రాయలసీమలో ఖచ్చితంగా వెళ్లాల్సిన 15 రోడ్ ట్రిప్స్

Written By:

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, కర్నూలు మరియు కడప జిల్లాల సమూహమే రాయలసీమ. ఖనిజ సంపన్నమైన ఈ భూబాగాన్ని పూర్వం శ్రీ కృష్ణ దేవరాయలు పాలించడంతో ఈ ప్రాంతానికి రాయలసీమ అనే పేరు వచ్చింది.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

రాయలసీమలోని ప్రతి జిల్లాలో కూడా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు మరియు ప్రపంచ గుర్తింపు పొందిన దర్శనీయ ప్రదేశాలు ఉన్నాయి. చారిత్రాత్మక ప్రాంతమైన రాయలసీమలో అభయారణ్యాలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక దేవాలయాలు, రాజుల కాలం నాటి కట్టడాలు, ప్రకృతి సృష్టించిన అద్భుతాలు మరియు సహజ సిద్దమైన జలపాతాలు ఇలా ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయి.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

ఈ వేసవి కాలంలో రాయలసీమ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను రోడ్ ట్రిప్స్ ద్వారా అన్వేషించాలనుకుంటున్నారా...? అయితే, ఇవాళ్టి కథనంలో రాయలసీమ జిల్లాల్లో ఉన్న 15 బెస్ట్ రోడ్ ట్రిప్స్ మీద ఓ లుక్కేసుకోండి.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

కొండా రెడ్డి బురుజు

రాయలసీమలో ఒక్కో జిల్లా ఒక్కో పర్యాటకానికి ప్రత్యేకం. కర్నూలు పట్టణానికి వెళితే ఖచ్చితంగా చూసి తీరాల్సిన పురాతణ కట్టడం కొండా రెడ్డి బురుజు. చరిత్రలో దీనికున్న ప్రత్యేకత దృష్ట్యా ఎన్నో చిత్రాలను కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ చేశారు. ఇక్కడికి హైదరాబాద్ మరియు బెంగళూరు నగరాల నుండి జాతీయ రహదరారి 7 ద్వారా రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

రొళ్లపాడు వన్య ప్రాణి సంరక్షణా కేంద్రము

రొళ్లపాడు వన్య ప్రాణి సంరక్షణా కేంద్రము రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో కర్నూలు నగరానికి 45 కిలోమీటర్లు దూరంలో ఉంది. అంతరించిపోతున్న బస్టర్డ్ పక్షిజాతుల సంరక్షణ కోసం 1988లో 6.14కిమీల విస్తీర్ణంలో స్థాపించారు. రోడ్డు మార్గం ద్వారా కర్నూలు అక్కడి నుండి రొళ్లపాడు వన్య ప్రాణి సంరక్షణా కేంద్రానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

నల్లమల కొండలు

నల్లమల అడవులు తూర్పు కనుమలలో భాగం. ఈ నల్లమల అడవులు కడప, కర్నూల్ మరియు చిత్తూరు జిల్లాలో దట్టంగా విస్తరించి ఉంది. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. కర్నూలు నుండి విజయవాడకు వెళ్లే మార్గం నల్లమల అడవుల మీదుగా వెళుతుంది.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

ఆదోని కోట

కర్నూలు జిల్లాలో అనంతపురం సమీపంలో ఉన్న ఆదోని పట్టణంలో చారిత్రాత్మక ఆదోని ఫోర్ట్ ఉంది. ఆదోని కోటను సుమారుగా 15 వ శతాబ్దంలో నిర్మించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. హైదరాబాద్ నుండి వస్తే కర్నూలు మీదుగా, బెంగళూరు నుండి వస్తే అనంతపురం మీదుగా ఆదోని కోటను చేరుకోవచ్చు.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

బెలుం గుహలు

బెలుం గుహలు భారతదేశంలో రెండవ అతి పెద్ద గుహలుగా భావిస్తున్నారు. అతి పురాతన కాలంలో బెలుం గుహలు సహజ సిద్దంగా ఏర్పడ్డాయి. వీటిని వీక్షించడానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు వస్తుంటారు. కర్నూలు జిల్లాలోని కొలిమి గుండ్ల మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. బెలుం గుహల ముఖ ద్వారం గుండా లోపలికి వెళితే పొడవైన సొరంగ మార్గాలు మరియు జాలువారే శిలాస్పటికాలు ఉన్నాయి.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

తిరుమల-తిరుపతి

భారతదేశపు అతి పురాతణమైన మరియు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ వేంకటేశ్వరుడి ఆలయం. శ్రీ వేంకటేశ్వరుడి ఆలయంతో పాటు ఎన్నో వన్యప్రాణులు, పక్షులకు తిరుమల కొండలు నెలవు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శయనించిన సర్పము యొక్క ఏడుపడగలే ఈ ఏడు కొండలని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల ఏడు కొండలను సప్తగిరులని కూడా అంటారు.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

తిరుమల రాయలసీమలో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం. తిరుమలలో స్వామివారి దర్శనం, పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులు, దిగువ తిరుపతిలో ఉన్న అమ్మవారి ఆలయాలు కీలకమైన దర్శనీయ ప్రదేశాలు. ఇక్కడికి బస్సు, రైలు మరియు విమానా మార్గాల ద్వారా చేరుకోవచ్చు. హైదరాబాద్, బెంగళూరు మరియు విజయవాడ నుండి జాతీయ రహదారుల ద్వారా చేరుకోవచ్చు.

Recommended Video - Watch Now!
What Does The ‘X’ On The Back Of Trains Mean? - DriveSpark
రాయలసీమలో రోడ్ ట్రిప్స్

శ్రీశైలం

శ్రీశైలం మల్లిఖార్జున స్వామి దేవాలయానికి ప్రసిద్ది. శ్రీశైల మల్లిఖార్జునుని పవిత్ర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. బెంగళూరు నుండి హైదరాబాద్ నుండి కర్నూలుకు అక్కడి నుండి నల్లమల అటవీ మార్గం గుండా శ్రీశైలాన్ని చేరుకోవచ్చు.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

అహోబిలం

అహోబిలంలో ప్రసిద్ద శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం ఉంది. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండల కేంద్రం నుండి 22కిమీలు మరియు నంద్యాల నుండి 60కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాదు నుండి నంద్యాల మీదుగా అహోబిలం క్షేత్రాన్ని చేరుకోవచ్చు. అదే విధంగా, బెంగళూరు నుండి వెళితే అనంతపురం, తాడిపత్రి మీదుగా లేదంటే కదిరి, పులివెందుల మరియు ప్రొద్దుటూరు మీదుగా అహోబిలం చేరుకోవచ్చు.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

ఓర్వకల్లు రాక్ గార్డెన్

ఓర్వకల్లు రాతి ఉద్యానవనం(రాక్ గార్డెన్) సహజ సిద్దం ఏర్పడింది. కర్నూలు జిల్లా కేంద్రం నుండి నంద్యాల పట్టణానికి వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా ప్రకృతి సహజంగా ఏర్పడిన రాతి శిలలు. గాజు తయారీకి వినియోగించే క్వార్ట్జ్ మరియు సిలికా ముడిపదార్థాలతో ఏర్పడ్డాయి. ఈ పర్యాటక ప్రాంతంలో సినిమా షూటింగులు కూడా జరుగుతుంటాయి. హైదరాబాద్ మరియు బెంగళూరు నుండి కర్నూలు చేరుకుని నంద్యాల మార్గంలో వెళితే ఓర్వకల్లు గ్రామానికి సుమారుగా 63 కిమీల దూరంలో ఈ రాతి కొండలు దర్శనమిస్తాయి.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

చంద్రగిరి కోట

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో 1640 కాలంలో చంద్రగిరి కోటను నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండే మహామంత్రి తిమ్మరుసు జన్మస్థలం చంద్రగిరి. ఈ గ్రామంలో అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ పాదభాగంలో కోటను నిర్మించడం వలన దీనిని చంద్రగిరి దుర్గం అని పిలిచే వారు. తిరుపతికి వచ్చినపుడు అక్కడి నుండి 15కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగిరి కోటను దర్శించండి.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

తలకోన

తలకోన ప్రముఖ పర్యాటక కేంద్రం. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో సందడిసందడిగా ఉంటుంది. చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

హార్సిలీ హిల్స్

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద వేసవి విడిది ఈ హార్సిలీ హిల్స్. చాలా మందికి తెలిసిన హార్సిలీ హిల్స్‌ అసలు పేరు ఏనుగు మల్లమ్మ కొండ. దీనిని ఆంధ్రా ఊటీ అని కూడా పిలుస్తారు. బెంగళూరు నుండి 160కిమీలు మరియు తిరుపతి నుండి 140కిమీల దూరంలో ఉంది.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

నాగలాపురం

నాగలాపురం గ్రామం తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో చిత్తూరు జిల్లాలో ఉంది. అతి పురాతణ జలపాతాల్లో ఇదీ ఒకటి. ఈ గ్రామంలో వేదనారాయణ స్వామి దేవాలయం ఉంది. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో అవతరించాడు. తిరుపతి నుండి 70కిమీలు, చెన్నై నుండి 70కిమీలు మరియు బెంగళూరు నుండి 260కిమీల దూరంలో ఉంది.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

లేపాక్షి

అనంతపురం జిల్లాలోని లేపాక్షి చారిత్రత్మాక పట్టణము. లేపాక్షిలోని వీరభద్రుని ఆలయాన్ని క్రీ. శ 15, 16 వ శతాబ్ది మధ్యకాలములో విజయనగర ప్రభువు అచ్యుతరాయల కాలములో పెనుకొండ సంస్థానంలో కోశాధికారిగా వున్న విరూపణ్ణ కట్టించినట్లు చరిత్రలో ఉంది. లేపాక్షి ప్రవేశ ద్వారంలో అతి పెద్ద ఏక శిలానంది మరియు గుడిలో తైలవర్ణ చిత్రాలు, ఏడుపడగల సర్పం, వ్రేళాడే స్తంభం ఇంకా ఎన్నో అద్భుతమైన శిల్పకలావిష్కరణలు చూడవచ్చు. బెంగళూరు నుండి 120కిమీల దూరంలో ఉంది. హైదరాబాదు బెంగళూరు జాతీయ రహదారి మీద కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రదేశం నుండి 16కిమీల దూరంలో లేపాక్షి ఉంది. ప్రతి ఏటా లేపాక్షి ఉత్సవాలు జరుగుతాయి.

రాయలసీమలో రోడ్ ట్రిప్స్

గండికోట

కడప జిల్లాలో జమ్మలమడుగు నుంచి 14 కిలోమీటర్ల దూరంలో పెన్నా నది ఒడ్డున వెలసిన గండికోట ప్రాంతాన్ని గిరిదుర్గం అని కూడా అంటారు. కోట మీద నుండి చూస్తే 300 అడుగుల లోతులో 250 అడుగులు వెడల్పుతో పెన్నా నది కనిపిస్తుంది. ముందుగా జమ్మలమడుగు చేరుకుని అక్కడ నుండి గండికోటకు వెళ్లవచ్చు.

Picture credit: Wiki Commons

English summary
Read In Telugu: 15 places that you must see in rayalaseema
Story first published: Friday, April 6, 2018, 18:17 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark