హీరో 'విజయ్'కి ఫైన్ వేసిన చెన్నై పోలీసులు.. కారణం ఇదే

భారతదేశంలో మోటారు వాహన చట్టం కఠినంగా అమలులో ఉంది. కావున మోటార్ వాహన చట్టానికి వ్యతిరేఖంగా నడుచుకునే ఎవరికైన కఠినమైన చర్యలు తప్పవు. అది సామాన్య పౌరులకైనా.. సెలబ్రెటీలకైనా. ఇటీవల సౌత్ ఇండియన్ మూవీ స్టార్ విజయ్‌కి పోలీసులు జరిమానా విధించారు.

కేవలం తమిళంలో మాత్రమే కాకుండా, తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న 'విజయ్' ఇటీవల రూ. 500 ఫైన్ కట్టారు. విజయ్ ప్రయాణించే టయోటా ఇన్నోవాలో టింటెడ్ గ్లాస్ కలిగి ఉండటం వల్ల చెన్నై పోలీసులు ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో అల్లు అర్జున్ కూడా ఈ కారణమగానే రూ.700 ఫైన్ కట్టారు.

హీరో విజయ్కి ఫైన్ వేసిన చెన్నై పోలీసులు

నిజానికి భారతీయ నిబంధనల ప్రకారం ఏ కారుకైన టింటెడ్ గ్లాస్ కలిగి ఉండటం నేరం. ఈ నియమాలు గతంలోనే అధికారికంగా వెల్లడయ్యాయి. కానీ ఇప్పటికి కూడా చాలామంది ఈ టింటెడ్ గ్లాస్ కలిగిన కార్లను ఉపయోగిస్తున్నారు. ఇందులో ఎక్కువమంది సెలబ్రెటీలు ఉండటం గమనార్హం. సెలబ్రెటీలు ఎక్కువగా ఈ టింటెడ్ గ్లాస్ కలిగిన కార్లను ఉపయోగించడానికి ప్రధాన కారణం వారి ప్రైవసీ మరియు సేఫ్టీ అని తెలుస్తోంది.

చెన్నై పోలీసులు హీరో విజయ్ యొక్క టయోటా ఇన్నోవా టింటెడ్ గ్లాస్ తొలగించరా.. లేదా అనే దాని మీద ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. నిజానికి సెలబ్రెటీలకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. కావున వీరు పబ్లిక్ లో సాధారణ పౌరులు మాదిరిగా తిరగలేరు. కావున వారు ఇలాంటి టింటెడ్ గ్లాస్ కలిగిన కార్లను ఉపయోగిస్తారు. అయితే టింటెడ్ గ్లాస్ వాహనాలు వారిని గోప్యంగా ఉంచవచ్చు, కానీ అది చట్ట విరుద్ధం.

టింటెడ్ గ్లాస్ కలిగిన కార్లలో చాలా అక్రమాలు జరిగే అవకాశం ఉందని, ప్రభుత్వం పూర్తిగా ఈ టింటెడ్ గ్లాసులను నిషేధించింది. అంతే కాకూండా దేశంలో ప్రధాన మంత్రితో సహా భారతదేశంలోని ఏ రాజకీయ నాయకుడు కూడా తమ వాహనంపై సైరన్లు వంటి వాటిని ఉపయోగించకూడదు. గతంలో దీనికి విరుద్ధంగా నడుచుకున్న చాలా మంది రాజకీయ నాయకులకు గతంలో జరిమానాలు విధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

భారతదేశంలో ఢిల్లీ, ముంబై మరియు బెంగళూరు వంటి నగరాల్లో ట్రాఫిక్ నియమాలు మరింత కఠినంగా ఉన్నాయి. ఇందులో భాగంగానే రెండవ వరుసలో ఉన్న ప్రయాణికులు కూడా తప్పని సరిగా సీట్ బెల్ట్ కలిగి ఉండాలని నియమం అమలులోకి వచ్చింది, అంతే కాకుండా రానున్న రోజుల్లో ప్రతి కారు కూడా ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉండాలని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇవన్నీ కూడా ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరుస్తాయి.

ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల జాబితాలో భారతదేశం కూడా ఒకటి. కావున భారతదేశమో రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అహర్నిశలు పాటుపడుతున్నాయి. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియమాలను కఠినతరం చేస్తున్నారు. దీనితోపాటు కార్లలో జరిగే అమానుషాలను అరికట్టడానికి ఈ టింటెడ్ గ్లాస్ విధానం రద్దు చేశారు. ఇవన్నీ కూడా తప్పకుండా వాహన వినియోగదారులు గుర్తించి మసలుకోవాలి.

టింటెడ్ గ్లాస్ వినియోగంపై మా అభిప్రాయం:

టింటెడ్ గ్లాస్ ఉపయోగించే కారు లోపల జరిగే కార్యకలాపాలు బయటకు కనిపించే అవకాశం లేదు, ఈ ధైర్యంతోనే ఇలాంటి కార్లలో చాలా దారుణాలు జరుగుతాయి. ఇలాంటి దారుణాలను దృష్టిలో ఉంచుకుని టింటెడ్ గ్లాస్ వినియోగాన్ని పూర్తిగా నిరోధించారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడంతో పాటు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మారియు కొత్త బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Actor vijay fined by chennai traffic police for using sun film on car window
Story first published: Saturday, November 26, 2022, 13:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X