కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

కారును నడిపే ప్రతి ఒక్కరు, అందులో ఉండే హ్యాండ్‌బ్రేక్ యొక్క పని ఏమిటో తప్పకుండా తెలుసుకోవాలి. అయితే, ఈ హ్యాండ్‌బ్రేక్ ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో చాలా మందికి తెలియకపోవచ్చు. ముఖ్యంగా, కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకునే వారు హ్యాండ్‌బ్రేక్ విషయంలో పొరపాట్లు చేస్తూ ఉండొచ్చు. ఈ విషయంలో ఓ స్పష్టమైన అవగాహన ఉండకపోవడమే ఇందుకు కారణం కావచ్చు.

కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

సాధారణంగా డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా కారు నడపడం నేర్చుకునే వారికి, ట్రైనర్ మీకు కారు యొక్క అన్ని ప్రధాన ఫీచర్ల గురించి మరియు ప్రత్యేకించి హ్యాండ్‌బ్రేక్ గురించి పూర్తి సమాచారం ఇస్తారు. కానీ, మనదేశంలో చాలా మంది వ్యక్తులు డ్రైవింగ్ స్కూల్ నుండి కాకుండా వేరే ఇతర మార్గాల ద్వారా కారు నడపడం నేర్చుకుంటుంటారు. కాబట్టి, అలాంటి కారులోని అన్ని కంట్రోల్స్‌ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో ఓ స్పష్టత ఉండదు.

కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

ఒకవేళ మీరు కూడా మీరు కారు హ్యాండ్‌బ్రేక్‌ను ఉపయోగించడంలో పొరపాటు చేస్తున్నట్లయితే, దానిని ఎప్పుడు ఎలా సరైన విధంగా ఉపయోగించాలో తెలుసుకోండి. మరి ఈ నాటి మన కథనంలో కారులో ఉండే హ్యాండ్‌బ్రేక్ అంటే ఏమిటి, అదెలా పనిచేస్తుంది మరియు దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

హ్యాండ్‌బ్రేక్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?

కార్లలో అందించబడే హ్యాండ్‌బ్రేక్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, దీనిని కారు యొక్క రెండవ బ్రేక్ (మొదటిది ఫుట్ బ్రేక్) అని చెప్పొచ్చు. అత్యవసర సమయాల్లో ఇది ఎమర్జెన్సీ బ్రేక్ మాదిరిగా కూడా పనిచేస్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇది ఫుట్ బ్రేక్ అంత సమర్థవంతంగా ఉండకపోవచ్చు. ఈ హ్యాండ్‌బ్రేక్ కి అనేక పేర్లు మరియు రూపాలు ఉన్నాయి.

కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

ముందుగా పేర్ల విషయానికి వస్తే, హ్యాండ్‌బ్రేక్ ను పార్కింగ్ బ్రేక్, ఎమర్జెన్సీ బ్రేక్ లేదా ఈ-బ్రేక్ అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. పేరు ఏదైనప్పటికీ దాని పనితీరు మాత్రం ఒక్కటే, కారుని నిలుపదల చేయటంలో సహకరించడం. సాధారణంగా, కారులో హ్యాండ్‌బ్రేక్ అనేది డ్రైవర్ ఎడమ చేతివైపు ఉండే సెంటర్ కన్సోల్‌పై అమర్చబడి ఉంటుంది. దీనిని హ్యాండ్ లివర్ ఆపరేటెడ్ హ్యాండ్‌బ్రేక్ అంటారు. ఇది హై-టెన్షన్ కేబుల్ సాయంతో పనిచేస్తుంది. డ్రైవర్ ఈ లివర్ పై ఉన్న స్విచ్‌ను నొక్కిపట్టి, తన చేతితో పైకి లాగడం ద్వారా ఇది ఆన్ లేదా యాక్టివేట్ అవుతుంది. అలాగే, దీనిని ఆఫ్ చేయడం కోసం అదే లివర్‌పై ఉన్న స్విచ్‌ను నొక్కి క్రిందికి వదలాల్సి ఉంటుంది.

కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

అయితే, కొన్ని కార్లలో ఈ ఫీచర్ ఫుట్ పెడల్స్ ఉండే ప్రాంతంలో ఉంటుంది, అలాంటి సందర్భాల్లో దీనిని ఫుట్ ఆపరేటెడ్ పార్కింగ్ బ్రేక్ లేదా ఎమర్జెన్సీ బ్రేక్ అని పిలుస్తారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేయడానికి ముందు మరియు కారును పార్క్ చేసిన తర్వాత తన కాలితో ఈ బ్రేక్ ను నొక్కడం ద్వారా ఇది ఆన్ లేదా ఆఫ్ అవుతుంది. అలాగే ప్రస్తుతం, మార్కెట్లో లభిస్తున్న మోడ్రన్ కార్లలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్ ఉంటుంది. ఇది పవర్ విండ్ స్విచ్ మాదిరిగా ఉంటుంది. దీనిని వేలితో పైకి లాగినప్పుడు హ్యాండ్‌బ్రేక్ ఆన్ అవుతుంది మరియు క్రిందికి నొక్కినప్పుడు హ్యాండ్‌బ్రేక్ ఆఫ్ అవుతుంది.

కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

హ్యాండ్‌బ్రేక్‌ను ఎప్పుడు మరియు ఎలా ఉపయోగించాలి?

1. కారు పార్క్ చేయడానికి

కారును పార్క్ చేసిన తర్వాత, కారు ముందుకు లేదా వెనకకు కదలకుండా ఉంచేందుకు హ్యాండ్‌బ్రేక్‌ను ఉపయోగించవచ్చు. కానీ, చాలా మంది ఈ విషయంలో కారును గేర్‌లో నిలుపుదల చేసి, హ్యాండ్‌బ్రేక్‌ను విస్మరిస్తుంటారు. నిజానికి, కారును ఎప్పుడూ కూడా గేర్‌లో పార్క్ చేయకూడదు. ఇలా చేయటం వలన ట్రాన్సిమిషన్, గేర్‌బాక్స్ పై అధనపు భారం పడి, అది చెడిపోయే ప్రమాదం ఉంటుంది.

కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

కాబట్టి కారును పార్క్ చేసిన తర్వాత, దాని కదలికను పూర్తిగా నిలుపుదల చేయటం కోసం హ్యాండ్‌బ్రేక్‌ను మాత్రమే ఉపయోగించడం సురక్షితం. పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ టెస్ట్ కి హాజరై ఉంటే, సదరు పరీక్షా సమయంలో, మీ ఎగ్జామినర్ కనీసం ఒక్కసారైనా కారుని పార్క్ చేయమని మిమ్మల్ని అడిగి ఉంటాడు. ఆ సమయంలో ఎగ్జామినర్ గుర్తించే కీలకమైన అంశాలలో మీరు హ్యాండ్‌బ్రేక్ ఉపయోగిస్తున్నారా లేదా అనేది కూడా ఒకటి.

కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

2. కారును ఆపినప్పుడు

కారు ఇంజన్ ఆన్‌లో ఉండి, ఎక్కడైనా సరే మీరు కారును కాస్తంత సేపు నిలుపుదల చేయాలని అనుకున్నప్పుడు హ్యాండ్‌బ్రేక్‌ను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, మీరు ట్రాఫిక్ లైట్ వద్ద ఎక్కువ సమయం ఆగాల్సి వచ్చినప్పుడు, గేర్‌ని న్యూట్రల్ చేసి, హ్యాండ్‌బ్రేక్‌ని అప్లయ్ చేయవచ్చు. ఇలా చేయడం వలన మీరు మీ చేతులు, కాళ్లకు కాస్తంత విశ్రాంతి కల్పించవచ్చు మరియు కారు ముందుకు లేదా వెనుకకు కదలకుండా చూసుకోవచ్చు.

కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

3. ఒక ఎమర్జెన్సీ బ్రేక్ తర్వాత

రోడ్డుపై కారులో వెళ్తున్నప్పుడు, ఎప్పుడైనా అత్యవసరంగా బ్రేక్ వేయాల్సి వచ్చిన సందర్భంలో ఫుట్ బ్రేక్‌ని అత్యవసరంగా నొక్కిన వెంటనే, హ్యాండ్‌బ్రేక్‌ని కూడా అప్లయ్ చేయడం ద్వారా కారు వేగాన్ని తగ్గించవచ్చు. ఎమర్జెన్సీ స్టాప్ చేయడానికి మీరు తప్పనిసరిగా మీ బ్రేక్ పెడల్‌ని ఉపయోగించాలి మరియు మీరు మాన్యువల్ కారు నడుపుతుంటే, మీ క్లచ్ పెడల్‌ని ఉపయోగించకూడదు.

కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

4. హిల్ స్టార్ట్

ఒకవేళ, మీరు ఎత్తు పళ్లాలతో కూడిన కొండ ప్రాంతంలో కారును పార్క్ చేసినప్పుడు లేదా వాలుగా ఉండే ప్రాంతాల్లో ఆగి ఉన్న కారును స్టార్ట్ చేసేటప్పుడు హ్యాండ్‌బ్రేక్‌ను ఉపయోగించవచ్చు. నిజానికి, హ్యాండ్‌బ్రేక్ ఆన్‌లో ఉన్నప్పటికీ, కారు ముందుకు వెళ్తుంది. కానీ, ఇలా హ్యాండ్‌బ్రేక్ ఆన్ చేసి డ్రైవ్ చేయటం చాలా ప్రమాదకరం. ఇలా చేయడం వలన బ్రేక్ డ్రమ్ ఖాలీ అయి, ఫుట్ బ్రేక్ ఫెయిల్‌ అవడానికి కారణం కావచ్చు.

కారులో హ్యాండ్‌బ్రేక్ (Handbrake) అంటే ఏమిటి? దానిని ఎప్పుడు, ఎలా ఉపయోగించాలి?

ఒకవేళ మీరు మీ కారులోని హ్యాండ్‌బ్రేక్ చక్కగా పనిచేస్తుందా లేదో తెలుసుకోవాలనుకుంటే - ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
What is handbrake in car how and when we should use it tips
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X