డ్రైవ్ చేసేటప్పుడు ఏయే వాహన పేపర్లు తీసుకువెళ్లాలి?

By Ravi

Police
ఏదైనా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు చెల్లుబాటైన వాహన పేపర్లు/డాక్యుమెంట్లను తప్పనిసరిగా నడిపే వారి వెంట తీసుకువెళ్లటం ఎంతో అవసరం. వాహనానికి సంబంధించి, వాహనం నడిపే వ్యక్తికి సంబంధించి సరైన పేపర్లు లేకుండా డ్రైవ్ చేయటం చట్టరీత్యా నేరం. ఇందుకు జరిమానాతో పాటు జైలుశిక్ష పడే ఆస్కారం కూడా ఉంది. మరి ఈ వాహనా పేపర్లు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాల విషయంలో క్రింద పేర్కొన్న డాక్యుమెంట్లను తప్పనిసరిగా కలిగి ఉండాలి:

  • చెల్లుబాటైన డ్రైవింగ్ లైసెన్స్
  • చెల్లుబాటైన వాహన రిజిస్ట్రేషన్
  • చెల్లుబాటైన వాహన బీమా సర్టిఫికెట్
  • టాక్స్ పేమెంట్ ప్రూఫ్
  • ఫిట్‌నెస్ సర్టిఫికెట్
  • పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పియూసి) సర్టిఫికెట్
  • ఇన్సూరెన్స్ కవర్ నోట్, టాక్స్ పేమెంట్ రిసీప్ట్ మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ యొక్క రెన్యువల్ (ఒకవేళ అవసరమైతే)లు చెల్లుబాటైన సాక్ష్యాలు
  • ఒరిజినల్ డాక్యుమెంట్ల యొక్క (గజిటెడ్ ఆఫీసర్ ద్వారా అటెస్ట్ చేయబడినవి) జెరాక్స్ కాపీలు కూడా అంగీకరించబడుతాయి. అయితే, అధికారులు ఒరిజినల్ డాక్యుమెంట్లను చూపించమని కోరితే, సదరు వాహన యజమాని 15 రోజుల లోపుగా వాటిని సమర్పించాల్సి ఉంటుంది.
  • డ్రైవింగ్ లైసెన్స్ జెరాక్స్ కాపీ అంగీకరించబడదు.
  • ఒకవేళ డ్రైవింగ్ లైసెన్సును అధికారుల ద్వారా జప్తు చేయబడినా లేదా వారికి సమర్పించబడినట్లయితే, దానిపై ఇచ్చిన రిసీప్టు లైసెన్సుకు బదులుగా పనిచేస్తుంది. కాబట్టి, దానిని వాహనం మరియు ఒరిజినల్ ఫారమ్‌తో పాటుగా తీసుకువెళాల్సి ఉంటుంది.

పోలీస్ డిపార్ట్‌మెంట్, రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన అధికారులు తనిఖీ కోసం పైన తెలిపిన వాహన డాక్యుమెంట్లను, సదరు వాహన యజమాని నుంచి డిమాండ్ చేసే ఆస్కారం ఉంది. కాబట్టి, వాహనంపై ఎప్పుడు బయటకు వెళ్లాల్సి వచ్చినా పైన తెలిపిన డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకొని బయలుదేరండి. అత్యవసర సమయాల్లో మీ స్వంత వారికి సమాచారం అందించేందుకు కూడా ఈ డాక్యుమెంట్లు సహకరిస్తాయి. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ విషయాల్లో రిమైండర్లను సెట్ చేసుకోండి.

Most Read Articles

English summary
What are vehicle papers? What automotive papers to carry while you are on drive? Know what auto paper in India to carry? It is very important to keep the necessary papers in the vehicle for the purpose of being checked by the traffic police or otherwise required at any time.
Story first published: Monday, June 24, 2013, 11:27 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X