రోడ్డు ప్రమాదాలకు దారితీసే 25 కారణాలను వెల్లడించిన డ్రైవ్‌‌స్పార్క్

Posted By:

టెక్నాలజీ, ఆధునికత, అభివృద్ది అనే అంశాలు ఎన్ని కొత్త పుంతలు తొక్కినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని ఆపడం అనేది ఎవరి వలన కుదరడంలేదు. ఆపడం సంగతి అటుంచితే చాలా వరకు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కోలుకోలేని ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

అయితే ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఈ 25 ముఖ్య కారణాలుగా ఉన్నట్లు డ్రైవ్‌స్పార్క్ స్పష్టం చేసింది. ఈ కారణాలు నేడు క్రింది కథనం ద్వారా అందిస్తున్నాము.

1. మద్యం సేవించి వాహనం నడపడం

1. మద్యం సేవించి వాహనం నడపడం

మద్యం తాగితే మాంచి కిక్ వస్తుందనేది ఈ మద్య కాలం చాలా మందికి తెలుసు. అయితే ఇదే మద్యం త్రాగి డ్రైవింగ్ చేస్తే మానసికంగా సరిగ్గా ఉండరు. తద్వారా మత్తులో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం తెలిసిందేమిటంటే. మద్యం తాగడం మానేసే వారు ఎంతో ఉత్సాహంగా ఉంటూ రోడ్డు ప్రమాదాలకు దూరంగా ఉంటారని తెలిసింది.

02. మత్తు పదార్థాలు

02. మత్తు పదార్థాలు

ప్రమాదలకు కారణమవుతున్న వాటిలో మత్తు పదార్థాలు అనేది మరో పెద్ద కారణ. డ్రైవింగ్ సమయంలో మత్తు పదార్థాలను సేవించడం వలన తాజాగా ఉంటారు అనే కారణంతో తీసుకుంటారు. అయితే అది మెదడు మీద తీవ్ర ప్రభావం చూపించి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సరైన సృహను కోల్పోయి ప్రమాదాలకు దారితీస్తోంది.

03. సెల్‍ ఫోన్లు

03. సెల్‍ ఫోన్లు

అక్షరం ముక్క రాని వారు కూడా చెప్పేది. వాహనం నడిపేటప్పుడు ఫోన్ వాడొద్దు అని. కాని మా దారి మాది, మీ దారి మీది అనే వారు అలాగే చేస్తామంటారు. తద్వారా ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. వాహనాన్ని నడుపుతున్న సమయంలో ప్రక్కకు ఆపి టెక్ట్సింగ్ లేదా మాట్లాడం చేసిన తరువాత ప్రయాణం మొదలుపెడితే బాగుంటుంది.

04. అవధులు లేని వేగం

04. అవధులు లేని వేగం

మీ వాహనాన్ని అధిక వేగం వరకు తీసుకుపోవచ్చు. కాని ఆ అధిక వేగాన్ని ఉన్నట్లుండి తగ్గించాలంటే కుదరదు. కాబట్టి వేగాన్ని నిర్ధేషించుకుని ప్రయాణిస్తే బాగుటుంది.

05. నిర్లక్ష్యపు డ్రైవింగ్

05. నిర్లక్ష్యపు డ్రైవింగ్

ఒక్కోసారి కొంత మందికి ఏ విధంగా కూడా ముఖ్యమైన మరియు అత్యవసర పని లేకున్నప్పుడు విపరీతమైన వేగంతో ప్రయణిస్తుంటారు. అలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వారికి మాత్రమే కాకుండా వారికి సంభందం లేని వారికి కూడా ప్రమాదాలను కొని తెచ్చిపెడుతుంది.

06. ఇతరుల మీద కోపంతో

06. ఇతరుల మీద కోపంతో

డ్రైవింగ్ చేసే సమయంలో మనసు తేలిక చేసుకుని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఇతర డ్రైవర్ల మరియు ప్రయాణ సమయంలో ఇతర వాహనాల మీద పోటీగా చేసే చర్యలు వారికి మాత్రమే కాకుండా ఆ రోడ్డు వెంబడి వచ్చే ఎన్నో వాహనాలకు ప్రమాద కారకాలుగా మారుతాయి.

07.అనుభవ లేమి

07.అనుభవ లేమి

ఎక్కువ ప్రమాదాలు జరగడాని కారణం అయ్యే వాటిలో అనుభవ లేమి ఒకటి. చిన్నారయినా పెద్దలయినా డ్రైవింగ్‌లో అనుభవం అనేది తప్పకుండా ఉండాలి. అందుకోసం విశాలమైన మైదానాలలో ముందుగా డ్రైవింగ్ నేర్చుకోవాలి.

08. రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేయడం

08. రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేయడం

పగలు కన్నా రాత్రిళ్లు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఏకాగ్రతతో ఉండటం అవసరం. చూసే జ్ఞానం పగలు కన్నా రాత్రి వేళల్లో తక్కువగా ఉంటుంది. ఒక వేల రాత్రి సమయంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర మత్తు ఉన్నట్లయితే అప్పటికప్పుడు డ్రైవ్ చేయడం మానేసి కునుకు తీయడం ఎంతో మంచిది.

09. మంచు మరియు ఐస్

09. మంచు మరియు ఐస్

ఈ రెండు అధికంగా ఉన్న ప్రదేశాల్లో డ్రైవింగ్ చేయడాన్ని పూర్తిగా దూరం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మంచు కాలంలో ఇలాంటి పదర్థాల మీద గ్రిప్ చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో బ్రేకుల వేసినా మరియు టర్నింగ్ తీసుకోవాలన్నా కుదరదు టైర్లు జారిపోతుంటాయి. కాబట్టి ఇలాంటి ప్రదేశాలలో డ్రైవింగ్‌కు పూర్తి దూరంగా ఉండటం మంచిది.

11.మంచులో ప్రయాణించడం

11.మంచులో ప్రయాణించడం

దట్టమైన మంచు కురుస్తున్నపుడు డ్రైవింగ్ ఎంతో ప్రమాదకరమైనది. మంచు ఉండటం దగ్గరగా వెల్లేంత వరకు మనం ముందున్న వాటిని గుర్తింలేము. కాబట్టి తప్పనిసరి అయినపుడు తక్కువ వేగంతో వెళ్లాల్సి ఉంటుంది. ఈ మద్య చాలా వరకు కార్లకు మంచులే వెలిగే ఫాగ్ లైట్లను అందిస్తున్నారు.

12. సిగ్నల్స్ అతిక్రమించడం

12. సిగ్నల్స్ అతిక్రమించడం

అత్యవసరం పని లేదా ఆఫీసుకు లేటవుతుంది అనే కారణాలతో ఎంతో సిగ్నల్స్ వద్దన్నా కూడా వాటిని అతిక్రమించి వెళుతుంటారు. అదే సమయంలో వ్యతిరేక దిశలో వచ్చే వాహనాలతో ఢీ కొని ప్రమాదాలకు కారణమవుతున్నారు. కాబట్టి రోడ్డు సిగ్నల్స్ ఉన్నప్పుడు వాటిని అనుసరించడం ఎంతో ఉత్తమం.

 13. వ్యతిరేక దిశలో నడపడం

13. వ్యతిరేక దిశలో నడపడం

సాధారణంగా వన్ వే మరియు టూ వేలు ఉంటాయి. టూ వే రహదారుల్లో అపసవ్య దిశలో వెల్లడం అనేది చాలా తప్పు. ఇలా వెళ్లడం వలన కూడా చాలా వరకు ప్రమాదాలా చోటు చేసుకుంటున్నాయి.

14. కునుకు తీస్తూ డ్రైవింగ్ చేయడం

14. కునుకు తీస్తూ డ్రైవింగ్ చేయడం

సరిగ్గా నిద్రపోకపోవడం వలన చాలా మంది డ్రైవింగ్ చేసే సమయాల్లో కునుకు తీస్తుంటారు. గరిష్ట వేగంలో ఉన్నప్పుడు డ్రైవర్ కునుకు తీశాడంటే కారు కంట్రోల్ తప్పి ఎలా పడితే అలా వెళుతుంటుంది. ఎదయినా ఒకదానిని ఢీకొట్టేంత వరకు అది ఆగదు. కాబట్టి నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే వేడి టీ తాగడం లేదా ఓ రెండు గంటల పాటు కునుకు తీసి ప్రయాణాన్ని ప్రారంభించడం మేలు.

15. చెడు రోడ్లు

15. చెడు రోడ్లు

రోడ్లు బాగా అతుకులు గతుకులు పడినప్పుడు, ఎక్కువ మంది డ్రైవర్లు రోడ్డు మీద ఉన్న గతుకులు మరియు పాడైపోయిన రోడ్డును తప్పిస్తూ వెళుతుంటాడు. అలాంటప్పుడు డ్రైవర్ ఏకాగ్రత మొత్తం రోడ్డు మీద ఉన్న గతుకులు మరియు గుంతలను తప్పించే పనిలో నిమగ్నం అయి ఉంటాడు. తద్వారా ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించకుండా వాటిని వెళ్లి ఢీ కొడతారు. రోడ్డు ఎలా ఉన్నప్పటికి సరైన ఏకాగ్రత ఎంతో అవసరం.

16. వాహనాన్ని మెయింటెన్ చేసుకోలేక పోవడం

16. వాహనాన్ని మెయింటెన్ చేసుకోలేక పోవడం

ప్రయాణం ప్రారంభించే ముందు ప్రతి సారి కూడా ముఖ్య భాగాలైన బ్రేకులు వంటి వాటిని పరీక్షించుకుని వెల్లడం మంచింది. ఒక వేళ వేటినైనా మార్చాల్సి ఉన్నా లేదంటే సర్వీసింగ్ చేయించాల్సి ఉన్నప్పుడు అన్ని రిపేరి చేయించుకుని ప్రయాణం ప్రారంభించాలి. రోడ్డెక్కిన తరువాత తీరా బ్రేకులు పడకపోతే ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

17. రోడ్ల మీద రేసింగ్

17. రోడ్ల మీద రేసింగ్

రేసింగ్ కోసం ప్రత్యేకమైన రహదారులు ఉంటాయి. అలా కాకుండా చాలా మంది సాదారణ రోడ్ల మీద అతిక్రమంగా రేసింగ్ చేస్తుంటారు. వారి అనుభవానికి రోడ్లు సరిగా ఉండకపోవడం వలన ప్రమాదాలు సంభవిస్తాయి. కాబట్టి అలాంటి వాటిని ప్రోత్సహిచకుండా చర్యలు తీసుకోవాలి.

18. జంతువులు

18. జంతువులు

అడవి ప్రాంతాల గుండా ఉన్న రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు రహదారి మరియు దానికి ఇరువైపులా గమనిస్తూ వెళ్లడం మంచిది. జంతువులు రోడ్డు దాటుతున్న సమయంలో వాటిని ఢీ కొంటుంటారు.

19.వంకరగా ఉన్న రోడ్లు

19.వంకరగా ఉన్న రోడ్లు

ఇండియన్ రోడ్లు ముప్పైయ్యారు వంకరలను కలిగి ఉంటాయి. కొన్ని చోట్లు సూచిక గుర్తులు పెడతారు. మరి కొన్ని చోట్ల అలాంటివేమీ ఉండవు. తద్వారా అకస్మిక మలుపుల్లో ఎలా వెల్లాలో తెలియక ప్రమాదాలకు కారణం అవుతుంటారు. కాబట్టి రోడ్డు ముందు వైపు ఎలా ఉంటుందో అనే అంచనాలు వేసుకోవాలి మరి ఇలాంటి రోడ్ల మీద వేగాన్ని నియంత్రించుకుంటూ వెళ్లాలి.

20.రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు

20.రోడ్డు పనులు జరుగుతున్నప్పుడు

రహదారి పనులు జరుగుతున్నప్పుడు ట్రక్కులు, మెషీన్లు మరియు మనుషులు పని చేస్తుంటారు. ముందున్న వాటిని గుర్తించకుండా ప్రయాణం చేస్తు వాటిని వెళ్లి ఢీకొట్టడం అనేవి చాలా పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. కాబట్టి జాగ్రత్తగా సూచిక గుర్తులను గమనిస్తూ వెళ్లడం మంచిది.

21. కనీస దూరం పాటించడం

21. కనీస దూరం పాటించడం

మీ ముందు వాహనం వెళుతున్నప్పుడు కనీసం 10 మీటర్ల దూరం ఉండే విదంగా వెళ్లడం ఎంతో మంచిది. ఎందుకంటే ఎదురుగా వెళుతున్న వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగే వెంటే స్పందించే సమయం కాస్త ఉంటుంది. అలా కాకుండా ముందున్న వాహనాలను అంటిపెట్టుకుని వెళితే మీరు కూడా ప్రమాదాల బారిన పడతారు.

22. సూచనలు చేయకుండా దారులు మళ్లడం

22. సూచనలు చేయకుండా దారులు మళ్లడం

చాలా మంది ఇండికేటింగ్ లైట్లు వినియోగించకుండా రోడ్లు మారుతుంటారు. తద్వారా వెనుక వచ్చే వాహనం మనల్ని ఢీ కొట్టే ప్రమాదం ఉంది. కాబట్టి దారులను మారాలనుకుంటున్నప్పుడు గుర్తులు సూచించడం సంజ్ఞలు చేయడం వంటివి చేయాలి.

23. జంక్షన్లలో

23. జంక్షన్లలో

కూడళ్లు ఉన్నప్పుడు ముందున్న వాహనాలు వెళ్లిన తరువాత మీరు వెళ్లడానికి ప్రయత్నించండి. అలా కాకుండా జంక్షన్లలో ముందున్న వాహనాలను అధిగమించడానికి ట్రై చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

24. పరధ్యానంలో ఉండటం

24. పరధ్యానంలో ఉండటం

పరధ్యానంలో ఉంటూ డ్రైవ్ చేసే వారు చాలా వరకు ప్రమాదాలకు కారణం అవుతుంటారు. మనస్సు ఎక్కడో ఉంచుకుని పరధ్యానం చేస్తూ వాహనాన్ని నడుపుతుంటారు. కాబట్టి అలా చేయడం మానుకోండి.

25. టైర్లు

25. టైర్లు

టైర్లు బాగుంటే ప్రయాణం ఎంతో సాఫీగా ఉంటుంది. అవే టైర్ల యొక్క జీవితం అయిపోయినట్లయితే, అవి మీ ప్రాణాలను హరించివేస్తాయి. చాలా వరకు ఎండాకాలంలో వేడి వలన పగులుతున్నాయి. కాబట్టి ప్రయాణానికి ముందు టైర్లను చెక్ చేసుకుని వెళ్లడం ఎంతో మంచింది.

 
English summary
25 Reasons For Car Road Accidents How To Avoid Them
Story first published: Tuesday, May 3, 2016, 16:49 [IST]
Please Wait while comments are loading...

Latest Photos