రన్నింగ్‌లో ఉన్న స్కూటర్ సడెన్‌గా ఆగిపోతోందా...?

Written By:
Recommended Video - Watch Now!
Tata Nexon Faces Its First Recorded Crash

మీరు స్కూటర్ వాడుతున్నారా...? అయితే, ఈ స్టోరీ ఖచ్చితంగా మీ కోసమే. సిగ్నల్ దగ్గర లేదంటే ఏదైనా చిన్న పనికోసం ఆగినపుడు స్కూటర్‌‌లోని ఇంజన్ ఆన్‌లోనే ఉంటుంది. దీనిని ఐడ్లింగ్ అంటారు. ఇలా ఐడ్లింగ్ ఉన్న స్కూటర్ ఉన్నట్లుండి ఆగిపోతుంది. అంతే కాకుండా రైడ్ చేస్తున్నపుడు కూడా సడెన్‌గా ఇంజన్ ఆఫ్ అయిపోతుంటుంది.

ఇలా రన్నింగ్‌లో ఉన్న స్కూటర్ సడెన్‌గా ఎందుకు ఆగిపోతుందో చూద్దాం రండి...

స్కూటర్ ఉన్నట్లుండి ఆగిపోవడానికి గల కారణాలు

స్కూటర్ ఇంజన్ ఆన్‌లో ఉన్నపుడు ముందుకెళ్దామని యాక్సిలరేషన్ చేస్తే సడెన్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంటుంది. స్కూటర్ నడుపుతున్న వారంతా ఒక్కసారైనా ఇలాంటి అనుభవం పొంది ఉంటారు. ఇందుకు గల కారణాల్లో మొదటి ఫ్యూయల్ బ్లాక్ అయిపోవడం.

స్కూటర్ ఉన్నట్లుండి ఆగిపోవడానికి గల కారణాలు

ట్యాంక్ నుండి కార్బోరేటర్‌కు పెట్రోల్ సరఫరా అయ్యే క్రమంలో మధ్యలో ఎయిర్ వెళుతుంటుంది. ఇంధన అయిపోయి, దాని తరువాతే వచ్చిన ఎయిర్ వెళ్లడంతో ఇంజన్ ఆగిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో మళ్లీ వెంటనే స్టార్ట్ చేయవచ్చు.

స్కూటర్ ఉన్నట్లుండి ఆగిపోవడానికి గల కారణాలు

ఐడ్లింగ్ స్క్రూ వదులుగా ఉండటం

కార్బోరేటర్ పెట్రోల్‌ను గాలితో కలిపి మిశ్రమంగా ఇంజన్‌ లోపలికి పంపిస్తుంది. అవసరాన్ని బట్టి ఒక్కోసారి ఎక్కువ పెట్రోల్-తక్కువ గాలి, తక్కువ పెట్రోల్-ఎక్కువ గాలిని పంపిస్తుంది. దీనిని యాక్సిలరేటర్‌తో కంట్రోల్ చేయవచ్చు.

స్కూటర్ ఉన్నట్లుండి ఆగిపోవడానికి గల కారణాలు

స్కూటర్ కదలికలో లేనపుడు ఇంజన్ ఆన్‌లో ఉండి, స్కూటర్ స్థిరంగా ఉండటం కోసం నిర్ణయించబడిన నిర్ధిష్టమైన పెట్రోల్‌ను మాత్రమే పంపుతూ ఉంటుంది. ఇందుక కోసం కార్బోరేటర్‌లో ఐడ్లింగ్ స్క్రూ ఒకటి ఉంటుంది. ఈ స్క్రూ ద్వారా ఐడ్లింగ్ ఎంత మేరకు ఉండాలో నిర్ణయించుకోవచ్చు.

స్కూటర్ ఉన్నట్లుండి ఆగిపోవడానికి గల కారణాలు

కార్బోరేటర్ స్క్రూ వదులు అయిపోవడంతో, ఇంజన్‌లోకి వెళ్లే పెట్రోల్ మరియు గాలి మిశ్రమంలో తేడా వస్తుంది. దీంతో, సిగ్నల్స్ వద్ద మరియు ఎక్కడైనా స్కూటర్‌ను ఆపినపుడు ఐడ్లింగ్‌లో ఉండకుండా ఉన్నట్లుండి ఆగిపోతుంది.

స్కూటర్ ఉన్నట్లుండి ఆగిపోవడానికి గల కారణాలు

స్కూటర్ ఐడ్లింగ్‌లో ఉన్నపుడు సడెన్‌గా ఆగిపోవడానికి మలినాలతో కూడిన పెట్రోల్‌ను ట్యాంకులో నింపడం మరో కారణం కావచ్చు. దుమ్ము, ధూళి మరియు నీరు కలిసిన పెట్రోల్ ఇంజన్‌లో సరిగా మండదు.

స్కూటర్ ఉన్నట్లుండి ఆగిపోవడానికి గల కారణాలు

రన్నింగ్‌లో ఉన్న స్కూటర్ ఇంజన్ ఉన్నట్లుండి ఆగిపోవడానికి ఈ కథనంలో పేర్కొన్నవి ప్రధాన కారణాలు కావచ్చు. మీ స్కూటర్‌ కూడా ఎప్పుడైనా ఉన్నట్లుండి ఆగిపోయినపుడు వారంటీ ఉన్నట్లయితే, సంభందిత డీలర్‌ను, లేకపోతే గుర్తింపు పొందిన స్కూటర్‌ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించండి.

Trending On DriveSpark Telugu:

తలక్రిందులైన టాటా నెక్సాన్: సేఫ్టీ విషయంలో మరోసారి నిరూపించుకున్న టాటా

హోండా గ్రాజియా ఫస్ట్ రైడ్ రివ్యూ: ప్లస్ ఏంటి.. మైనస్ ఏంటి..?

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Reason Behind Sudden Stoppage Of Scooter While Driving
Story first published: Wednesday, January 24, 2018, 18:48 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark