పాకిస్తాన్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఐదు కార్లు ఇవే!

Written By:

ఇండియన్ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కార్లు, బైకులు మరియు స్కూటర్ల గురించి అనేక కథనాలు చదివి ఉంటారు. ఇలాంటి కథనాలు చూసిన ప్రతిసారి ఎప్పుడూ టాప్ లిస్ట్‌లో ఉన్న కార్లే దర్శనమిస్తుంటాయి.

అయితే మన పొరుగు దేశమైన పాకిస్తానీ దాయాదులు ఎలాంటి కార్లను వినియోగిస్తున్నారబ్బా అని ఆరా తీస్తే, వారు ఎక్కువగా ఎంచుకుంటున్న టాప్ 5 కార్ల వివరాలు తెలిశాయి. వాటి గురించి ఇవాళ్టి కథనంలో

చూద్దాం రండి...

పాకిస్తాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు

#5 సుజుకి వ్యాగన్ఆర్

మన మార్కెట్లో వ్యాగన్ఆర్ కారుకు లభించిన ఆదరణ పాకిస్తాన్‌లో లభించలేదనే చెప్పాలి. అత్యధికంగా అమ్ముడుపోతున్న తొలి ఐదు కార్ల జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. కానీ ఇండియన్ మార్కెట్లో వ్యాగన్ఆర్ మంచి ఫలితాలు సాధిస్తోంది. 2016 లో పాకిస్తాన్ దేశవ్యాప్తంగా 12,595 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2015తో పోల్చుకుంటే ఈ మోడల్ 100 శాతం వృద్ది సాధించింది.

పాకిస్తాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు

సుజుకి వ్యాగన్ఆర్ లో ప్రసిద్దిగాంచిన 1000సీసీ సామర్థ్యం ఉన్న కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ అందించింది. పాకిస్తాన్‌లో వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ ధర రమారమి పది లక్షల రుపాయలు ఎక్స్‌షోరూమ్‌గా ఉంది.

పాకిస్తాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు

#4 సుజుకి బోలన్

బోలన్ కారును పాకిస్తాన్ వెర్షన్ ఓమిని అని చెప్పవచ్చు. సుజుకి ఓమిని కారును ప్రవేశపెట్టిన తొలినాళ్లలో ఎంతో మంది ఫ్యాన్స్ ఉండేవారు. కాలక్రమంలో ఎన్నో ఉత్పత్తులు మార్కెట్లోకి రావడంతో ఓమిని సేల్స్ పడిపోయాయి. కానీ పాకిస్తాన్‌లో 2016 లో దేశవ్యాప్తంగా 15,000 యూనిట్ల వరకు అమ్ముడయ్యాయి.

పాకిస్తాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు

కొన్నేళ్ల క్రితం సుజుకి బోలన్ కార్ల విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. బోలన్ కారులో ఎలాంటి అప్‌గ్రేడ్స్ చేయకపోవడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. సుజుకి బోలన్ కారులో 797సీసీ సామర్థ్యం గల మూడు సిలిండర్ల ఇన్ లైన్ పెట్రోల్ ఇంజన్ కలదు.

పాకిస్తాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు

#3 హోండా సిటి మరియు సివిక్

పాకిస్తాన్‌లో హోండా విక్రయిస్తున్న సిటి మరియు సివిక్ కార్ల సేల్స్ వివరాలు కొన్ని కారణాల వలన విడివిడిగా లభించలేదు. 2016లో పాకిస్తాన్ దేశవ్యాప్తంగా సిటి మరియు సివిక్ కార్ల మొత్తం సేల్స్ 28,120 యూనిట్లుగా ఉన్నాయి.

పాకిస్తాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు

సివిక్ మరియు సిటి కార్ల ధరలు బోలాన్ మరియు వ్యాగన్ఆర్ లతో పోల్చితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ హోండా అట్లాస్ పేరుతో పాక్‌లో కార్యకలాపాలు చేస్తున్న జపాన్ దిగ్గజం అందుబాటులో ఉంచిన సివిక్ మరియు సిటి మంచి విక్రయాలు నమోదు చేస్తూ టాప్-3 లో నిలిచాయి.

పాకిస్తాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు

#2 సుజుకి మెహ్రాన్

అందరూ అనుకున్నట్లుగానే ఇండియాలో లభించే ఆల్టోనే పాకిస్తాన్‌లో మెహ్రాన్ పేరుతో లభ్యమవుతోంది. అయితే ప్రస్తుతం పాక్ విపణిలో ఉన్న మెహ్రాన్‌కి, మన మార్కెట్లో ఉన్న ఆల్టోతో పోల్చుకుంటే డిజైన్ పరంగా చాలా వెనుకబడింది. 1989 లో తొలిసారిగా పరిచయం చేసిన మోడల్‌నే ఇప్పటికీ విక్రయిస్తుండటం ఆశ్చర్యకరమైన విషయం.

పాకిస్తాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు

28 ఏళ్ల క్రితం పరిచయం చేసిన సుజుకి మెహ్రాన్ 2016లో పాకిస్తాన్ మొత్తం 28,036 యూనిట్ల వరకు అమ్ముడుపోయి, టాప్ 5 జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది.

పాకిస్తాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు

#1 టయోటా కరోలా

పాకిస్తాన్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న కారు ఏమైఉండవచ్చో అంచనా వేయడం కాస్త కష్టమే. తక్కువ ధరకు లభించే కార్లను ఎక్కువగా ఎంచుకుంటారని అనుకుంటాం. కానీ ఖరీదైన టయోటా కరోలా సెడాన్ టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచింది.

పాకిస్తాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు

నిజమే పాకిస్తాన్‌లో అన్నింటికంటే ఎక్కువగా కరోలాను ఎంచుకుంటున్నారు. 2016 లో 40,694 కరోలా కార్లను విక్రయించింది టయోటా. ఈ లెక్కన చూస్తే, ధరను ఏ మాత్రం లెక్క చేయకుండా నాణ్యత మరియు ఫీచర్లు ఉన్న కారుకు పట్టకడుతున్నారనే విషయం స్పష్టం అవుతుంది.

పాకిస్తాన్‌లో బెస్ట్ సెల్లింగ్ కార్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఏదేమయినప్పటికీ భారత్‌తో పోల్చుకుంటే పాకిస్తాన్ ఆటోమోటివ్ పరిశ్రమ ఏ మాత్రం సరితూగదు. ఆర్థికంగా బలపడుతున్న అభివృద్ది చెందుతున్న దేశాల్లో వాహన పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తోంది. దేశీయంగా భారీ విక్రయాలతో పాటు విదేశాలకు ఎగుమతి చేస్తోంది ఇండియన్ ప్యాసింజర్ కార్ల విభాగం. భారత వాహన పరిశ్రమ శరవేగంగా దుసుకుపోతోందనడానికి ఈ వివరాలే నిదర్శనం.

Source

English summary
Read In Telugu 5 Best Selling Cars In Pakistan

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark