ఎయిర్ ఫ్రెష్‌నర్ పేలడంతో తీవ్రంగా ధ్వంసమైన కారు

Written By:

బాడీ స్ప్రే మరియు ఎయిర్ ఫ్రెషన్‌ర్లు(ఏరోసోల్ స్ప్రేలు) చాలా ప్రమాదకరమైనవని, అంతే కాకుండా వేడి మరియు మంట కారణంగా అవి పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎయిర్ ఫ్రెష్‌నర్ మరియు బాడీ డియోడ్రెంట్లను తయారు చేసే కంపెనీలు కూడా వాటి వేడి మరియు మంటలకు దూరంగా ఉంచండి అని ముద్రిస్తాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కారులో ఎయిర్ ఫ్రెష్‌నర్‌లు ఎందుకు పేలుతాయి

ఓ కారులో ఉన్న ఎయిర్ ఫ్రెష్‌నర్ ఉన్నట్లుండి పేలిపోయింది. దీంతో కారు మొత్తం తీవ్ర ద్వంసమైంది. అసలు బాడీ స్ప్రేలు, డియోడ్రెంట్లు మరియు కార్లలో వినియోగించే ఎయిర్ ఫ్రెష్‌నర్‌లు ఎందుకు పేలుతాయో తెలుసా ?

Recommended Video
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
కారులో ఎయిర్ ఫ్రెష్‌నర్‌లు ఎందుకు పేలుతాయి

కారులోని ఎయిర్ ఫ్రెష్‌నర్ పేలిన ఘటనలో కారు మొత్తం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో మంటలు కూడా చెలరేగాయి. ఎయిర్ ఫ్రెష్‌నర్ పేలుడు ధాటికి ముందు వైపు అద్దం ఎగిరి 75 అడుగుల దూరంలో పడింది.

కారులో ఎయిర్ ఫ్రెష్‌నర్‌లు ఎందుకు పేలుతాయి

ఎయిర్ ఫ్రెష్‌నర్ చూడటానికి ఎంతో చిన్నగా ఉంటుంది. కాని అది పేలితే విధ్వంసం తీవ్రంగా ఉంటుంది. అందుకు నిదర్శనం ఈ ఘటన. ప్రక్కవైపుల ఉన్న రెండు డోర్లు బయటకు విచకున్నాయి. రూఫ్ టాప్ మరియు ఫ్రంట్ ఫ్రేమ్ అన్నీ కూడా వంగిపోయాయి.

కారులో ఎయిర్ ఫ్రెష్‌నర్‌లు ఎందుకు పేలుతాయి

ఈ సంఘటన గురించి పోలీసులు మాట్లాడుతూ, "ఒక కార్ ఫ్రెష్‌నర్ పేలడం ద్వారా ఇంత ప్రమాదం జరిగిందా అని నమ్మలేకపోతున్నామని తెలిపారు. అయితే ఎయిర్ ఫ్రెషనర్‌ స్ప్రేను రిలీజ్ చేసినపుడు, కారులో ఉన్న వ్యక్తి సిగరెట్ వెలిగించడానికి లైటర్‌ను యూజ్ చేసినపుడు ఎయిర్ ఫ్రెష్‌నర్ పేలి ఉంటుందని చెబుతున్నారు.

కారులో ఎయిర్ ఫ్రెష్‌నర్‌లు ఎందుకు పేలుతాయి

ఇక్కడ మరో అకాశం కూడా ఉంది, కారును లాక్ చేసి పబ్‌కు బయట ఎక్కువసేపు పార్క్ చేసి ఉంచడం మరియు కారులో ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. పీడనం పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత కూడా క్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వేడి గాలితో కూడిన కారు ఇంటీరియర్‌లోకి మండే స్వభావం ఉన్న ఎయిర్‌ ఫ్రెష్‌నర్ గ్యాస్‌ను రిలీజ్ చేయడంతో ఇలా జరిగి ఉండవచ్చు.

కారులో ఎయిర్ ఫ్రెష్‌నర్‌లు ఎందుకు పేలుతాయి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మంచి వాసన కోసం ఎయిర్ ఫ్రెష్‌నర్ వినియోగించడం తప్పులేదు. కాని ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల్లో ఎయిర్ ఫ్రెష్‌నర్‌లు పేలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు కనబడే విధంగా ఫ్రంట్ డ్యాష్ బోర్డ్ మీద కాకుండా, కంటికి కనిపించకుండా ఎయిర్ ఫ్రెష్‌నర్ ఉంచుకోవడం ద్వారా ఇలా జరిగే ప్రమాదాన్ని అరికట్టవచ్చు.

Read more on: #ప్రమాదం
English summary
Read In Telugu: Air Freshener Causes Explosion In Car, Causing Burn Injuries To Driver
Story first published: Friday, July 21, 2017, 14:12 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark