ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ నౌకలు ఒక చోట కలయికతో రికార్డు

Written By:

ప్రపంచలో అతి పెద్ద క్రూయిజ్ షిప్పులు మూడు ఉన్నాయి. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్‌కు చెందిన వయాసిస్ తరగతి నౌకలు వయాసిస్ ఆఫ్ సీస్, అల్లురే ఆఫ్ సీస్ మరియు హార్మనీ ఆఫ్ ది సీస్. సప్త సముద్రాలను చుట్టసే ఈ నౌకలు తమ మాతృ ప్రదేశం అయిన ఎవర్‌గ్లేడ్స్ పోర్టును చేరుకున్నాయి. ప్రపంచపు అతి పెద్ద నౌకలు ఒక చోటకు చేరుకోవడం ఇదే మొదటిసారి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఒక చోట కలుసుకున్న విశ్వపు అతి పెద్ద నౌకలు

ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ నౌకలు మొట్టమొదటి సారిగా ఫ్లోరిడాలోని లాడెరాల్ అనే తీరంలో కలిసి ప్రయాణించాయి.

ఒక చోట కలుసుకున్న విశ్వపు అతి పెద్ద నౌకలు

ఈ మూడు లగ్జరీ క్రూయిజ్ నౌకల్లో విలాసవంతమైన ఫీచర్లు ఉన్నాయి, సెంట్రల్ పార్క్, 12,000 చెట్లు, ఫ్లో రైడర్, సర్ఫ్ సిమ్యులేటర్స్, 82 అడుగులు పొడవున్న జిప్ వైర్, విలాసవంతమైన మల్టీ లెవల్ సూట్స్, సీలింగ్ మీద కిటికీలు మరియు అవుట్ డోర్ అక్వా థియేటర్ వంటివి కలవు.

ఒక చోట కలుసుకున్న విశ్వపు అతి పెద్ద నౌకలు

2009 లో వయాసిస్ ఆఫ్ ది సీస్, 2010 లో అల్లురే ఆఫ్ ది సీస్ రెండు నౌకలు ఆయా సంవసత్సరాల్లో ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ నౌకలుగా రికార్డుకెక్కాయి.

ఒక చోట కలుసుకున్న విశ్వపు అతి పెద్ద నౌకలు

పైన తెలిపిన రెండు నౌకల ఎత్తుకన్నా ఒక్క అడుగు ఎత్తుతో, 2,25,000 టన్నుల బరువుతో అందుబాటులోకి వచ్చిన హార్మనీ ఆఫ్ ది సీస్ అధికారికంగా ప్రపంచపు అతి పెద్ద క్రూయిజ్ నౌకగా రికార్డు సృష్టించింది.

ఒక చోట కలుసుకున్న విశ్వపు అతి పెద్ద నౌకలు

ప్రతి నౌకలో కూడా సుమారుగా 2,747 వ్యక్తిగత గదులు, 6,700 పడక మంచాలు మరియు 7,148 మంది వరకు ప్రయాణించే సౌకర్యం కలదు.

ఒక చోట కలుసుకున్న విశ్వపు అతి పెద్ద నౌకలు

ఇంత వరకు ప్రపంచపు అతి పెద్ద నౌకలు కాస్త అటు ఇటుగా మూడు ఉన్నాయి అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మూడింటిని నిర్మించిన అదే సంస్థ ఎస్‌టిఎక్స్ సెయింట్-నజైర్ షిప్‌యార్డ్, ఫ్రాన్స్‌లో నాలుగవ నౌకను నిర్మిస్తోంది.

ఒక చోట కలుసుకున్న విశ్వపు అతి పెద్ద నౌకలు

క్రితం రికార్డులను బ్రేక్ చేస్తూ నిర్మితమవుతున్న నౌకను వయాసిస్ శ్రేణిలోనే నిర్మిస్తున్నారు. మిగతా మూడు నౌకలకు తోబుట్టువుగా అందుబాటులోకి రానున్న ఈ నౌక 2018 నాటికి సముద్రం మీద పరుగులు పెట్టనుంది.

Read more on: #నౌకలు #ships
English summary
Read In Telugu: World's Three Biggest Ever Cruise Ships Sail Together For The First Time
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark