సాహో మూవీలో ప్రభాస్ సవారీ చేస్తున్న బైక్ ఇదే

సాహో షూటింగ్‌లో ప్రభాస్ ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకు మీద కనబడ్డాడు. సాహో యాక్షన్-థ్రిల్లర్ మూవీ కావడంతో ఈ బైకు మీద చేజింగ్ చేసే సన్నివేశాలను తెరకెక్కిస్తుండవచ్చని చిత్ర సీమ నిపుణులంటున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి సినిమాతో ప్రభాస్ హాలీవుడ్ నటుల స్థాయికి ఎదిగిపోయాడు. బాహుబలి సిరీస్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకోవడంతో తన తరువాత సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

ప్రభాస్ ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

అవును, ప్రభాస్ తర్వాత చిత్రం కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ఇప్పుడు సాహో అనే యాక్షన్-థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో ప్రభాస్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు బిజీగా ఉన్నారు.

ప్రభాస్ ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

సాహో షూటింగ్‌లో ప్రభాస్ ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకు మీద కనబడ్డాడు. సాహో యాక్షన్-థ్రిల్లర్ మూవీ కావడంతో ఈ బైకు మీద చేజింగ్ చేసే సన్నివేశాలను తెరకెక్కిస్తుండవచ్చని చిత్ర సీమ నిపుణులంటున్నారు.

ప్రభాస్ ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్ మీద ప్రభాస్ షూటింగ్‌లో ఉన్నపుడు తీసిన కొన్ని ఫోటోలు ఇటీవల రహస్యంగా లీక్ అయ్యాయి. సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

ప్రభాస్ ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రంలో బాలీవుడ్ తార శ్రద్దా కపూర్ కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర నిర్మాణం దుబాయ్‌లో జరుగుతోంది. సాహో చిత్రంలోని చేజింగ్ సన్నివేశాల చిత్రీకరణలో ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకును ఉపయోగిస్తున్నారు. షూటింగ్ కోసం ట్రాక్ మీద పొజిషన్‌లో ఉన్న బైకును ఫోటోలలో గమనించవచ్చు.

ప్రభాస్ ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

బైక్ విషయానికి వస్తే, ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ స్ట్రీట్ ఫైటర్ బైకు 2017లో మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. మునుపటి మోడల్ కంటే పవర్ అవుట్‌పుట్ మరింత మెరుగుపడింది. డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే, రీడిజైన్ చేయబడిన ఛాసిస్ మరియు ఇంజన్‌లు ఉన్నాయి.

ప్రభాస్ ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

సాంకేతికంగా ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకులో 765సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 121బిహెచ్‌పి పవర్ మరియు 77ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 2019 మోటో2 ఈవెంట్లో కూడా ఈ ఇంజన్ గల బైకు పాల్గొననుంది. ఇదే మోడల్ ఆధారంతో వచ్చిన స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ మోటార్‌సైకిల్‌ను కూడా ట్రయంప్ విక్రయిస్తోంది.

ప్రభాస్ ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ స్ట్రీట్-ఫైటర్ యొక్క టాప్ స్పెక్ వేరియంట్, ఇందులో అత్యుత్తమ పనితీరును కనబరిచే అత్యాధునిక విడి భాగాలు ఉన్నాయి. ఈ బైకులో బ్రెంబో ఎమ్50 బ్రేకులు, ముందు వైపున బిగ్ పిస్టన్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ఓహ్లిన్స్ మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. అదే విధంగా 5-అంగుళాల పరిమాణంలో ఉన్న ఫుల్-కలర్ టిఎఫ్‌టి డిస్ల్పే కలదు.

ప్రభాస్ ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రభాస్ కెరీర్లోనే మైలురాయిగా నిలిచే సాహో చిత్రంలో స్వయంగా హీరో ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకును వినియోగిస్తున్నాడంటే... ఇక మార్కెట్లో దీని మీద వచ్చే క్రేజ్ అంతా ఇంత కాదు. ప్రస్తుతం, సాహో చిత్రం మీద ఇటు అభిమానుల్లో... అటు పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ ధర రూ. 10.55 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. సాహో చిత్రంలో ప్రభాస్ మరియు ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ చేజింగ్ సన్నివేశాల కోసం రిలీజ్ వరకు వేచిచూడక తప్పదు.

Most Read Articles

English summary
Read In Telugu: Actor Prabhas Spotted On A Triumph Street Triple RS During Movie Shoot
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X