లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

లగ్జరీ కార్లు మరియు బైకులకు మార్కెట్లో ఎక్కువ క్రేజ్ ఉంది. వీటిని ఎక్కువగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు మరియు రాజకీయ నాయకులు కొనుగోలు చేస్తుంటారు. లగ్జరీ కార్లు మరియు బైకుల ధరలు అధిక మొత్తంలో ఉండటం వల్ల సామాన్య ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపరు.

కానీ ఎక్కువమంది సెలబ్రెటీలు కొనుగోలు చేసిన చాలా లగ్జరీ కార్ల గురించి మునుపటి కథనాల్లో తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా ఇదే నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్' కొనుగోలు చేసిన కొత్త లగ్జరీ కారు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

'అర్జున్ కపూర్' పరిచయం అవసరంలేని బాలీవుడ్ స్టార్. ఎందుకంటే యితడు హీరోగా మాత్రమే కాకుండా అసిస్టెంట్ ప్రొడ్యూసర్ మరియు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసారు. యితడు ఇషాక్ జాదే వంటి సినిమా వల్ల బాగా ప్రాచుర్యం పొందాడు.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

ఇక బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్' కొనుగోలు చేసిన కొత్త కారు విషయానికి వస్తే, ఇది జర్మనీ లగ్జరీ వాహన తయారీ సంస్థ అయిన మెర్సిడెస్ బెంజ్ యొక్క Mercedes-Maybach GLS 600 (మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600). ఈ కారుని ముంబైకి చెందిన డీలర్ ద్వారా అర్జున్ కపూర్‌కు డెలివరీ చేయబడింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

మెర్సిడెస్ బెంజ్ యొక్క మేబాచ్ మోడల్ ఈ సంవత్సరం ప్రారంభంలో దేశీయ మార్కెట్లో రూ. 2.43 కోట్ల ధరతో ప్రారంభించబడింది. 2021 కి 50 యూనిట్లు మాత్రమే కేటాయించబడ్డాయి. మెర్సిడెస్ బెంజ్ 2022 లో షెడ్యూల్ చేయబడిన యూనిట్ల కోసం రెండవ దశ బుకింగ్‌ను ప్రారంభించింది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

అర్జున్ కపూర్ ఇటీవల ఈ ఏడాది ఏప్రిల్‌లో సరికొత్త Land Rover Defender (ల్యాండ్ రోవర్ డిఫెండర్) ఎస్‌యూవీని కూడా కొనుగోలు చేశారు. ల్యాండ్ రోవర్ డిఫెండర్ అంతర్జాతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా భారతీయ మార్కెట్లో కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన మోడల్.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

ప్రపంచంలో అత్యంత ఖరీదైన Maserati Levante (మసెరాటి లెవాంటే) ఎస్‌యూవీని కొనుగోలు చేసిన మొదటి భారతీయ నటుడు కూడా అర్జున్ కపూర్. దీన్ని బట్టి చూస్తే అర్జున్ కపూర్ కి లగ్జరీ కార్లపై ఉన్న మక్కువ ఏమిటో అర్థమవుతుంది. అంతే కాకుండా యితడు Audi (ఆడి) బ్రాండ్ యొక్క క్యూ 5 ఎస్‌యూవీని కూడా కలిగి ఉన్నాడు.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

అర్జున్ కపూర్ ఇప్పుడు కొనుగోలు చేసిన కొత్త మెర్సిడెస్-మేబాచ్ GLS 600 SUV విషయానికి వస్తే, ఈ లగ్జరీ SUV మోడల్‌లో ఒకే ఒక వేరియంట్ ఉంది, కానీ కస్టమర్ డిమాండ్ ప్రకారం 4-సీటర్ లేదా 5 సీటర్ మోడల్స్ కొనుగోలు చేయవచ్చు. ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండి, వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

మేబాచ్ GLS 600 అత్యంత అధునాతన సదుపాయాలు కలిగిన కార్ల శ్రేణిలో ఒకటిగా నిలుస్తుంది. అధునాతన సాంకేతికత మరియు అనేక సాంకేతిక సౌకర్యాలు ఇందులో ప్రామాణికంగా అందుబాటులో ఉన్నాయి. ఇది ఇంటీరియర్ మాత్రమే కాకుండా అద్భుతమైన ఎక్స్టీరియర్ డిజైన్ కూడా కలిగి ఉంటుంది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

ఈ ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలో పెద్ద 22 ఇంచెస్ లేదా 23 ఇంచెస్ బ్రష్డ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, అంతే కాకుండా ఇందులో డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన విండో పిల్లర్స్ మరియు రూఫ్, ‘మేబాచ్' బ్రాండ్ లోగో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

ఈ కారులోని ప్రతి సీటులో వెంటిలేటర్ మరియు మసాజ్ ఫంక్షన్ ఉంటాయి, ఆడియో, క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, సన్‌షేడ్స్ మరియు నావిగేషన్ ప్రతి సీటులో ఉంటాయి. వెనుక భాగంలో రిఫ్రిజిరేటర్ కూడా ఉంది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 లో 12.3 ఇంచెస్ ఎంబియుఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బర్మీస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ ఆప్టికల్ ఫైబర్ యాంబియంట్ లైటింగ్, డాష్‌బోర్డ్‌లో నాప్ప లెదర్ వంటివి కూడా ఉన్నాయి. దీనికి లేటెస్ట్ మెర్సిడెస్ మి కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇవ్వబడింది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

మేబాచ్ జిఎల్‌ఎస్ 600 యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 8 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ సిస్టమ్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్ మరియు ప్రీ-సేఫ్ సిస్టమ్ ఇవ్వబడ్డాయి. వీటితో పాటు పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్, మసాజ్ సీట్ మరియు రిఫ్రిజిరేటర్ వంటివి ఉన్నాయి.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో 4.0-లీటర్ వి 8 ఇంజిన్‌ ఉంటుంది. ఇది 542 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 9 జి ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇది ఈక్యూ బూస్ట్ స్టార్టర్ జెనరేటర్‌తో జతచేయబడుతుంది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ 'అర్జున్ కపూర్'; ధర అక్షరాలా రూ. 2.43 కోట్లు

ఎస్‌యూవీ కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ఎస్‌యూవీ బరువు మొత్తం 3,250 కిలోలు. అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలు కలిగి ఉన్నందున దేశీయ మార్కెట్లో ఈ కొత్త లగ్జరీ కారుకి విపరీతమైన డిమాండ్ ఉంది.

Most Read Articles

English summary
Actor arjun kapoor buys new mercedes maybach gls600 luxury suv check here details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X