ఘోర కారు ప్రమాదంలో మృతి చెందిన నటి సోనికా చౌహాన్

Written By:

సోనికా చౌహాన్ స్నేహితుడు విక్రమ్ ఛటర్జీ కారును నడుపుతుండగా శనివారం ఉదయం (29/04/17) జరిగిన ఘోర ప్రమాదంలో మరణించింది. అయితే ఈ ప్రమాదంలో విక్రమ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

కారు ప్రమాదంలో మృతి చెందిన నటి సోనికా చౌహాన్

రిపోర్ట్స్ ప్రకారం, విక్రమ్ నడుపుతున్న టయోటా కరోలా ఆల్టీస్ కారు నియంత్రణ కోల్పోవడం ద్వారా డివైడర్లను ఢీ కొట్టి ప్రక్కనే ఫుట్ పాత్ మీద ఉన్న స్టాల్‌ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదం దక్షిణ కలకత్తాలోని రాష్‌బీహారీ అవెన్యూలో ఉన్న లేక్ మాల్ వద్ద చోటుచేసుకుంది.

కారు ప్రమాదంలో మృతి చెందిన నటి సోనికా చౌహాన్

తెల్లవారుజుమున నాలుగు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన కాసేపు తరువాత చుట్టుప్రక్కల వారు గుమిగూడటం జరిగింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైపోయింది.

కారు ప్రమాదంలో మృతి చెందిన నటి సోనికా చౌహాన్

చుట్టుప్రక్కల ఉన్న వారు అక్కడుకు చేరుకుని ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా సోనికా చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. అయితే స్వల్పంగా గాయపడిన విక్రమ్‌ను హాస్పిటల్‌లో చేర్పించారు.

కారు ప్రమాదంలో మృతి చెందిన నటి సోనికా చౌహాన్

ఓ నటి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ప్రమాదాన్ని ఘటన మీద పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇది అధిక వేగం జరిగిన ప్రమాదమా... లేక మరే ఇతర కారణాల వలన జరిగిందా అనే విషయం తెలియాల్సి ఉంది.

English summary
Read In Telugu About Model-Actress Sonika Chauhan Dies In A Car Accident
Story first published: Monday, May 1, 2017, 12:05 [IST]
Please Wait while comments are loading...

Latest Photos