ఎన్నికల ప్రచారానికి మొదటి సారిగా విమానాన్ని వినియోగించిన రాజకీయ నాయకుడు ఎవరో తెలుసా ?

By Anil

ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడి వేడిగా జరుగుతోంది. అందులో ముఖ్యంగా తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత, డిఎమ్‌కే అధినేత కరుణానిధి మరియు ఇతర ముఖ్య పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

అయితే తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత గారు భారీ స్థాయిలో విమానాలు మరియు హెలికాఫ్టర్లను వినియోగించి మరియు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈమె మాత్రమే కాదు ప్రస్తుతం ఆధునిక కాలంలో చాలా మంది రాజకీయ నాయకులు గగన తలం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారాన్ని విమానాల ద్వారా నిర్వహించిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా ? క్రింది స్లైడర్లను చూడండి మీకే తెలుస్తుంది.

 మొదటి వ్యక్తి

మొదటి వ్యక్తి

జర్మనీ నియంత అప్పట్లో ఎన్నికల కోసం మొదటి సారిగా విమానాన్ని వినియోగించాడు. ప్రపంచంలో మొదటి సారిగా ఎన్నికల ప్రచారానికి విమానాన్ని వినియోగించిన వ్యక్తి అడాల్ప్ హిట్లర్. తన ఎన్నికల ప్రచారానికి ప్రయివేట్ విమానాన్ని అద్దెకు తీసుకుని మరీ వినియోగించాడు.

సాధారణ ఎన్నికలు

సాధారణ ఎన్నికలు

అవును, జర్మనీ నియంత అయిన అడాల్ఫ్ హిట్లర్ 1932లో జరిగిన సాధారణ ఎన్నికల ప్రచారానికి విమానాన్ని వినియోగించాడు. అయితే అప్పట్లో ఇతనికి ప్రత్యర్థులుగా నిలిచిన నాయకులు భారీ స్థాయిలో విమాన వినియోగం గురించి భారీ స్థాయిలో విమర్శలు చేశారు. అయితే హిట్లర్ వాటి ఏ మాత్రం పట్టించుకోలేదు. మిగతా నాయకులు మరియు ఎన్నికల ప్రచారానికి రైళ్లను ఉపయోగించేవారు.

 హిట్లర్ మొదటి విమానం

హిట్లర్ మొదటి విమానం

ఎన్నికల ప్రచారం సమయంలో అద్దె విమానంలో తిరిగిన జర్మనీ నాయకుడు హిట్లర్, ఆ తరువాత 1933 లో తన వ్యక్తిగత అవసరాల కోసండి-2600 అనే రిజిస్ట్రేషన్ పేరుతో జంకర్స్ జెయు 52/3ఎమ్ అనే విమానాన్ని కొనుగోలు చేశాడు.

ప్రత్యేక విమానం

ప్రత్యేక విమానం

జంకర్స్ సంస్థ 1931 నుండి జర్మనీలో విమానాల ఉత్పత్తిని ఆరంభించింది. తరువాత 1952 వరకు జర్మనీలో ప్రజా మరియు కార్గో అదేవిధంగా మిలిటరీ సరుకు రవాణా కోసం పనిచేసింది.

 గగన తలం నుండి ప్రచారం నిర్వహించిన ఎన్నికల మొదటి రాజకీయ వేత్త

మొదటి ప్రపంచ యుద్దంలో గెలిచిన తరువాత హిట్లర్ ఎంచుకున్న మొదటి వ్యక్తిగత విహంగం ఇది. ఇందులో బిఎమ్‌డబ్ల్యూ 132 అనే ఇంజన్‌ను ప్రాట్ అండ్ విట్నీ తయారీదారుల లైసెన్స్‌తో అమర్చారు.

 ప్రత్యేకమైన టేబుల్

ప్రత్యేకమైన టేబుల్

ఈ విమానంలో, విమానం యొక్క వేగం, సమయం, ఆల్టీ మీటర్, విమానం ఎత్తును సూచించే అన్ని మీటర్లు కూడా కనబడే విధంగా విమానంలో కూర్చునే వాడు హిట్లర్. ఈ విమానం వినియోగించాల్సి వచ్చినపుడల్లా అదే టేబుల్ దగ్గర కూర్చునే వాడు.

పైలట్

పైలట్

హిట్లర్ తన వ్యక్తి గత విమానానికి లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్‌కు చెందిన హ్యాన్స్ బౌర్ అనే పైలట్‌ను ఎంచుకున్నాడు. బౌర్ విమానాల రిపేరి పరంగా మరియు సుమారుగా లక్ష గంటలు పైగా విమానాన్ని నడిపిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఇక హిట్లర్ ఎన్నికల సమయం మొత్తం తన విమానాన్ని బౌర్ నడిపాడు.

హ్యాన్స్ బౌర్

హ్యాన్స్ బౌర్

హ్యాన్స్‌ బౌర్ ఎంతో లక్కీ పర్సన్ అని హిట్లర్ విపరీతంగా నమ్మేవాడు. తన ఎన్నికల ప్రచారాన్నంతటిని బౌర్ విజయంవంతం చేశాడని మరియు బౌర్ వలనే తాను ఎన్నికల్లో గెలుపొందినట్లు మరియు బౌర్ తన జీవితంలోకి వచ్చిన తరువాత ఎన్నో విజయాలను సాధించినట్లు హిట్లర్ నమ్మేవాడు.

అధికారిక పైలట్‌గా

అధికారిక పైలట్‌గా

హ్యాన్స్‌ బౌర్ తన అధికారిక విమానానికి శాస్వతం పైలట్‌గా ఎంపికయ్యాక, హిట్లర్‌కు బాగా దగ్గరయ్యాడు. ఆ తరువాత హిట్లర్ యొక్క భద్రత విభాగానికి ముఖ్య అధికారిగా నియమితుడయ్యాడు. కొంత కాలానికే హిట్లర్ బ్రౌర్‌కు నిఘా విభాగానికి సంభందించి ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే హక్కులు కల్పించాడు.

 గగన తలం నుండి ప్రచారం నిర్వహించిన ఎన్నికల మొదటి రాజకీయ వేత్త

1934 లో బెర్లిన్‌కు సమీపంలో ఎయిర్ పోర్స్ సంస్థను హిట్లర్ ప్రారంభిచాడు. ఈ సంస్థకు బౌర్‌ను ఛైర్మన్‌గా నియమించాడు. ఈ ఎయిర్ ఫోర్స్ కేంద్రంగా సుమారుగా 8 విమానాలు అందుబాటులో ఉండేవి.

కారు గిఫ్ట్‌గా

కారు గిఫ్ట్‌గా

బౌర్ హిట్లర్‌కు ఎంతో నమ్మకస్తుడు, ఈ నేపథ్యంలో హిట్లర్ తన శాకాహార లక్షణాన్ని బౌర్‌కు చేత పాటింపచేయాలని యత్నించాడు. అయితే బౌర్ మాంసాహారాన్ని వదులుకోలేకపోయాడు. బౌర్‍‌ యొక్క 40 వ జన్మదిన సంవత్సరం సంధర్భంగా హిట్లర్‌ బౌర్‌కు మెర్సిడెస్ బెంజ్ కారును బహుకరించాడు.

కొత్త విమానం

కొత్త విమానం

హిట్లర్‌ యొక్క భద్రత పరంగా మరిన్ని మెరుగైన సదుపాయాలు కలిగిన Focke-Wulf Fw 200 Condor అనే విమానాన్ని హిట్లర్‌ వినియోగించాలని అనుకునేవాడు. అయితే సుమారుగా 26 మంది కలిసి ప్రయాణించే వీలున్న ఈ విమానాన్ని 1939 లో హిట్లర్ కొనుగోలు చేశాడు.

బౌర్ అరెస్ట్

బౌర్ అరెస్ట్

Focke-Wulf Fw 200 Condor అనే విమానంలో బౌర్ వెలుతున్న సంధర్భంలో సోవియట్ ఎయిర్ ఫోర్స్ ఇతనిని 1944 జూలై 8న అరెస్ట్ చేసింది.

 గగన తలం నుండి ప్రచారం నిర్వహించిన ఎన్నికల మొదటి రాజకీయ వేత్త

అప్పటికే జర్మనీ నియంత హిట్లర్‌కు చాలా దగ్గరి వ్యక్తిగా బౌర్ ఉన్నాడనే విషయాన్ని గమనించి సోవియట్ దళం బౌర్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. సుమారుగా 1957 వరకు సోవియట్ దళంలో భందీగానే ఉండిపోయాడు హ్యాన్స్ బౌర్. తరువాత 1993 లో బౌర్ మృతి చెందాడు.

మరిన్ని కథనాల కోసం...

ప్రపంచ వ్యాప్తంగా శక్తివంతమైన దేశాధిపతులు మరియు వారి రాయల్ కార్లు

Most Read Articles

English summary
Adolf Hitler Was The First Politician Campaign Air Travel
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X