ఘోర ప్రమాదం; 150 మందికి పైగా మృత్యువాత, 100 మందికి గాయాలు

పాకిస్తాన్‌లో ఇంధన ట్యాంకర్ ప్రమాదంలో 150 మందికి పైగా మరణించగా, 100 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. బోల్తాపడిన ట్యాంకర్‌లోని ఫ్యూయల్ కోసం ఎక్కువ మంది వెళ్లడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.

By Anil

పాకిస్తాన్‌లో ఇంధన ట్యాంకర్ ప్రమాదంలో 150 మందికి పైగా మరణించగా, 100 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. బోల్తాపడిన ట్యాంకర్‌లోని ఫ్యూయల్ కోసం ఎక్కువ మంది వెళ్లడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. పెట్రోల్ కోసం వెళ్లి విలువైన ప్రాణాలను పోగొట్టుకున్నారు.

ఇంధన ట్యాంకర్ ప్రమాదం

పంజాబ్ రాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని పాకిస్తాన్‌లో ఉన్న బహ్వాల్‌పూర్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 150 మందికి పైగా మరణించగా, 100 మందికి పైగా తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

ఇంధన ట్యాంకర్ ప్రమాదం

బహ్వాల్‌పూర్‌లోని జాతీయ రహదారి మీద వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి రోడ్డు ప్రక్కకు ఒరిగిపోయి బోల్తాపడింది. ఇది గమనించిన సమీప గ్రామ ప్రజలు బకెట్లు, బిందెలతో లీక్ అవుతున్న పెట్రోల్ కోసం ఎగబడ్డారు.

ఇంధన ట్యాంకర్ ప్రమాదం

వీలైనంత వరకు ఎక్కువ పెట్రోల్ పట్టుకెళ్లేందుకు, అనేక మంది ఎగబడ్డారు. అయితే లారీ బోల్తాపడిన కేవలం పది నిమిషాలలోపే మంటలు చెలరేగి ట్యాంక్ మొత్తం పేలిపోయింది. ట్యాంకర్ పేలిన సంధర్భంలో ఎక్కువ మంది ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది.

ఇంధన ట్యాంకర్ ప్రమాదం

గాయబడిన వారిలో 80 శాతం కాలిన గాయాలతో హాస్పిటల్ చేరినట్లు తెలిసింది. హాస్పిటల్ సామర్థ్యం తక్కువగా ఉండటంతో అందిరికీ చికిత్సను అందివ్వడం కష్టంగా మారింది. 90 మందికి మాత్రమే బహ్వాల్ విక్టోరియా హాస్పిటల్‌ చికిత్స చేస్తున్నారు.

ఇంధన ట్యాంకర్ ప్రమాదం

రిపోర్ట్స్ ప్రకారం, ట్యాంకర్ బోల్తా పడిన ప్రదేశం పేదరికం ఎక్కువగా ఉన్నది కావడంతో, అక్కడి ప్రజలు ట్యాంక్ ద్వారా కలిగే ప్రమాదం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఇంధనం కోసం ఎగబడినట్లు తెలిసింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

దర్యాప్తు కూడా పూర్తయ్యింది కానీ మంటలు ఎలా చెలరేగాయో ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. సెల్ ఫోన్ రేడియేషన్ పెట్రోల్‌ను మండించే అవకాశం ఉంది. ఈ కారణంతోనే మంటలు చేలరేగి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ, పెట్రోల్ స్టేషన్‌లలో మొబైల్ వాడకండి. బోల్తా పడిన ట్యాంకర్ల వద్దకు అస్సలు వెళ్లకండి, పెట్రోల్ కన్నా ప్రాణాలే విలువైనవి కదా...!!

Most Read Articles

English summary
Read In Telugu: More Than 150 Were Killed And 100 Injured In Pakistan After Fuel Tanker Overturns And Explodes
Story first published: Monday, June 26, 2017, 17:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X