ఏప్రిల్‌లో మాత్రమే ఇలా జరుగుతుంది: ఎండ దెబ్బకు కాలిబూడిదైన 15 కార్లు

Written By:

దేశవ్యాప్తంగా ఎండలు అమాంతం పెరిగిపోయాయి. భారీగా పెరిగిన ఎండలు జంతువులు, పక్షులు మరియు మనకు మాత్రమే కాకుండా వాహనాలకు కూడా గండంగా మారాయి. ఇలా పెరిగిన ఎండల కారణంగా పార్కింగ్ లాట్‌లో నిలిపి ఉన్న ఓ కారులో మంటలు చెలరేగి సుమారుగా 15 కార్లను దహించివేశాయి.

ఎండ దెబ్బకు కాలిబూడిదైన 15 కార్లు

ఎండ కారణంగా కార్లు కాలిపోవడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోవచ్చు. కాని ఇది నిజం. ముంబాయ్‌లోని విద్యవిహార్ సొసైటీలో గల పార్కింక్ ఏరియాలో నిలిపి ఉన్న 15 కార్లు తీవ్రమైన ఎండ వేడిమికి మంటలు చెలిరేగి కాలిపోయాయిని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఎండ దెబ్బకు కాలిబూడిదైన 15 కార్లు

పార్కింగ్ ప్రదేశానికి ఇరువైపులా టార్పలిన్ పట్టలతో (షీట్లు) కప్పి ఉంచారు. భారీగా ఉన్న ఎండలకు ఈ టార్పలిన్ షీట్లలో మంటలు రేగి, ముందు ఒక కారుకు అంటుకొని తరువాత ఒకదానికొకటి మొత్తం 15 కార్లకు వ్యాపించినట్లు తెలిసింది.

ఎండ దెబ్బకు కాలిబూడిదైన 15 కార్లు

ముంబాయ్ మిర్రర్ కథనం మేరకు, కాలిపోయిన కార్ల జాబితాలో బిఎమ్‌డబ్ల్యూ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, హోండా అకార్డ్, టయోటా ఇన్నోవా మరియు వ్యాగన్ ఆర్ కార్లతో పాటు మరిన్ని కార్లు ఉన్నట్లు తెలిసింది. అయితే వీటిలో ముందుగా మంటలు ఏ కారుకు వ్యాపించాయో అనేది తెలియరాలేదు.

ఎండ దెబ్బకు కాలిబూడిదైన 15 కార్లు

అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ, ఎండ వేడిమికి ఒక కారులో చెలరేగిన మంటలు మిగతా కార్లకు కూడా వ్యాపించి ఉంటాయని అభిప్రాయపడ్డారు. పార్కింగ్ ప్రదేశం చాలా చిన్నగా ఉడటంలో మంటలు శరవేగంగా వ్యాపించాయి.

ఎండ దెబ్బకు కాలిబూడిదైన 15 కార్లు

భారీగా ఎగిసిన అగ్నికీలలు దట్టమైన పొగతో బిల్డింగ్ మొత్తాన్ని చుట్టుముట్టాయి. రెండు గంటలు పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఎండ దెబ్బకు కాలిబూడిదైన 15 కార్లు

ప్రమాదం జరిగిన ప్రాంతపు అగ్నిమాపక స్టేషన్ అధికారి బిడి పాటిల్ మాట్లాడుతూ, కారులో మంటలు చెలరేగడానికి కారణమయ్యే పదార్థాలుంటే, ఎక్కువ ఎండల ద్వారా నిప్పు రాజుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. లెథర్ సీట్లు మరియు ఇంధన ట్యాంకు ఉండటం ద్వారా మరింత వేగంగా మంటలు వ్యాప్తి అవకాశం ఉంటుందని తెలిపాడు.

ఎండ దెబ్బకు కాలిబూడిదైన 15 కార్లు

కార్లు పార్క్ చేసి ఉన్న పోడియం అత్యంత ఇరుకైనది కావడంతో అగ్నిమాపక సిబ్బంది లోనికెళ్లడానికి చాలా ఇబ్బందిపడట్లు బిడి పాటిల్ తెలిపాడు. దట్టమైన పొగలను ఎదుర్కుంటూ ముందుకుళ్లేందుకు శ్వాసపరికరాలను ధరించినట్లు తెలిపాడు.

ఎండ దెబ్బకు కాలిబూడిదైన 15 కార్లు

బిల్టింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగితే నివారించేందుకు కనీస ప్రమాణాలను పాటించకుండా నిర్మించారు మరియు ఆ బిల్డింగ్‌లో మంటలను ఆర్పే పరికరాలు లేవని తెలిపారు.

ఎండ దెబ్బకు కాలిబూడిదైన 15 కార్లు

ఏప్రిల్ మరియు మే నెలలో ఎండలు మరింత పెరిగే సూచనలున్నాయి. కాబట్టి మీరు మాత్రమే కాకుండా మీరు ఎంతో మెచ్చే కార్లను కూడా ఎండవేడిమి నుండి రక్షించండి. ఈ వేసవికాలంలో తగిన ప్రమాణాలను పాటించడం తప్పనిసరని గుర్తుంచుకోండి.

English summary
15 Cars Burnt Due To Intense Heat At A Parking Lot — And Its Only April
Story first published: Thursday, April 6, 2017, 13:08 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark