ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

Written By:

భారత రాజకీయ నాయకులు కార్లలో తిరగడానికి బాగానే ఇష్టపడతారు, బ్యూటిఫుల్ మరియు స్టైలిష్ కార్లను ఎంచుకోవడానికి ఎక్కువ ఆసక్తిచూపినప్పటికీ భద్రత కోసం ఆ వైపు వెల్లరు. ప్రతి రాజకీయ నాయకునికి అనుచరులతో పాటు ప్రత్యర్థుల ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి విలాసవంతమైన కార్లకు బదులుగా శక్తివంతమైన, విశాలమైన మరియు ఆధునిక హంగులతో కూడిన ఎస్‌యువిలను ఎంచుకుంటారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మిత్సుబిషి పజేరో

మిత్సుబిషి పజేరో

జపాన్‌కు చెందిన మిత్సుబిషి కేవలం ఎస్‌యువిలను మాత్రమే అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం దేశీయంగా ఉన్న అత్యుత్తమ ప్రీమియమ్ ఎస్‌యువిలలో పజేరో ఒకటి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జె జయలలిత గారికి మరియు అఖిలేష్ యాదవ్ కు ఈ వాహనం అంటే అమితమైన ఇష్టం.

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

మిత్సుబిషి త్వరలో దీనిని క్రాసోవర్ శైలిలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ప్రస్తుతం మిత్సుబిషి డీలర్ల వద్ద ఉన్న పజేరో ఎస్‌యువిలో 2.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ కలదు. ఏడు మంది కూర్చునే సామర్థ్యం గల ఇది గరిష్టంగా 176బిహెచ్‌పి పవర్ మరియు 350ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మూడు వేరియంట్లలో లభించే దీని ప్రారంభ ధర రూ. 27.39 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉంది.

ఆడి క్యూ7

ఆడి క్యూ7

ఆడి క్యూ7 ఎస్‌యువిని ఇండియన్ పొలిటీషియన్స్ అరుదుగానే ఎంచుకుంటున్నారు. ఇందులోని ఫీచర్ల పరంగా చూస్తే సరసమైన ఎస్‌యు అని నిక్కచ్చితంగా చెప్పవచ్చు. అత్యుత్తమ ఇంటీరియర్ ఫీచర్లతో పాటు అతి ముఖ్యమైన భద్రత ఫీచర్లు కూడా ఉన్నాయి. స్టీల్ మరియు అల్యూమినియం లోహాలతో ధృడమైన బాడీతో క్యూ7 ని నిర్మించింది ఆడి.

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

ఆడి ఇండియా క్యూ7 ఎస్‌యువిని ప్రీమియమ్ ప్లస్ మరియు ప్రీమియమ్ ప్యాక్ అనే రెండు వేరియంట్లతో అందుబాటులో ఉంచింది. ఇందులో 245బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 3.0-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. రెండు వేరియంట్లు కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించును. ఫోర్ వీల్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించే క్యూ7 ప్రారంభ ధర రూ. 72.90 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

భారత దేశపు దిగ్గజ ఎస్‌యువి వాహన తయారీ సంస్థగా పేరుగాంచి మహీంద్రా అండ్ మహీంద్రా 2002 లో దేశీయంగా స్కార్పియో ఎస్‌యువిని విడుదల చేసింది. అప్పటి నుండి అనేక రాజకీయ వేత్తలకు ఫేవరెట్ ఎస్‌యువిగా నిలిచింది. అనేక రూపాల్లో మోడిఫికేషన్లకు కూడా గురైంది. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కూడా ఈ మేడిన్ ఇండియా స్కార్పియోనే వినియోగించారు.

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

మహీంద్రా ఈ స్కార్పియోను ఇప్పటి వరకు విభిన్న స్పెషల్ ఎడిషన్‌గా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మహీంద్రా స్కార్పియో 2.0, 2.2 మరియు 2.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. ఈ మధ్యనే స్కార్పియోలో హైబ్రిడ్ పరిజ్ఞానాన్ని కూడా పరిచయం చేసింది. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే స్కార్పియో ధరల శ్రేణి రూ. 9.56 నుండి 15.48 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

టయోటా ఫార్చ్యూనర్

టయోటా ఫార్చ్యూనర్

భద్రత మరియు డిజైన్ పరంగా పోర్షే, బిఎమ్‌డబ్ల్యూ మరియు మెర్సిడెస్ బెంజ్ ఉత్పత్తులతో పోటీపడే ఈ ఫార్చ్యూనర్ దేశీయంగా భారీ విజయాన్ని అందుకుంది. ఎమ్‌ఎల్ఎ నుండి కేంద్ర మంత్రుల వరకు అందరూ దీనినే ఎక్కువగా ఎంచుకుంటున్నారు.

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

20015 లో టయోటా ఈ ఫార్చ్యనర్‌ని పరిచయం చేసింది. ఇందులో పవర్ విండోలు, పవర్ డోర్ లాక్స్, పవర్ స్టీరింగ్, ట్రాక్షన్ కంట్రోల్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగులు, అల్లాయ్ వీల్స్ మరియు చైల్డ్ సేఫ్టీ లాక్స్ వంటి అనేక భద్రత ఫీచర్లు ఉన్నాయి.

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

2016 లో ఫార్చ్యూనర్ అప్‌గ్రేడెడ్ వర్షన్ ను విడుదల చేసింది. ఇందులో పెట్రోల్ వేరియంట్ కూడా పరిచయం అయ్యింది. ఫార్చూనర్‌లో 2.8-లీటర్ సామర్థ్యం గల డీజల్ మరియు 2.7-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌లు కలవు. మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే వీటిలో 2-వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌ కూడా కలదు. పెట్రోల్ ఫార్చ్యూనర్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 25.92 లక్షలు మరియు డీజల్ ఫార్చ్యూనర్ ధర రూ. 27.52 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

 రేంజ్ రోవర్ ఎవోక్

రేంజ్ రోవర్ ఎవోక్

కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీ దీనిని తరచూ వినియోగిస్తుంటారు. ఈమెలాగే అనేక మంది ఇండియన్ పొలిటీషియన్స్ ఎవోక్ ఎస్‌యువిని ఎంచుకుంటారు. స్పోర్టివ్ శైలిలో, విశాలమైన బాడీ, బ్రాండ్ విలువ వంటి అనేక అంశాల ఆధారంగా దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది.

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

భద్రత పరంగా రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యువిలో ట్రాక్షన్ కంట్రోల్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ, ఫాగ్ ల్యాంప్స్, ముందు మరియు వెనుక వైపున పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రోగ్రాం వంటి సేఫ్టీ ఫీచర్లున్నాయి.

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

ల్యాండ్ రోవర్ కు చెందిన రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్‌యువి ఒక పెట్రోల్ మరియు నాలుగు డీజల్ వేరియంట్లలో లభించును. వీటిలో 2.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ కలదు. పెట్రోల్ వేరియంట్ ధర రూ. 53.20 లక్షలు మరియు డీజల్ ఎవోక్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 49.10 లక్షలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

మహీంద్రా థార్

మహీంద్రా థార్

మహీంద్రా అండ్ మహీంద్రా ఈ థార్ వాహనాన్ని 2010 అక్టోబర్ 4 న దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. భారత దేశపు టాప్ 10 ఎస్‌యువి జాబితాలో కూడా చోటు సంపాదించింది. 7-సీటింగ్ సామర్థ్యం ఉన్న దీనిని 2-సీటర్‌గా కూడా మార్చుకోవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ దీనిని వినియోగిస్తున్నారు.

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

2-వీల్ మరియు 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ ఆప్షన్‌లతో లభించే ఇందులో 2.5-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ కలదు. లీటర్‌కు 13 కిమీల మైలేజ్ ఇవ్వగల దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.93 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

టాటా సఫారీ

టాటా సఫారీ

భారత దేశపు పురాతణ ఎస్‌యువిలలో టాటా సఫారీ ఒకటి. ఎన్ని ఎస్‌యువిలు విడుదలైనా సఫారీ ఇప్పటికీ అమ్మకాల్లో ఉంది నగరాల్లో నివసించే మధ్యతరగతి యంగ్ కస్టమర్లు దీనిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దేశీయ పరిజ్ఞానంతో టాటా మోటార్స్ ఈ సఫారీ ని స్టార్మ్ అనే పేరుతో అనేక అప్‌డేట్స్ నిర్వహించి మార్కెట్లోకి విడుదల చేసింది.

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

సఫారీ మరియు సఫారీ స్టార్మ్ వేరియంట్లు 2.2-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్‌తో అందుబాటులో ఉన్నాయి. మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే సఫారీ మరియు సఫారీ స్టార్మ్ ప్రారంభ వేరియంట్ ధర లు వరుసగా రూ. 9.67 మరియు 10.51 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

జయలలిత గారి ఒకప్పటి ప్రపంచం ఇదే...!!

అప్పటి నుండి ఇప్పటి నుండి ఇప్పటి వరకు.... తమిళ దివంగత ముఖ్యమంత్రి జయలలిత కారు కలెక్షన్

ఇండియన్ పొలిటీషియన్స్‌ అతిగా ఇష్టపడే ఏడు ఎస్‌యువిలు

మేడిన్ ఇండియా మంత్రాన్ని జపించే మోడీగారికి విదేశీ కారెందుకు?

మేక్ ఇన్ ఇండియా మరియు మేడిన్ ఇండియా అనే మంత్రాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తున్న భారత గౌరవ ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ గారు విదేశీ సంస్థలకు చెందిన బిఎమ్‌డబ్ల్యూ కారునెందుకు ఉపయోగిస్తున్నాడు ?

 
English summary
Also Read In Telugu: 7 Favorite SUVs of Indian Politicians
Story first published: Tuesday, January 17, 2017, 14:14 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark