బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన భారీ విమానం.. వైరల్ అవుతున్న వీడియో

ఇటీవల మనం ఒక పెద్ద ట్రక్కు అంత కంటే పెద్ద విమానాన్ని కేరళ నుంచి హైదరాబాద్ తరలించే సంఘటన గురించి చదువుకున్నాం. ఇందులో ఎయిర్ ఇండియాకు చెందిన పాత 'ఎయిర్ బస్ ఎ320' విమానాన్ని ఆ ట్రక్కు తరలిస్తోంది. కాగా హైదరాబాద్ కి తరలించే సమయంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. దీనితో విమానం అక్కడే ఇరుక్కుపోవాల్సి వచ్చింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన భారీ విమానం.. వైరల్ అవుతున్న వీడియో

నిజానికి ఈ పాత 'ఎయిర్ బస్ ఎ320' విమానాన్ని హైదరాబాద్ నగరానికి చెందిన ఒక రెస్టారెంట్ యజమాని వేలంలో కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఈ విమానం సర్వీసులో లేదు. కావున రెస్టారెంట్ యజమాని కొనుగోలు చేయగలిగాడు. అయితే ఈ విమానాన్ని ఆ వ్యక్తి కేరళలోని త్రివేండ్రం నుంచి రోడ్డు మార్గంలో హైదరాబాద్ కి తరలిస్తున్నారు. తరలించే సమయంలో ఇది ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన భారీ విమానం.. వైరల్ అవుతున్న వీడియో

ఈ విమానాన్ని హైదరాబాద్ పిస్తా హౌస్ రెస్టారెంట్ గ్రూప్ కొనుగోలు చేసింది. అద్దంకి మరియు హైదరాబాద్ సర్వీస్ రోడ్డుపై మేదరమెట్ల వద్ద రోడ్డు మరమ్మత్తులు చేపడుతున్న కారణంగా అధికారులు అటుగా వెళ్లే వాహనాలను కొరిసపాడు అండర్ పాస్ మార్గంలో మళ్లించారు. ఈ క్రమంలో ఆ విమానం అటుగా వెళ్ళి బ్రిడ్జి కింద ఇరుక్కుంది.

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన భారీ విమానం.. వైరల్ అవుతున్న వీడియో

భారీ విమానం బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేయడమే కాకుండా ఆ భారీ విమానాన్ని సురక్షితంగా బయటకు తీయగలిగారు. దీనితో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన భారీ విమానం.. వైరల్ అవుతున్న వీడియో

ఈ విమానాన్ని కొనుగోలుదారుడు వేలం పాటలో దాదాపు రూ. 75 లక్షలకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విమానం కాస్త రాబోయే రోజుల్లో రెస్టారెంట్ గా మారనుంది. ఈ భారీ విమానం యొక్క ప్రయాణం గత వారంలోనే ప్రయాణమైంది. కాగా ప్రయాణం మొదలైన అతి తక్కువ కాలంలోనే బ్రిడ్జి కింద ఇరుక్కుంది.

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన భారీ విమానం.. వైరల్ అవుతున్న వీడియో

గత వారం ఈ అతి పెద్ద విమానాన్ని రోడ్డు మార్గం ద్వారా తరలించడం చూసిన చాలా మంది జనం ఎంతో ఆశ్చర్యంతో చూడటానికి తండోపతండాలుగా రోడ్డుపైకి వచ్చారు. రోడ్డు పైన గుమికూడిన జనం మరియు పోలీసులను మీరు ఈ వీడియోలో చూడవచ్చు.

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన భారీ విమానం.. వైరల్ అవుతున్న వీడియో

ఇది భారీగా ఉన్న పెద్ద విమానం కాబట్టి మెల్లగా ట్రక్కు సహాయంతో రోడ్డు మార్గంలోనే మెల్లగా తీసుకెళ్తున్నారు. విమానాన్ని తీసుకెళ్తున్న ట్రక్కు కేరళలోని కొల్లాం జిల్లా వద్దకు చేరుకొని బ్రిడ్జ్ దాటే సమయంలో హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆ సమయంలోనే రోడ్డు పక్కన ఉన్న చాలామంది జనం ఈ భారీ విమానాన్ని చూడటానికి కదిలి వచ్చారు.

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన భారీ విమానం.. వైరల్ అవుతున్న వీడియో

నిజానికి పెద్ద పెద్ద భారీ వస్తువులను రోడ్డుపైన రవాణా చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రవాణా చేసే వాహనం అది తరలించే వాహనం కంటే కూడా పరిమాణంలో చిన్నగా ఉన్నప్పుడు ఆ ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది. కావున రోడ్డుపైన ప్రయాణించేటప్పుడు చాలా భద్రతను కల్పించాల్సి ఉంటుంది. దీనికోసం 10 నుంచి 20 మంది పోలీసులు ట్రాఫిక్ నియంత్రిస్తూ ఉంటారు.

భారీ విమానాన్ని తరలించే సమయంలో అటు ఇటు కదలకుండా పటిష్టంగా ఉంచడానికి కావాల్సిన భద్రతలు తీసుకున్నారు. అంతే కాకుండా ఇటువంటి పెద్ద వస్తువులను తరలించడానికి చాలా లాజిస్టిక్స్ కంపెనీలు ఉన్నాయి. ఇలాంటి కంపెనీలలో అనుభవం ఉన్న డ్రైవర్లు ఇలాంటి సాహసాలకు ముందుకు వస్తారు.

బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన భారీ విమానం.. వైరల్ అవుతున్న వీడియో

ఇలాంటి పెద్ద విమానాలను తరలించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు, అందులో కూడా ఇలాంటి పెద్ద వస్తువులను పగటి పూట తరలిస్తే భారీగా ట్రాఫిక్ ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. కావున ఎక్కువగా ఇలాంటి ప్రయాణాలు రాత్రివేళల్లోనే జరుగుతాయి. అందులో కూడా ఇవి చాలా నెమ్మదిగానే ప్రయాణిస్తాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారీ విమానాలు వంటివి రోడ్డుమీద తరలించేటప్పుడు మరింత ఎక్కువ జాగ్రత్తలు తప్పకుండ తీసుకోవాలి. అంతే కాకుండా ఆ రోడ్ల గురించి బాగా అనుభవం ఉన్న డ్రైవర్లు ఆ భారీ వాహనాలను డ్రైవ్ చేయడానికి ఎంచుకోవాలి. అలాంటప్పుడు ఇలాంటి ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతోపాటు, మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Aeroplane gets stuck under bridge while transported on truck details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X