అమాలా పాల్ కూడా అదే తప్పు చేసింది!!

Written By:

ఉన్నోడికైనా... లేనోడికైనా... డబ్బు ఎవరికైనా ఒకే విలువ. ఆఫర్లతో కాస్తంత డిస్కౌంట్ లభిస్తోందంటే ఎవ్వరూ వెనక్కి తగ్గరు. కానీ బాగా ఉన్నోళ్లు కూడా ట్యాక్సులు ఎగ్గొట్టి లైఫ్ గడిపేయాలని చూస్తారు. ఇలాంటి ఘటనలో కేరళ నటి అమలా పాల్ అబాసుపాలయ్యింది.

అసలేం జరిగిందో చూద్దాం రండి...

To Follow DriveSpark On Facebook, Click The Like Button
అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

దక్షిణ భారత సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన కేరళ హీరోయిన్ అమలా పౌల్ తాజాగా మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెలూన్ డబ్ల్యూ222 లగ్జరీ కారును కొనుగోలు చేసింది. అయితే, ఈమె నకిలీ రిజిస్ట్రేషన్‌తో ట్యాక్స్ ఎగ్గొట్టిందని కేరళలోని మాతృభూమి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

Recommended Video
[Telugu] 2018 Bentley Continental GT Revealed - DriveSpark
అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

నకిలీ అడ్రస్‌తో పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని రూ. 20 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టిందనే ఆరోపణ మేరకు కేరళ రవాణా శాఖ అధికారులు అమలా పాల్ కారు రిజిస్ట్రేషన్‌ మీద దర్యాప్తు చేసారు.

అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

ఇది ఎలా సాధ్యమైంది...?

అమలా పాల్ ఆగష్టు 4, 2017 న మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లగ్జరీ సెడాన్ కారును చెన్నై డీలర్ వద్ద కొనుగోలు చేసింది. ఈ కారుకు ఆగష్టు 9 న పుదుచ్చేరిలోని నకిలీ అడ్రస్‌ మీదుగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆ పత్రిక ఆరోపించింది.

అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

రూ. 1.15 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ ఎస్-క్లాస్ కారుకు పుదుచ్చేరిలో రోడ్ ట్యాక్స్ రూ. 1.5 లక్షల రుపాయలు. అయితే, ఇదే కారుకు కేరళలో రోడ్ ట్యాక్స్ రూ. 23 లక్షలుగా ఉంది.

అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

పుదుచ్చేరి లేదా... మరే ఇతర రాష్ట్రంలోనైనా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే, వారు ఆ రాష్ట్రంలో ఉంటున్నట్లు చిరునామా పొందుపరచాల్సి ఉంటుంది. అయితే కేరళలో నివాసముండే అమలా పాల్ నకిలీ చిరుమానాతో రిజిస్ట్రేషన్ చేయించుకుంది.

అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

చాలా మంది ట్యాక్స్ భారం తగ్గించుకునేందుకు నకిలీ చిరునామాతో పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ కోసం క్యూ కడుతుంటారు. అందరిలాగే అమాలా పాల్ పుదుచ్చేరిలో ఓ విద్యార్థి పేరు మీద నకిలీ చిరుమానాతో కారు రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కుటోంది

Trending On DriveSpark Telugu:

నీది రాజకీయమైతే, నాది డ్యూటీ: హ్యాట్స్ ఆఫ్ టు తెలంగాణ పోలీస్

చిరంజీవి ఫ్యామిలీ కార్ కలెక్షన్!!

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి జీతమెంతో తెలుసా...?

అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

లగ్జరీ కార్ల రిజిస్ట్రేషన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పుదుచ్చేరి

మిగతా అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే పుదుచ్చేరిలో రోడ్ ట్యాక్స్ చాలా తక్కువ. అందుకే లగ్జరీ కార్లను కొనుగోలు చేసే ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ కోసం కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి క్యూ కడతారు.

అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

ఇండియాలో ఏ రాష్ట్రానికి చెందిన వారైనా తమ కార్లను పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరియు అలాంటి కార్లు పుదుచ్చేరిలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో 11 నెలల వరకు తిరగవచ్చు. 11 నెలలు దాటితో కారు తిరుగుతున్న ఆ రాష్ట్రానికి రోడ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

ఉదాహరణకు: విజయవాడలో కొనుగోలు చేసిన కారుకు పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించి, తరువాత హైదరాబాద్ నగరంలో 11 నెలల పాటు వ్యక్తిగత వాహనంగా ఉపయోగించినట్లయితే, 11 నెలల తరువాత అదే సిటీలో కొనసాగాలంటే తెలంగాణ ప్రభుత్వానికి రోడ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.

అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

అయితే, చాలా మంది లగ్జరీ కార్ల ఓనర్లు ఇలా చేయరు. ట్యాక్స్ తగ్గించుకోవడానికి పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఎంత కాలమైన ఇతర రాష్ట్రాల్లో వాడుకుంటూ ఉంటారు. ఇక మీదట మీరెప్పుడైనా లగ్జరీ కార్ల మీద PY తో ప్రారంభమయ్యే రిజిస్ట్రేషన్ బోర్డ్‌ను చూసినట్లయితే, వారంతా లగ్జరీ ముసుగులో ట్యాక్స్ ఎగ్గొడుతున్నారను భావించండి.

అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

నిద్రలేస్తున్న ఆర్‌టిఓ అధికారులు. గతంలో ఇలాంటి కార్లను ఆర్‌టిఓ అధికారులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే, ఇలా ట్యాక్స్ ఎగ్గొడుతున్న వారి కార్లను సీజ్ చేస్తున్నారు. ఈ మధ్యనే బాలీవుడ్ ప్రొడ్యూసర్ భూషన్ కుమార్ మెర్సిడెస్ మేబ్యాక్(పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ జరిగిన)కారు మీద ట్యాక్స్ చెల్లించలేదని పోలీసులు సీజ్ చేసారు.

అమలాపాల్ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

చాలా వరకు రాష్ట్రాల్లో రోడ్డు ట్యాక్స్ కట్టకుండా నడుపుతున్న కార్లను ఆర్‌టిఓ అధికారులు సీజ్ చేస్తున్నారు. రోడ్డు ట్యాక్స్ మరియు జరిమానా చెల్లించిన కార్లను మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. కొన్ని ప్రధాన నగరాల్లో ఇలాంటి ఎన్నో లగ్జరీ కార్లు ఆర్‌టిఓ ఆఫీసుల్లో సీజ్ చేయబడిన ఉన్నాయి.

అమలా పాల్ తనపై వచ్చిన ఆరోపణల గురించి స్పందించలేదు....

English summary
Read In Telugu: Actress Amala Paul and her Mercedes Benz S-Class are in trouble
Please Wait while comments are loading...

Latest Photos