భారతీయ రోడ్ల మీద డ్రైవ్‌ చేస్తున్నపుడు వీటిని గమనించండి

By N Kumar

రోడ్డు ప్రమాదాలలో భారతీయ రోడ్లకు భారీ లెక్కుంది. కాని దేశీయంగా ఉన్న రోడ్డు రవాణా సంస్థలు, రహదారుల శాఖలు మరియు రహదారుల అథారిటీలు ఎవరిపనులు వారు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రమాదాలు తగ్గే అవకాశాలే లేవా అని అంటే ఎందుకు లేవు అంటోంది డ్రైవ్‌స్పార్క్ తెలుగు.

అయితే డ్రైవ్‌స్పార్క్ ఏమంటోందోచూడండి: ఒక్క రుపాయి ఖర్చు లేకుండా సింపుల్ చిట్కాలతో డ్రైవింగ్ చేస్తున్నపుడు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చట. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మరియు చేయకూడని పొరపాట్ల గురించి క్రింది శీర్షిక ఏమని చెబుతుందో చూద్దాం రండి.

 1. ద్విచక్ర వాహనాలు

1. ద్విచక్ర వాహనాలు

ప్రస్తుతం భారత్‌లో ప్రజారవాణా కోసం ఎక్కువ మంది టూ వీలర్లను ఎంచుకుంటున్నారు. కారణం, తక్కువ ధర, మంచి ఇంధన సామర్థ్యం మరియు సిటి రోడ్లలో ఎంతో అనువుగా ఉంటాయి. వీరు రోడ్లు మీద ఎటు పడితే అటు మరియు డ్రిఫ్టింగ్ చేసుకుంటూ వెలుతుంటాకరు. అయితే వారికి ఇబ్బందులు కలిగించకండి. ఎందుకంటే వారికి కార్లలో ఉన్న విధంగా ఎటువంటి భద్రత ఫీచర్లు ఉండవు.

2. వన్ వే రహదారులు

2. వన్ వే రహదారులు

ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి ప్రవేశపెట్టినవి వన్ వే రహదారులు. కాని ఇప్పుడు వీటి మీద కూడా ప్రమాదాలు రేటు పెరుగుతోంది. కారణం వన్‌ వే రోడ్ల మీద ఎదురుగా అప్పుడప్పుడు కొన్ని వాహనాలు వస్తుంటాయి వీటి వలనే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇందులో టూ వీలర్లు మరియు ఆటోలు ఇలా వ్యతిరేక దారులలో ఎక్కువగా వస్తున్నాయి.

3. లైట్లు లేకుండా వెళ్లడం

3. లైట్లు లేకుండా వెళ్లడం

రాత్రి వేళలో లైట్లు లేకుండా నడిపే వాళ్లను మనం తరచూ చూస్తుంటా. ఇది ఎంత సాధారణ విషయమో అంతే డేంజర్‌ కూడా. ప్రయాణం మధ్యలో మీ వాహనం యొక్క లైట్లు పాడైపోతే కనీసం పార్కింగ్ లైట్ల వెలుతురులో పరిమిత వేగంతో వెళితే ప్రమాదాలను అరికట్టవచ్చు.

4. రోడ్డు మీద ఆటలు

4. రోడ్డు మీద ఆటలు

కొన్ని మారు మూల ప్రాంతాల్లో మరియు వాహన రద్దీ ఎక్కువగా లేని ప్రదేశాల్లో పిల్లలు రోడ్డు మీదు ఆటలు ఆడుతుంటారు. మీరు ఒక వేళ అలాంటి దారులలో వెలుతూ ఉంటే హారన్ శబ్ధం చేసుకుంటూ వెళ్లండి.

5. జంతువులు

5. జంతువులు

ఇండియన్ రోడ్ల మీద తరచూ ఎదురయ్యేవి జంతువులు ఎక్కువగా ఆవులు మరియు కుక్కలు దర్శనం ఇస్తుంటాయి. మీరు టూ వీలర్‌లో వెలుతున్నపుడు కుక్కలు ఎదురైతే అవి రోడ్డు దాటిని తరువాత వెళ్లడం మంచిది. ఎందుకంటే వాటిని ఢీ కొంటే వాటికి ఏమీ కాదు కాని మీరు మాత్రం పెద్ద ప్రమాదానికి గురవుతారు.

6. పాదచారులు

6. పాదచారులు

మన దేశంలో రోడ్లను దాటడానికి ఎక్కుగా పాదచారుల కోసం ప్రత్యేకమైన రహదారి సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయలేకపోయింది. కాబట్టి అవసరాన్ని ఎంతటి రద్దీ రోడ్లనయినా దాటిల్సి వస్తుంది. ఆ సమయంలో వారి కోసం కాసేపు మీ వాహనాన్ని ఆపుకోవడం మంచిది. ఎందుకంటే పని కన్నా ప్రాణం విలువైనది కదా...

 7. ఎద్దుల బండ్లు మరియు ట్రాక్టర్లు

7. ఎద్దుల బండ్లు మరియు ట్రాక్టర్లు

అభివృద్ది చెందిన దేశంలో ఎద్దుల బండ్లు ఇంకా వినియోగంలో ఉన్నాయంటే ఇదే మరి దేశ అభివృద్ది అంటే. పల్లె రోడ్ల నుండి పట్టణ రోడ్ల వరకు మన ప్రయాణంలో ఇవి తరుచూ కనబతూనే ఉంటాయి. వాటికి హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు మరియు హారన్ వంటివి ఉండవు కాబట్టి వాహనంలో ఉన్నవారే జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది.

 8. యు టర్న్

8. యు టర్న్

జాతీయ రహదారుల మీద వాహనాల వేగానికి హద్దులు ఉంటాయా చెప్పండి. జాతీయ రహదారుల మీద యు టర్న్ ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణం వేగంగా వెలుతున్నపుడు ప్రక్క రోడ్డు ద్వారా ఏవయినా వాహనాలు మన మార్గంలోకి వస్తున్నాయా అని డ్రైవర్లు గమనించక పోవడం. ఇలాంటి గుర్తులు ఉన్న ప్రదేశాలలో కొంచెం నిదానంగా వెళ్లడం మంచిది.

9. సిగ్నల్స్‌ను దాటవేయడం

9. సిగ్నల్స్‌ను దాటవేయడం

సిటిలలో ట్రాపిక్స్ అంటే పధ్మవ్యూహం అని చెప్పవచ్చు. అలాంటి ట్రాఫిక్‌ను నియంత్రించడానికి సిగ్నల్స్‌ను ఏర్పాటు చేస్తే వాటిని కూడా లెక్క చేయకుండా వెళ్లిపోతుంటారు, వీటి వలన ప్రమాదాల భారినపడుతున్నారు. ఇలా జరగకూడదు అంటే ఆరెంజ్ రంగు లైటు వెలగగానే బ్రేకులు పట్టుకోవడం మంచిది.

10. తాగుబోతు డ్రైవర్లు

10. తాగుబోతు డ్రైవర్లు

దేశంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న వాటికి కారణాలలో మత్తులో వాహనం నడపడం ఒకటి. మత్తు పదార్థాలు తీసుకుని నడపడం వలన వాహనాన్ని అధిక వేగంతో నడపడానికి ప్రయత్నిస్తారు. అయితే ప్రమాదం జరిగిన తరువాత తేరుకోవడానికి చాలా సమయమేపడుతుంది. కాబట్టి మీరు కూడా డ్రింకర్స్ అయితే మధ్యం తీసుకోకుండా వాహనాన్ని నడపండి.

చివరి మాట

చివరి మాట

వీటిని పాటించడానికి ఎటువంటి ఖర్చు కూడా కాదు. కాని మనం వాహనాన్ని నడుపుతున్నపుడు ఒక్క సారి ఆలోచిస్తే ఈ కారణాల వలన జరిగే ప్రమాదాలను దాదాపుగా తగ్గించవచ్చు.

మరిన్ని ఆసక్తికరమైన కథనాలకు...
  • దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే
  • అమెరికాను అడుక్కోవాల్సిన పని లేదు....స్వదేశీ పరిజ్ఞానంతో రానున్న భారతదేశపు న్యావిగేషన్ సిస్టమ

Most Read Articles

English summary
10 Things To Watch Out While Driving In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X