చేసుకుంటూ ఉండాలి.

ల్యూబ్రికెంట్ ఆయిల్ (Lubricant Oil)

ల్యూబ్రికెంట్ ఆయిల్ (Lubricant Oil)

కారులో ఉండాల్సిన అతి ముఖ్యమైన వస్తువుల్లో ల్యూబ్రికెంట్ ఆయిల్ కూడా ఒకటి. తుప్పు పట్టిన బోల్టులను ఊడదీయాలన్నా లేక డోర్ లాక్స్ టైట్ అయిపోనా ఘర్షన (ఫ్రిక్షన్ తగ్గించేందుకు) ల్యూబ్రికెంట్ ఆయిల్ చక్కగా ఉపయోగపడుతుంది.

దుప్పట్లు (Blankets)

దుప్పట్లు (Blankets)

మీ కారులో వెచ్చగా, సౌకర్యంగా ఉండేందుకు దుప్పట్లను ఉంచుకోవటం ఉత్తమం. ప్రత్యేకించి మీరు శీతల ప్రదేశాల్లో ఉన్నట్లయితే, ఇవి చక్కగా ఉపయోగపడుతాయి.

ఓనర్స్ మ్యాన్యువల్ (Owner's Manual)

ఓనర్స్ మ్యాన్యువల్ (Owner's Manual)

వాహనాన్ని విక్రయించేటప్పుడు ప్రతి వాహనంతో పాటుగా సదరు వాహనం పనితీరుకు సంబంధి అలాగే, వివిధ భాగాలను వివరించే ఓనర్స్ మ్యన్యువల్ కూడా ఇస్తారు. ఈ ఓనర్స్ మ్యాన్యువల్‌ను ఎల్లప్పుడూ కారులోనే ఉంచుకోవాలి. అందులో పేర్కొన్న విధంగానే కారులో మార్పులు చేర్పులు చేసుకోవాలి.

లగ్ రించ్ (Lug Wrench)

లగ్ రించ్ (Lug Wrench)

కారులో ప్రయాణిస్తుండగా మార్గ మధ్యంలో టైర్ పంక్చర్ అయ్యి, మీ కారులో స్పేర్ వీల్ ఉన్నప్పటికీ లగ్ రించ్ లేకపోయినట్లయితే, సదరు టైరును మార్చటం అంత సులువేమీ కాదు. లగ్స్ (చక్రం బోల్టుల)ను ఊడదీయటానికి ఈ రించ్ చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి, మీ టూల్ కిట్‌లో లగ్ రించ్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

ఆహారం (Food)

ఆహారం (Food)

మీరు కారులో ప్రయాణిస్తున్నప్పుడు, ప్రత్యేకించి పిల్లలతో కానీ లేదా లాంగ్ ట్రిప్‌లకు కానీ వెళ్లేటప్పుడు కారులో తగినంత ఆహారం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా, త్వరగా చెడిపోయే ఆహారం కాకుండా, బలవర్థకంగా ఉండే పోషకారాన్ని కారులో ఉంచుకోవాలి.

త్రాగు నీరు (Drinking Water)

త్రాగు నీరు (Drinking Water)

కారులో కేవలం ఆహరం మాత్రం ఉంచుకుంటే సరిపోదు. ఆహారం తీసుకున్న తర్వాత లేదా దాహం వేసినప్పుడు త్రాగటానికి సరిపడా నీరు కూడా ఉండాలి. అయితే, నీటిని స్టోర్ చేసుకునేందుకు నాసిరకం ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించటం కన్నా స్టెయిన్ లెస్ స్టీల్ ఫ్లాస్క్‌‌లను ఉపయోగించడం మంచిది మరియు సురక్షితమైనది.

స్పేర్ కీ (Spare Key)

స్పేర్ కీ (Spare Key)

తాళం చెవులను కారు లోపలే పెట్టేసి లాక్ చేసినా, లేదా ఎక్కడైనా పొగట్టునా ఆ తర్వాత పడే ఇబ్బందులు భగవంతుడికే తెలుసు. కాబట్టి, ఎల్లప్పుడూ ఓ స్పేర్ కీని మీ పాకెట్లోనే, పర్స్‌లోను ఉంచుకోవటం ఉత్తమం.

జంపర్ కేబుల్స్ (Jumper Cables)

జంపర్ కేబుల్స్ (Jumper Cables)

మీ కారులో బ్యాటరీ వీకా.. ఆగిన చోట నుండి కదలడానికి మొండికేస్తుందా..? అయితే, మీ కారులో తప్పనిసరిగా జంపర్ కేబుల్స్ ఉండాల్సిందే. ఈ కేబుల్స్ సాయంతో, అవతలి వాహనం బ్యాటరీ ద్వారా మీ కారును బ్యాటరీని చార్జ్ చేయటం లేదా ఇంజన్‌ను స్టార్ట్ చేయటం చేసుకోవచ్చు.

టైర్ ప్రెజర్ గేజ్ (Tire Pressure Gauge)

టైర్ ప్రెజర్ గేజ్ (Tire Pressure Gauge)

సౌకర్యవంతమైన ప్రయాణం కావాలంటే, కారు టైర్లలో తగినంత గాలి ఉండటం ఎంతో అవసరం. టైర్లలో గాలి పీడనానికి సంబంధించి తయారీదారులు నిర్ధిష్ట ప్రతిపాదనలు చేస్తారు. వాటి ప్రకారమే టైర్లలో గాలి ఉండాలి. అంతకు మించి ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. కాబట్టి, మీ కారులో ఎల్లప్పుడూ టైర్ ప్రెజర్ గేజ్ ఉంచుకొని, టైర్లలో గాలి ప్రెజర్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి.

ఇంధన క్యాన్ (Fuel Can)

ఇంధన క్యాన్ (Fuel Can)

ఇంధన ట్యాంక్ ఖాలీ అయినప్పుడు ఈ క్యాన్ మీకు అక్షయ పాత్ర మాదిరిగా ఉపయోగపడుతుంది. లాంగ్ ట్రిప్‌లు, పెట్రోల్ బంకులు ఎక్కువగా లేని రూట్లలో ప్రయాణించేటప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించుకొని, క్యాన్‌ను కూడా నింపుకొని వెళ్లటం ఉత్తమం. మామూలుగా సిటీ రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఇంధనం ఖాలీ అయిపోయి, కారు ఆగిపోయినా ఖాలీ క్యాన్‌తో సమీపంలోని పెట్రోల్ బంకుకు వెళ్లి ఇంధనం తెచ్చుకోవచ్చు.

ప్రథమ చికిత్స కిట్ (First Aid Kit)

ప్రథమ చికిత్స కిట్ (First Aid Kit)

ఇది మీకే కాదు, అవతలి వాళ్లకి కూడా అత్యవసర పరిస్థితుల్లో చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి కారులో ఎల్లప్పుడూ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండటం ఎంతో అవసరం. అంతేకాదు, ఇది తప్పనిసరి కూడా.

టార్చ్ (Torch)

టార్చ్ (Torch)

రాత్రివేళలో మీ కారు మార్గమధ్యంలో ఆగిపోయిందా, సమస్య ఏంటో తెలుసుకోవాలంటే టార్చ్ చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి, కారులో ఎప్పుడూ ఓ టార్చ్ ఉండేలా చూసుకోవాలి.

అదనపు డబ్బు (Extra Money)

అదనపు డబ్బు (Extra Money)

మీ జేబులో డబ్బులు ఎప్పుడు ఖాలీ అయిపోతాయో మీకే తెలియదు. కాబట్టి, కారులో కొంత మొత్తాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా భద్రపరచుకొని ఉంచాలి. ఏదేనా ఎమర్జెన్సీ ఏర్పడినప్పుడు, మరమత్తు చేయించాల్సి వచ్చినప్పుడు లేదా మరే ఏ ఇతర కారణానికైనా ఈ అదనపు డబ్బు ఉపయోగపడుతుంది.

అదనపు బట్టులు (Extra Cloths)

అదనపు బట్టులు (Extra Cloths)

వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి, కారులో ఎల్లప్పుడూ ఓ జత బట్టలు ఉంచుకోవటం మంచిది.

కార్ జాక్ (Car Jack)

కార్ జాక్ (Car Jack)

కారు పంక్చర్ అయినప్పుడు లేదా చక్రాన్ని మార్చాలనుకున్నప్పుడు కార్ జాక్ అవసరం. కాబట్టి, ఇది మీ టూల్ కిట్ ఎల్లప్పుడూ ఉండాలి.

స్పేర్ టైర్ (Spare Tyre)

స్పేర్ టైర్ (Spare Tyre)

కేవలం కార్ జాక్ ఉంటే సరిపోతుందా, స్పేరట్ టైర్ కూడా ఉండాలి కదా. లాంగ్ ట్రిప్‌లకు వెళ్లేటప్పుడు మంచి కండిషన్‌లో ఉన్న స్పేర్ టైర్‌ను వెంట తీసుకువెళ్లటం ఉత్తమం.

కారును తుడిచే బట్ట (Wiping Cloth)

కారును తుడిచే బట్ట (Wiping Cloth)

కారుకు వైపర్లున్నా సరే, కారును తుడిచే బట్ట కారులో ఉండటం ఎంతో అవసరం. ప్రత్యేకించే మైక్రోఫైబర్ క్లాత్ ఉంటే, అద్దాలను తుడిచేందుకు బాగుంటుంది. దీంతో తుడిస్తే, అద్దంపై గీతలు పడవు.

మీ కారులో ఇవి ఉన్నాయా?

కారులో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో ఇవి కొన్ని మాత్రమే, మీకు తెలిసినవే ఏవైనా ఉంటే మా పాఠకులతో పంచుకోండి.

Most Read Articles

English summary
Car punctured? Loose Knobs? Engine Cranky? Jumpers needed? Spark Plug? We got the essentials that's going to save you from disaster - suggesting must haves that can keep you smiling and the engines rustling.
Story first published: Monday, September 16, 2013, 14:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X